SLBC Tunnel Update: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గం అమ్రాబాద్ మండలం దోమలపెంట గ్రామంలో గల ఎస్ ఎల్ బి సి, సొరంగ ప్రమాద ప్రదేశంలో చిక్కుకున్న వారి ఆచూకీ తెలుసుకునేందుకు 46 రోజులుగా సహాయక చర్యలను కొనసాగిస్తున్నట్లు టన్నెల్ ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి తెలిపారు . ఎస్ ఎల్ బి సి, టన్నెల్ ఇన్లెట్ 1 వద్ద సహాయక బృందాల ఉన్నతాధికారులతో కలిసి సహాయక చర్యలను పర్యవేక్షించారు.
ఎస్ ఎల్ బి సి, టన్నెల్ పల కొనసాగుతున్న సహాయక చర్యల గురించి ప్రత్యేక అధికారి శివశంకర్ లోతేటి వివరిస్తూ…… ప్రమాద ప్రదేశంలో ఎలాంటి చర్యలు చేపట్టకుండా, మిగిలిన ప్రదేశమంతా సహాయక చర్యలు చేపడుతున్నట్లు, మట్టి తవ్వకాలు చేపడుతూ, ఐదు ఎస్కావేటర్ ల సహాయంతో కన్వేయర్ బెల్ట్ ద్వారా మట్టి నీ బయటకు తరలిస్తున్నట్లు .
Also Read: Farmers Land Dispute: నవాపేట్ భూ వివాదం.. రైతుల హక్కుల కోసం పోరాటం
మట్టి తవ్వకాలకు అడ్డంకిగా ఉన్న టీబీఎం స్టీల్ భాగాలను దక్షిణ మధ్య రైల్వేకు చెందిన సహాయక బృందాలు నిరంతరం కత్తిరిస్తూ, లోకో ట్రైన్ ద్వారా బయటికి తరలిస్తున్నట్లు తెలిపారు. సొరంగం లోపల నిరంతరాయంగా వస్తున్న ఊట నీటిని అత్యధిక సామర్థ్యం గల పంపుల ద్వారా బయటికి పంపింగ్ చేపడుతూ సహాయక చర్యలు వేగవంతం చేస్తున్నట్లు వివరించారు.
మట్టి తవ్వకాలకు అనుగుణంగా వెంటిలేషన్ ప్రక్రియను ముందుకు కొనసాగిస్తున్నట్లు, సహాయక సిబ్బంది కి అవసరమైన అన్ని రకాల సహాయ సామాగ్రిని అందుబాటులో ఉండేలా చర్యలు చేపడుతున్నట్లు తెలియజేశారు.
Also Read: Sand Mafia: మట్టిలో మాఫియా.. మేడ్చల్‌లో మట్టి దందా వెలుగులోకి!
ఈ సమావేశంలో, ఆర్మీ అధికారులు, జేపీ కంపెనీ సీనియర్ ప్రాజెక్టు ఇంజనీర్ సంజయ్ కుమార్ సింగ్, ఎస్ డి ఆర్ ఎఫ్ అధికారి గిరిధర్ రెడ్డి, సింగరేణి మైన్స్ రెస్క్యూ అధికారులు, హైడ్రా అధికారి, దక్షిణ మధ్య రైల్వే అధికారీ తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు