Prajavani Jangaon: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్ (రెవెన్యూ) రోహిత్ సింగ్ ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. ప్రజల తమ సమస్యలను అధికారులకు నివేదించారు.
ప్రజావాణిలో ప్రధానంగా బచ్చన్నపేట మండలం కొన్నే గ్రామం పరిధిలోని రామచంద్ర గూడెం లో 10 సంవత్సరాల క్రితం రైతులము 60 ఎకరాలలో నీలగిరి చెట్లు సాగు చేస్తున్నారని, దీంతో పరిసరాల్లోని సన్న, చిన్నకారు రైతుల వ్యవసాయ భూములకు వేసుకున్న బోర్లలో నీరు ఇంకి పోతున్నదని ఆవేదన చెందారు.
Also Read: Indiramma Houses: ఇందిరమ్మ ఇండ్లపై అలర్ట్.. మిమ్మల్ని మామూళ్లు అడుగుతున్నారా?
నీలగిరి చెట్లు తొలగించేందుకు తగు చర్యలు తీసుకోవాలని అదనపు కలెక్టర్ ను కోరారు. దేవరుప్పుల మండలంకు చెందిన గోలి సోమిరెడ్డి వారసత్వ భూమి సర్వే నెంబర్లను సరిచేయాలని దరఖాస్తును అందించారు. లింగాల గణపురం మండలం నేలపోగుల రెవెన్యూ పరిధిలో సర్వేనెంబర్ 435/ 4 లోని 20 గుంటల భూమి, ఇల్లును తల్లి భూలక్ష్మి అక్క స్వరూప కు పట్టా చేసిందని, వారసత్వ హక్కుగా తనకు రావలసి ఉన్నదని తనకు న్యాయం చేయవలసిందిగా పసునూరి సమ్మయ్య విజ్ఞప్తి చేశారు. రఘునాథపల్లి మండలం కుర్చపల్లి గ్రామానికి చెందిన వారాల వెంకట నారాయణ సర్వేనెంబర్ 56/ బి/ 1 లో ఒక ఎకరం 22 కుంటల వారసత్వ భూమి 2000 సంవత్సరం నుండి ధరణి వచ్చేనాటికి పట్టా ఉందని, ధరణి పట్టా పుస్తకంలో అసైన్డ్ భూమి అని నమోదయినందున మార్పు చేయగలరని దరఖాస్తు అందించారు.
Also Read: Guntur Tragedy: అఖిలపై దాడి చేసిన వ్యక్తి అరెస్ట్.. అసలు కారణం చెప్పేసిన ఎస్పీ..
లింగాల గణపురం మండలం సిరిపురం గ్రామానికి చెందిన బొడిగ లక్ష్మయ్య భూమి సర్వే నెంబర్ 230/ 82 లో హై టెన్షన్ లైను కొరకు సర్వే చేసి నిర్మాణం చేస్తున్నారని, పరిహారం కొరకు సంప్రదించగా భూమి పక్క రైతులదని పరిహారం అందకుండా అధికారులు జాప్యం చేస్తున్నందున పాస్ బుక్ పరిశీలించి తగు న్యాయం చేయాలని కోరారు. వీటితో పాటుగా సుమారు43 దరఖాస్తులు వచ్చాయని అదనపు కలెక్టర్ తెలిపారు. దరఖాస్తులను సంబంధిత శాఖ అధికారులకు పంపిస్తున్నామని వివరించారు. దరఖాస్తు లను త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు. గ్రీవెన్స్ డే లో జనగామ ఆర్డిఓ గోపిరామ్, డిప్యూటీ కలెక్టర్లు సుహాసిని, హనుమంత్ నాయక్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు