SI Sudhakar Yadav: ఏపీలో సేమ్ టు సేమ్ అదే సీన్ రిపీట్ అయింది. ఔను.. గతంలో మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ సీఐగా విధులు నిర్వహించే సమయంలో సవాల్ విసిరిన విషయం తెలిసిందే. ఆ సవాల్ అప్పట్లో పెద్ద ఫేమస్. ఇప్పుడు ఓ ఎస్సై అదే రీతిలో సవాల్ విసిరారు. ఏకంగా మాజీ సీఎం జగన్ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు. ఆరోజు సీఐగా గోరంట్ల మాధవ్ చేసిన కామెంట్స్ రీతిలో, ఈ ఎస్సై కామెంట్స్ కూడా వైరల్ గా మారాయి. ఇక అసలు సంగతిలోకి వెళితే..
శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడులో మాజీ సీఎం జగన్ పర్యటించారు. ఈ పర్యటనలో మీడియా ముఖంగా మాట్లాడిన జగన్, కాస్త సహనం కోల్పోయారని చెప్పవచ్చు. జగన్ మాట్లాడుతూ.. పోలీసు అధికారులకు చెబుతున్నా, అధికారంలోకి వచ్చిన వెంటనే బట్టలూడదీసి కొడతామని కాస్త సీరియస్ కామెంట్స్ చేశారు.
రాప్తాడు పర్యటనలో పోలీసులు పూర్తి నిబంధనలకు విరుద్దంగా ప్రవర్తించారన్నది వైసీపీ ఆరోపణ. దీనితో జగన్ సహనం కోల్పోయి కామెంట్స్ చేశారన్నది ఒక వర్గం వాదన. ఒక సీఎం హోదాలో పని చేసిన జగన్, అలా మాట్లాడి ఉండకూడదన్నది మరో వర్గం వాదన. ఏది ఏమైనా జగన్ చేసిన కామెంట్స్ కాస్త ఇబ్బందికరంగా ఉన్నాయన్నది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం.
Also Read: Renu Desai: పొలిటికల్ ఎంట్రీ.. రేణు దేశాయ్ సంచలన వ్యాఖ్యలు
జగన్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ గా మారాయి. బట్టలూడదీసి కొడతామని హెచ్చరించడంతో పోలీస్ అధికారులు కూడా ఒక్కొక్కరుగా రియాక్ట్ అవుతున్నారు. జిల్లా ఎస్పీ రత్న ఇదే విషయంపై స్పందిస్తూ, జగన్ పర్యటన కు నిబంధనలకు అనుగుణంగా భద్రత కల్పించామన్నారు. ఇద్దరు ఎస్పీలతో బందోబస్తు నిర్వహించామని తెలిపారు. చాపర్ నుండి ఒకేసారి బయటకు రావడంతో చిన్నపాటి తోపులాట జరిగిందన్నారు.
జగన్ పర్యటన కు భారీ పోలీస్ బందోబస్తు కల్పించామని, పోలీస్ సంయమనం తో వ్యవహరించారన్నారు. కొంతమంది కవ్వించినా పోలీస్ ఎక్కడ సంయమనం కోల్పోలేదని, అన్ని వీడియో ఫుటేజ్ లు పరిశీలిస్తున్నామని తెలిపారు. అధికారంలో వచ్చిన తర్వాత పోలీసుల బట్టలు విప్పిస్తాం అని జగన్ చేసిన కామెంట్స్ పై స్పందించిన సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న మాట్లాడుతూ.. పోలీస్ యూనిఫాంని తాము కష్టపడి సాధించామని తెలిపారు.
ఇది ఎవరు మాకు ఇచ్చింది కాదని, ఒకవేళ తాము తప్పు చేసి ఉంటే సర్వీస్ రూల్స్ ప్రకారం చర్యలు తీసుకోవచ్చన్నారు. మా డ్యూటీ చేసాం… ఎవరికి అనుకూలంగా పనిచేయలేదు సిన్సియర్గా పనిచేస్తున్నామని, ఇలాంటి కామెంట్స్ పై తాను స్పందించనని ఎస్పీ చెప్పుకొచ్చారు.
రామగిరి ఎస్సై స్పందన ఇదే..
మాజీ సీఎం జగన్ పోలీసులపై చేసిన వ్యాఖ్యలకు రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. జగన్ అంటూ సంభోదించిన ఎస్సై సుధాకర్ యాదవ్, పోలీసులను బట్టలు ఊడదీసి కొడతా అంటున్నావ్.. యూనిఫాం నువ్వు ఇస్తే వేసుకున్నది కాదు.. కష్టపడి చదివి సాధించినది, నువ్వెవడో వచ్చి ఊడదీస్తా అంటే ఊడదీయడానికి అరటి తొక్క కాదన్నారు. నిజాయితీగా ఉంటాం నిజాయితీగా చస్తాం అంతే తప్ప అడ్డమైన దారులు తొక్కం అంటూనే, జాగ్రత్తగా మాట్లాడాలి అంటూ హెచ్చరించారు.
Also Read: BJP MP Etela Rajender: బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా ఈటెల రాజేందర్? రేపే అధికారిక ప్రకటన?
ఈ పరిస్థితిని బట్టి నాడు సీఐ హోదాలో గోరంట్ల మాధవ్ స్టైల్ వార్నింగ్ నేడు ఎస్సై సుధాకర్ యాదవ్ ఇచ్చారని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే వైసీపీ టికెట్ పొంది ఎంపీగా మాధవ్ ఒక పర్యాయం విజయాన్ని అందుకున్నారు. జగన్ వర్సెస్ పోలీస్ మధ్య మాటల యుద్ధం సాగుతున్న వేళ, నాడు మాధవ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. మొత్తం మీద జగన్ చేసిన వివాదాస్పద కామెంట్స్, ఎక్కడికి దారితీస్తాయోనన్నది ఇప్పుడు ముమ్మర చర్చ సాగుతోంది.
ఎస్సై చేసిన కామెంట్స్ : https://www.facebook.com/share/v/1ANX1bHyH6/