New Jobs in TG (imagecredit:twitter)
తెలంగాణ

New Jobs in TG: త్వరలో మరో పన్నెండు వేల ఉద్యోగాల నోటిఫికేషన్లు.. సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ స్వేచ్చ: New Jobs in TG: ప్రజా ప్రభుత్వంలో మరిన్ని కొత్త కొలువుల భర్తీకి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి విడతలో వివిధ శాఖలకు సంబంధించి పన్నెండు వేల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనకు అవకాశముందని ఆర్థిక శాఖ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు వీలైనంత త్వరగా ప్రతిపాదనలు సిద్దం చేసి, ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఆమోదంతో పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు పంపేలా కసరత్తు చేస్తున్నామని సచివాలయ వర్గాలు అంటున్నాయి.ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా, కొత్త ఉద్యోగాల కల్పనకు పరిస్థితులు అనుకూలించక పోయినా ముందుకే వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది.

ఎన్నికలకు ముందు యువతకు ఇచ్చిన హామీ మేరకు నిరంతరం ఖాళీ పోస్టుల గుర్తింపు, వాటి భర్తీకి అవసరమైన కార్యాచరణ ఉండాలని ఇటీవల సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈమేరకు ఆర్థిక శాఖ ప్రయత్నాలు ముమ్మరం చేసింది. తాజాగా ప్రకటించే పోస్టుల కోసం ప్రభుత్వంపై ఏటా వెయ్యి కోట్ల ఆర్థిక భారం పడుతుందని ఒక అంచనాను ఆర్థిక శాఖ సిద్దంచేసింది. అయినప్పటికీ ముందుకే వెళ్లాలని సీఎం సూచించినట్లు తెలిసింది. ఒక రకంగా ముందెన్నడూ లేని విధంగా ఆర్థిక శాఖ ఓ భారీ కసరత్తు చేస్తోంది.

అన్ని ప్రభుత్వ శాఖలో ఉన్న ఉద్యోగులు ఎందరు, వాటిల్లో శాంక్షన్డ్ పోస్టులు ఎన్ని, వాటిల్లో ఖాళీలు తలెత్తితే కాంట్రాక్ట్ పద్దతిలో, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేసిన పోస్టులు ఎన్ని, వీటికి ఆర్థిక శాఖ అనుమతి ఉందా, జీత భత్యాల చెల్లింపులు ఏ విధంగా జరుగుతున్నాయి. తదితర వివరాలను అన్ని శాఖల నుంచి తెప్పిస్తున్న ప్రభుత్వం మొత్తం కలిపి ఉద్యోగుల డేటా బేస్ ను సిద్దం చేస్తోంది. దీనివల్ల ఏశాఖలో ఏ ఉద్యోగి ఎప్పడు రిక్రూట్ అయ్యాడు, పదవీ విరమణ ఎప్పుడు లాంటి వివరాలు రేడీమేడ్ గా ఆర్థికశాఖ వద్ద ఉండబోతున్నాయి. దీని ద్వారా రానున్న రోజుల్లో ఏర్పడబోయే ఖాళీలు ముందస్తుగానే తెలుస్తాయని, అందుకు తగిన విధంగా జాబ్ క్యాలెండర్ రూపొందించేందుకు అవకాశముంటుందని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు.

Also Read: Ponguleti Srinivasa Reddy: స్లాట్ బుకింగ్ ఇక సులువు..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి

అదే సమయంలో ఆర్థికశాఖ అనుమతి లేకుండా ఏశాఖలోనైనా అదనపు సిబ్బంది పనిచేసినా, ప్రభుత్వ నియమాలకు విరుద్ధంగా హెచ్ఓడీల్లో సొంతంగా రిక్రూట్ చేసుకున్న వివరాలు నమోదు కానున్నాయి. కాగా పోలీస్, రెవెన్యూ శాఖల్లో పనిచేస్తున్న పూర్తి స్థాయి ఉద్యోగుల వివరాలు ప్రభుత్వానికి చేరలేదు. ఇదిలా ఉంటే ప్రభుత్వం ఇటీవల రెగ్యులర్ పోస్టుల్లో భర్తీ చేసిన దాదాపు 19 వేల కొలువుల్లో ఇప్పటికే విధులు నిర్వర్తిస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ సిబ్బంది భవితవ్యంపై కూడా ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. ఇందుకు త్రిసభ్యకమిటీని కూడా నియమించింది, అధ్యయనం చేసి నెలరోజుల్లో నివేదిక ఇవ్వాల్సిందిగా సూచించింది.

అయితే గడిచిన ఇరవై ఏళ్లుగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న ఈ సిబ్బంది పట్ల ప్రభుత్వం పూర్తి సానుభూతిగా ఉన్నట్లు తెలుస్తోంది. వారిని వివిధ శాఖల్లో సర్దుబాటు చేసే యోచనలో ఉంది. ప్రస్తుతం గత గ్రూప్ వన్ రిక్రూట్ మెంట్ తుదిదశకు చేరుకుంది. తాజాగా మరో యాభై దాకా గ్రూప్ వన్ ఖాళీలను గుర్తించినట్లు సమాచారం. అదేవిధంగా త్వరలో జరిగే రిక్రూట్ మెంట్ కు ఓ ప్రత్యేకత కూడా ఉండబోతున్నట్లు తెలిసింది. మొదటిసారి గెజిటెడ్ ఆఫీసర్స్ సర్వీసెస్ కింద అన్ని శాఖల్లో కలిపి సుమారు ఐదు వేల పోస్టుల భర్తీకి ప్రయత్నాలు జరుగుతున్నట్లు సచివాలయ వర్గాలు చెబుతున్నాయి.

అదే విధంగా గతంలో వివిధ శాఖలకు చెందిన ఇంజనీరింగ్ పోస్టులు భర్తీ విడివిడిగా జరిగేది, ఈసారి అలా కాకుండా ఇంజనీరింగ్ సర్వీసెస్ ద్వారా ఒకే సారి ఈ పోస్టుల భర్తీచేయాలని నిర్ణయించారు. ఇవి రెండు వేల పోస్టుల దాకా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇవి కాకుండా గ్రూప్ -3, గ్రూప్ -4 పోస్టులు మరో ఐదు వేల దాకా ఉండవచ్చని అధికారులు చెబుతున్నారు. ప్రజా ప్రభుత్వం ఏర్పాటైన తొలి నాళ్లలో అత్యంత ప్రాధాన్యత అంశంగా, యువతకు ఇచ్చిన గ్యారంటీ అమలు దిశగా జాబ్ క్యాలెండర్ ను ప్రభుత్వం రూపొందించింది.

అయితే కొన్ని సాంకేతిక కారణాల వల్ల దీని అమలులో జాప్యం జరిగింది. ఆ ఆలస్యాన్ని సవరిస్తూ ఆర్థిక శాఖ కొత్త జాబ్ క్యాలెండర్ కోసం కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ బిల్లుకు గవర్నర్ ఆమోద ముద్ర పడిన వెంటనే ఇచ్చిన హామీ మేరకు పెద్ద ఎత్తున ఉద్యోగాల భర్తీకి అవకాశం కలుగుతుంది.

Also Read: SC on HCU Land: దూకుడు పెంచిన సుప్రీం.. కంచ గచ్చిబౌలి భూ వివాదంపై కీలక అప్‌డేట్..

Just In

01

Hyderabad News: జీడిమెట్లలో సామాజిక కార్యకర్త అరుదైన ఆలోచన.. ప్రాణానికి కవచం గా ‘గో స్లో’ నినాదం..?

Hanumakonda District: ముసాయిదా ఓటర్ల జాబితా సిద్ధం: కలెక్టర్ స్నేహ శబరీష్

Bigg Boss Telugu Season 9: అలాంటి ట్రాక్స్ లేకుండా బిగ్ బాస్ నడపలేరా? ఏకిపారేస్తున్న నెటిజన్స్

BRS Party: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలని డిమాండ్..?

Nursing Schools Scam: రాష్ట్రంలో నర్సింగ్ స్కూల్స్ దందాలు.. పట్టించుకోని అధికారులు