Manchu Family Dispute: మంచు ఫ్యామిలీ (Manchu Family) లో నెలకొన్న వివాదం ఇప్పుడప్పుడే తెగేలా లేదు. కొన్ని రోజులుగా కాస్త సద్దుమణిగినట్లుగా అనిపించింది. మళ్లీ వారి ఫ్యామిలీ వివాదం మొదటికి వచ్చింది. మరోసారి మంచు ఫ్యామిలీ పోలీస్ మెట్లు ఎక్కింది. నార్సింగి పోలీస్ స్టేషన్‌లో తన అన్న మంచు విష్ణుపై మంచు మనోజ్ ఫిర్యాదు చేసినట్లుగా తెలుస్తుంది. దీంతో అంతా వీరి గొడవకు అంతే లేదిక.. అనేలా కామెంట్స్ స్టార్ట్ చేశారు. ఏదైనా గొడవ, అందులోనూ ఇండస్ట్రీలో కాస్త పేరున్న ఫ్యామిలీ కాబట్టి, వెంటనే ఈ గొడవ ఎక్కడ మొదలైందో, అక్కడ ఆపేయాలని చూడాలి. కానీ, అలా జరగడం లేదు.
తాజాగా మనోజ్ మంచు (Manoj Manchu) ఇచ్చిన ఫిర్యాదులో.. ఇంట్లో తను లేనప్పుడు మంచు విష్ణు (Vishnu Manchu).. తన కారుతో పాటు, వస్తువులను దొంగిలించాడని పేర్కొన్నారు. తను నివసిస్తున్న జల్‌పల్లి ఇంటిలో దాదాపు 150 మంది చొరబడి విధ్వంసం చేశారని, ఇంటిలో విలువైన వస్తువులతో పాటు కార్లను కూడా ఎత్తుకెళ్లిపోయారని ఫిర్యాదు చేశారు. అంతేకాదు తన ఇంటిలో చోరి అయిన వస్తువులు, కారు మంచు విష్ణు ఆఫీసులో లభ్యమైనట్లుగా కూడా పేర్కొన్నారు.
Also Read- Akhil6: మా నాయన నాకో మాట చెప్పినాడు.. అఖిల్ ఈసారి మాస్ అవతార్‌లో!
ఈ ఫిర్యాదుపై మంచు మనోజ్ స్పందిస్తూ.. ‘‘నా ఇంట్లోకి గోడలు దూకి వచ్చి కార్లను ఎత్తుకొని వెళ్లారు. ముఖ్యమైన వస్తువులన్నిటిని పగలకొట్టి విధ్వంసం చేశారు. నా కూతురు బర్త్‌డే కొరకు నేను రాజస్థాన్‌కి వెళ్లగా, నా సోదరుడు విష్ణు మంచు నా ఇంటిని ధ్వంసం చేశాడు. నా ఇంట్లో జరుగుతున్న పరిణామాలపై మా నాన్న మోహన్ బాబు (Manchu Mohan Babu)తో మాట్లాడేందుకు ప్రయత్నించాను. ఆయన నాతో మాట్లాడడానికి అందుబాటులోకి రాలేదు. నాకు న్యాయం చేయమని పోలీసులను కలిసి విజ్ఞప్తి చేశాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ ఫిర్యాదు వారి ప్యామిలీపై మరోసారి టాలీవుడ్ వ్యాప్తంగా వార్తలు వైరల్ అవుతున్నాయి.
Also Read- Sushma Bhupathi: చీరకట్టులో మెరిసిన సుష్మా భూపతి.. వావ్ అంటున్న నెటిజన్స్..
వాస్తవానికి ఈ వివాదం ఇప్పటిది కాదు. మంచు మనోజ్ రెండో పెళ్లి చేసుకున్నప్పటి నుంచి వారి ఫ్యామిలీలో వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ పెళ్లి మంచు విష్ణుకి ఇష్టం లేదనేలా వార్తలు వచ్చాయి. ఆ తర్వాత వారిద్దరి మధ్య బహిరంగంగానే గొడవ జరిగింది. ఆ గొడవను కూడా కవర్ చేసుకోవాలని చూశారు. కానీ ఆ తర్వాత స్పష్టంగా అన్నదమ్ముల మధ్య గొడవలు జరుగుతున్నాయనేది తేలిపోయింది. ఇటీవల మంచు ఫ్యామిలీ గొడవ బాగా ముదిరిపోయింది. మోహన్ బాబు ఫ్రస్ట్రేషన్‌తో మీడియాపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ తర్వాత సారీ చెబుతూ లేఖలు కూడా నడిచాయి.
ఇంత జరుగుతున్నా.. ఈ వివాదానికి బ్రేక్ వేయాలని ఆ ఇంటి పెద్ద అనుకోకపోవడం విడ్డూరం. చూస్తుంటే, ఆయన చేతులు కూడా దాటిపోయిందని.. ఈ వివాదాన్ని మొదటి నుంచి ఫాలో అయ్యే వారు అనుకుంటూ ఉండటం విశేషం. ఫైనల్‌గా, ఈ వివాదానికి ఎలా ఫుల్ స్టాప్ పడుతుందనేది మాత్రం కాలమే సమాధానమివ్వాలి.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు