RGV on Birthday: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇతను ఏం చేసిన కొంచం కొత్తగా ఉంటుంది. ఒకప్పుడు హిట్ మూవీస్ తో దూసుకెళ్లిన రామ్ గోపాల్ వర్మ(RGV) ఇప్పుడు మాత్రం వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారారు. ఇతను మాట్లాడే మాటలు అర్థమైనట్టే ఉంటాయి. కానీ, ఏం అర్ధం కాదు. రీసెంట్ గా రిలీజ్ అయిన ” శారీ ” సినిమాకి కథను అందించారు. అయితే, తాజాగా వింతగా పోస్ట్ పెట్టి వార్తల్లో నిలిచాడు. ఇది ప్రస్తుతం, వైరల్ గా మారింది.
Also Read: Pamban Bridge: పంబన్ వంతెన లాంచ్ కు రంగం సిద్ధం.. ప్రత్యేకతలు తెలిస్తే మతిపోవాల్సిందే!
ఈ రోజు రామ్ గోపాల్ వర్మ పుట్టిన రోజు. అయితే, ఎన్నడూ లేని విధంగా ట్విట్టర్ లో ” తనకు ‘బర్త్ డే’ విషెస్ చెప్పిన వారందరికీ థాంక్స్ చెప్పనని ” ఆర్జీవీ ట్వీట్ చేశాడు. ఇది కాస్తా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఎవరైనా బర్త్ డే రోజున విషెస్ చెప్పిన తర్వాత వారికి థాంక్స్ చెబుతుంటారు. కానీ, ఆయన దీనికి భిన్నంగా ఎవరికీ ధన్యవాదాలు చెప్పనంటూ ఇలా పోస్ట్ పెట్టడంతో ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు.
దీని పై రియాక్ట్ అయిన నెటిజన్స్ ” నీ పుట్టిన రోజు అని మాకు చెబుతున్నావా ? లేక మేము నీకు విష్ చెయ్యాలని చెబుతున్నావా ” అని కొందరు అంటున్నారు. ” ఎలాంటి భయాలు లేకుండా ఈ ప్రపంచంలో ఎవరైనా ఉన్నారంటే .. అది నువ్వే ” అని ఇంకొందరు కౌంటర్లు వేస్తున్నారు. నీ ఇష్టం నువ్వు ఎలాగైనా ఉండు మాకు క్షణం క్షణం, గోవింద గోవిందా, ఇలాంటి కంటెంట్ తో సినిమాలు తీయండి అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.