Posani Krishna Murali(image credit:X)
ఆంధ్రప్రదేశ్

Posani Krishna Murali: వైసీపీలోకి నటుడు రీఎంట్రీ.. వర్కౌట్ అయ్యేనా?

Posani Krishna Murali: వైసీపీకి రాజీనామా చేసిన నటుడు పోసాని కృష్ణమురళి మళ్లీ యాక్టివ్ కావాలని నిర్ణయించినట్లుగా తెలుస్తున్నది. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్‌ను విమర్శించారని పోసానిని అరెస్ట్ చేయడం, రాష్ట్ర వ్యాప్తంగా కేసులు నమోదు కావడంతో అటు ఇటు తిప్పి ఆఖరికి ఒక్క కేసులో బెయిల్ దొరకడంతో బయటికొచ్చారు. ఆయన అరెస్ట్ అయ్యింది మొదలుకుని రిలీజ్ అయ్యే వరకూ వైసీపీ, ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, వైసీపీ నేతలు అండగా నిలిచారు.

పోసాని సతీమణి కుసుమలతకు స్వయంగా ఫోన్ చేసిన వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు, బయటికి తీసుకొచ్చే బాధ్యత పార్టీదేనని భరోసా ఇచ్చారు. జైలు నుంచి బయటికైతే వచ్చారు కానీ, ఇప్పటికీ వారానికి రెండ్రోజులు పోలీసుల ఎదుట హాజరవుతూ వస్తున్నారు. అయితే జరిగిందేదో జరిగిపోయింది, తాను కష్టాల్లో ఉన్నప్పుడు అండగా నిలిచిన పార్టీకి సేవలు అందించాలని నిర్ణయించుకున్నారని ప్రచారం జరుగుతోంది.

అందుకే యాక్టివ్ కావాలని, రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి రావడానికి తనవంతు కృషి చేసి, పార్టీని బలోపేతం చేయడానికి కుటుంబ సభ్యులతో కూడా చర్చించారని తెలిసింది.

యాక్టివ్ పాలిటిక్స్‌లోకి..
వాస్తవానికి ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చాక ఎంతోమంది వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు, నేతలు, మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలను పలు కేసుల్లో అరెస్ట్ చేసింది. ఇవన్నీ అక్రమ అరెస్టులే అని వైసీపీ మండిపడుతూ వస్తోంది. వారిలో కొందరు జైలు నుంచి బెయిల్‌పైన రిలీజ్ కాగా, ఇంకా కొందరు బెయిల్ రాకపోవడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు.

అయితే దీనిపై వైసీపీ వర్షన్ వేరేలా ఉంది. అనుకోని ఫలితాలతో ఢీలా పడిన నాయకులు కేసులపై భయంతో రాజకీయాలకు దూరంగా ఉండాలని నిశ్చయించుకున్న నాయకులను ఈ కూటమి ప్రభుత్వమే తిరిగి యాక్టివ్ చేస్తున్నదని వైసీపీ నేతలు చెప్పుకుంటున్నారు.

Also read: SI Sudhakar Yadav: జగన్ కు గోరంట్ల మాధవ్ స్టైల్ వార్నింగ్ ఇచ్చిన ఎస్సై.. మనుషులమేనంటూ..

ఎందుకంటే రాజకీయాలకు దూరమని ప్రకటించిన పోసాని సోమవారం నాడు వైసీపీ కేంద్ర కార్యాలయంలో ప్రత్యక్షమయ్యారు. వైసీపీ కీలకనేత, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డిని కలిశారు. తాజా రాజకీయ పరిణామాలు, పార్టీ పరిస్థితిపై ఇరువురి మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది.

వాస్తవానికి పోసానికి వైసీపీ ఆఫీసుకు వెళ్లాల్సిన అవసరం లేదు. యాక్టివ్ కావడానికే ఇలా వచ్చారని, త్వరలో తిరిగి యాక్టివ్ పాలిటిక్స్‌లోకి పోసాని ఎంటర్ అవుతున్నారని వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. రాజా రీ ఎంట్రీ ఉంటుందా? లేదా? అన్నదానిపై క్లారిటీ రావాల్సి ఉంది.

స్వేచ్ఛ E పేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!