NPCIL Jobs ( Image Source: Twitter)
జాబ్స్

NPCIL Jobs: కరెంట్ ఆఫీసులో ఉద్యోగాలు.. నెలకు 70,000 జీతం.. వెంటనే అప్లై చేయండి!

NPCIL Jobs:  నిరుద్యోగులకు న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) గుడ్ న్యూస్ చెప్పింది. రిక్రూట్‌మెంట్ లో భాగంగా మొత్తం 400 ఎగ్జిక్యూటివ్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. B.Tech/B.E ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 10-04-2025న ప్రారంభమై 30-04-2025న ముగుస్తుంది. అభ్యర్థి NPCIL వెబ్‌సైట్ npcil.nic.in ద్వారా ఆన్లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి.

NPCIL ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ PDF 08-04-2025న npcil.nic.inలో విడుదల చేయబడింది. పూర్తి ఉద్యోగ వివరాలు, ఖాళీ, వయోపరిమితి, దరఖాస్తు రుసుము, ఎంపిక ప్రక్రియ , దరఖాస్తు ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం..

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) ఎగ్జిక్యూటివ్ ట్రైనీ రిక్రూట్‌మెంట్ 2025 నోటిఫికేషన్ రోజు విడుదల చేశారు. ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ 30-04-2025. ఖాళీ వివరాలపై ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్‌ను చదివి దరఖాస్తు చేసుకోవచ్చు.

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCIL) GATE 2023/2024/2025 ద్వారా ఎగ్జిక్యూటివ్ ట్రైనీ 2025 కోసం అధికారికంగా నియామక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అర్హత ఉన్న అభ్యర్థులు లింక్ npcil.nic.in పై క్లిక్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోండి.

ముఖ్యమైన సమాచారం

దరఖాస్తు రుసుము

జనరల్/EWS/OBC (పురుషులు) కోసం: రూ. 500/- ను చెల్లించాలి.

SC/ST/PwBD/మాజీ సైనికులు/మహిళలు/NPCIL ఉద్యోగులకు: లేదు

NPCIL నియామకం 2025 వయోపరిమితి

జనరల్/EWS వారికి గరిష్ట వయోపరిమితి: 26 సంవత్సరాలు

OBC (NCL) వారికి గరిష్ట వయోపరిమితి (సడలింపు – 3 సంవత్సరాలు) : 29 సంవత్సరాలు

SC/ST వారికి గరిష్ట వయోపరిమితి: 31 సంవత్సరాలు

PwBD కి గరిష్ట వయోపరిమితి: 10 సంవత్సరాలు

మాజీ సైనికులు : 5 సంవత్సరాలు (31 సంవత్సరాలు)

నిబంధనల ప్రకారం వయో సడలింపు వర్తిస్తుంది.

అర్హత

అభ్యర్థులు మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, సివిల్ ఇంజనీరింగ్‌లో B.Tech/B.E (కనీసం 60% మార్కులు తో ఉత్తీర్ణులై ఉండాలి)

స్టైఫండ్

స్టైఫండ్ – శిక్షణ సమయంలో నెలవారీ స్టైపెండ్ – రూ.74,000/- ను ఇస్తారు.

ముఖ్యమైన తేదీలు 

NPCIL నియామకం 2025 ముఖ్యమైన తేదీలు

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ప్రారంభ తేదీ: 10-04-2025

ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవడానికి ముగింపు తేదీ: 30-04-2025

దరఖాస్తు రుసుము చెల్లింపు: 10-04-2025 నుండి 30-04-2025

ఇంటర్వ్యూ తేదీ : 09-06-2025 నుండి 21-06-2025

Just In

01

Minister Sridhar Babu: పరిశ్రమల ఏర్పాటుకు ఇక్కడ అన్నీ అనుకూలమే!

CBI Director Praveen Sood: హైదరాబాద్ వచ్చిన సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్​ సూద్.. అందుకోసమేనా..?

Jajula Surender: సమీక్షలు కాదు సత్వర చర్యలు చేయండి: జాజుల సురేందర్

KTR: రాబోయే ఆరు నెలల్లో ఉప ఎన్నికలు ఖాయం.. కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు

Expand Dog Squad: రాష్ట్రంలో నేరాలను తగ్గించేందుకు పోలీసులు సంచలన నిర్ణయం..?