Renu Desai: రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సరసన హీరోయిన్‌గా నటించి, ఆ తర్వాత ఆయనను పెళ్లి చేసుకుని, కొన్ని అనివార్య పరిస్థితుల్లో ఆయన నుంచి విడిపోయింది రేణు దేశాయ్. వారిద్దరూ విడిపోయినప్పటికీ, పిల్లల విషయంలో రేణు దేశాయ్ తీసుకున్న శ్రద్ధ, వారి కోసం ఆమె చేసిన త్యాగం ఎప్పుడూ కొనియాడబడుతుంటాయి. నిజంగా ఒక తల్లిగా తన పిల్లలని ఎలా చూసుకోవాలో, ఎలా పెంచాలో.. అలా పెంచారు రేణు దేశాయ్. అలాగే ఆమెకు సమాజ సేవ చేయడమన్నా కూడా ఎంతో ఇష్టం. ముఖ్యంగా మూగ జీవాల కోసం ఆమె ఓ సంస్థనే నడుపుతున్నారు.
Also Read- Akhil6: మా నాయన నాకో మాట చెప్పినాడు.. అఖిల్ ఈసారి మాస్ అవతార్‌లో!
ఈ సంస్థ కోసం ఇటీవల ఆమె సోషల్ మీడియా వేదికగా విరాళాలు కూడా సేకరించారు. ఆ విరాళాలతో ఆమె ఏమేం చేస్తున్నారో, ప్రతీది పిన్ టు పిన్ అప్డేట్ ఇచ్చి.. సమాజం పట్ల తనకి ఉన్న నిబద్ధతని చాటుకున్నారు. మూగ జీవాలకు అండగా, వాటిని ఆప్యాయంగా దగ్గరకు తీస్తూ గొప్ప మనసును చాటుకుంటున్నారు. మరీ ముఖ్యంగా గాయపడిన మూగ జీవాలకు ఆమె సేవలు అందించడమనేది నిజంగా అద్భుతమైన విషయంగా చెప్పుకోవాలి. మరి అలాంటి రేణు దేశాయ్ తాజాగా పొలిటికల్ ఎంట్రీపై సంచలన కామెంట్స్ చేశారు. దీంతో ఆమె పేరు వార్తలలో హైలెట్ అవుతోంది.
తాజాగా ఆమె ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ ఇంటర్వ్యూలో ఆమెకు పాలిటిక్స్ అంటే మీకు ఇష్టమేనా? పొలిటికల్ ఎంట్రీ ఏమైనా ఇచ్చే అవకాశం ఉందా? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నార్మల్‌గా అయితే అంతా అలాంటి ఆలోచన లేదని రేణు దేశాయ్ చెబుతుందని అనుకుంటారు. కానీ, ఆమె షాకింగ్‌గా స్పందించారు. ‘రాజకీయాలలోకి వెళ్లడమనేది నా జాతకంలోనే రాసి ఉంది. గతంలో నన్ను ఓ పార్టీ వారు ఆహ్వానించారు కూడా. కానీ నేనే తిరస్కరించాను. ఎందుకంటే, నా పిల్లల కోసం. వారిని పెంచి, పెద్ద చేయాల్సిన బాధ్యత నాపై ఉండటంతో.. సున్నితంగా ఆ ఆఫర్‌ని తిరస్కరించాను. అయితే ఇప్పటికీ రాజకీయాలపై నాకు అదే అభిప్రాయం ఉంది. కాకపోతే నేను నా డెస్టినీకి వ్యతిరేకంగా ప్రయాణిస్తున్నాను’ అని రేణు దేశాయ్ చెప్పుకొచ్చింది. (Renu Desai on Political Entry)
ప్రస్తుతం ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు హాట్ టాపిక్‌గా మారాయి. మరీ ముఖ్యంగా ఆమెను ఇంతకు ముందు రాజకీయాలలోకి ఆహ్వానించింది ఎవరనేలా అంతా తెగ ఆలోచిస్తున్నారు. మరీ ముఖ్యంగా వారి ఆలోచనలో ఓ పార్టీ మెదులుతుంది. ఆ పార్టీనే రేణుకి ఆఫర్ ఇచ్చి ఉంటుందనేలా మాట్లాడుకుంటున్నారు. మరోవైపు, నిజంగా మీరు పొలిటికల్ ఎంట్రీ ఇవ్వాలనుకుంటే జనసేన (Janasena) మీకు స్వాగతం పలుకుతుంది అనేలా జనసైనికులు కొందరు కామెంట్స్ చేస్తుండటం విశేషం. ఏదిఏమైతేనేం.. ఒకే ఒక్క స్టేట్‌మెంట్‌తో రేణు దేశాయ్ పేరు వార్తలలో మారు మోగుతుంది. ఈ విషయమై ఓ నాలుగైదు రోజుల పాటు ఆమె పేరు వార్తలలో ఉన్నా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు