Ap Govt Research Results (Image Source: Twitter)
ఆంధ్రప్రదేశ్

Ap Govt Research Results: ఏపీలోని ఆ జిల్లాలు వెరీ డేంజర్.. వెలుగులోకి సంచలన నిజాలు..

Ap Govt Research Results: ‘ఆరోగ్య ఆంధ్రప్రదేశ్’ (Arogya Andhra Pradesh) సాధనలో మరొక అడుగు ముందుకుపడింది. రాష్ట్రంలో ప్రజలు ప్రధానంగా ఎదుర్కొంటున్న వ్యాధులకు మూలాలు… వాటి వెనుక ఉన్న కారణాలు కనుక్కునేందుకు ప్రభుత్వం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా గుండె, కిడ్నీ, శ్వాస సంబంధిత వ్యాధుల నుంచి డయాబెటిస్, క్యాన్సర్ వంటి రోగాల వరకు… ఏ ప్రాంతంలో ఎందుకు ఎక్కువ కేసులు నమోదవుతున్నాయనే దానిపై పరిశోధన నిర్వహించింది. ఈ రీసెర్చ్ లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

పరిశోధన ఎందుకంటే?
ఏపీలోని పలు జిల్లాల ప్రజల ఆహారపు అలవాట్లు-జీవన విధానం వ్యాధులపై ఎక్కువ ప్రభావం చూపిస్తోంది. ప్రజలు అనారోగ్యం బారిన పడ్డ తర్వాత వారికి చికిత్స అందించడం కన్నా… కొన్ని రకాల వ్యాధులు సంక్రమించకుండా… ముందు జాగ్రత్త చర్యలు తీసుకుని చాలావరకు నియంత్రించవచ్చని వైద్యులు గుర్తించారు. ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం సమగ్ర పరిశోధనకు శ్రీకారం చుట్టింది. రాష్ట్రంలో ప్రతి జిల్లాను ఒక యూనిట్‌గా తీసుకుని రీసెర్చ్ ప్రారంభించింది. ప్రజలను ప్రధానంగా పీడిస్తున్న 10 రకాల వరకు వ్యాధుల గురించి అధ్యయనం చేపట్టింది. వ్యాధుల వారీగా చేపట్టిన రీసెర్చ్ ఫలితాలు ఈ విధంగా ఉన్నాయి.

హైపర్‌ టెన్షన్
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్లు (మొత్తం జనాభాలో 52.43%) మందికి స్క్రీనింగ్ చేస్తే అందులో 19.78 లక్షల మందికి (9.2 శాతం) హైపర్ టెన్షన్ నిర్ధారణ అయ్యింది. వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్ ఎదుర్కొంటున్నారు. 11,40,772 మంది మహిళలకు హైపర్ టెన్షన్ ఉన్నట్లు తేలింది. 8,37,927 మంది మగవాళ్లకు దీని బారిన పడ్డట్లు గుర్తించారు. మరో 14.29 లక్షల మంది (71.92%) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే… కోనసీమ, కాకినాడ, ఎన్టీఆర్ జిల్లాల ప్రజలకు హైపర్ టెన్షన్ ఎక్కువుగా ఉంది. శ్రీ సత్యసాయి, మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.

డయాబెటిస్
రాష్ట్రంలోని 18 ఏళ్ల వయసు కన్నా ఎక్కువ ఉన్న 2.15 కోట్ల (52.43%) మందిని పరీక్షించగా వారిలో 11.13 లక్షల మందికి అంటే జనాభాలో 5.1 శాతం మందికి డయాబెటిస్ ఉన్నట్టు తేలింది. మహిళల్లో కన్నా పురుషుల్లోనే షుగర్ వ్యాధి ఎక్కువ. 5,61,196 మంది పురుషులు.. 5,52,767 మంది మహిళలకు డయాబెటిస్ ఉంది. మరో 8.76 లక్షల మంది (78.73%) అండర్ ఫాలో అప్ కేటగిరీలో ఉన్నారు. అంటే వీరంతా డయాబెటిస్ రిస్క్‌లో ఉన్నారు. జిల్లాల వారీగా చూస్తే… గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల ప్రజలకు డయాబెటిస్ ఎక్కువుగా ఉంది. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు నమోదయ్యాయి.

డయాబెటిస్, హైపర్ టెన్షన్
హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్న వారి సంఖ్య 20.78 లక్షలు (9.6%)గా ఉంది. వీరిలో మగవారి కన్నా మహిళలే ఎక్కువుగా హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఎదుర్కొంటున్నారు. 11,22,800 మంది మహిళలకు హైపర్ టెన్షన్, డయాబెటిస్ ఉంది. మగవారికి వచ్చేసరికి 9,54,707 మందికి డయాబెటిస్ ఉంది. అండర్ ఫాలో అప్ కేటగిరీలో మరో 12.80 లక్షల మంది (61.64%) ఉన్నారు. హైపర్ టెన్షన్, డయాబెటిస్ రెండూ ఉన్నవాళ్లు ఏలూరు, ఎన్టీఆర్, కృష్టా జిల్లాల్లో ఎక్కువ. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో అత్యల్పంగా కేసులు ఉన్నాయి.

గుండె సంబంధిత వ్యాధులు
రాష్ట్రంలో 2,61,100 మంది గుండె సంబంధిత సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 1,61,734 మంది కాగా, మహిళలు 99,366 మంది ఉన్నారు. ఎన్టీఆర్, నంద్యాల, గుంటూరు జిల్లాలో గుండె వ్యాధిగ్రస్తులు అధికం. అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పం.

క్యాన్సర్ రోగులు
రాష్ట్రవ్యాప్తంగా 1,19,397 మంది క్యాన్సర్ రోగులు ఉన్నట్లు ప్రభుత్వం నిర్వహించి రీసెర్చ్ లో తేలింది. వీరిలో మగవాళ్లు 46,872 మంది కాగా.. మహిళలు 72,525 మంది ఉన్నారు. కాకినాడ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో అత్యధికంగా క్యాన్సర్ బాధితులు ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, మన్యం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో వారి సంఖ్య అత్యల్పంగా ఉంది.

కాలేయ వ్యాధిగ్రస్తులు
రాష్ట్రంలో 30,646 మంది కాలేయ వ్యాధితో బాధపడుతున్నట్లు పరిశోధనలో తేలింది. వీరిలో మగవాళ్లు 21,740 మంది కాగా.. మహిళలు 8,906 మంది ఉన్నారు. నెల్లూరు, కర్నూలు, తిరుపతి జిల్లాల్లో కాలేయ వ్యాధిగ్రస్తులు అత్యధికంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో వారి సంఖ్య అత్యల్పం.

శ్వాస సంబంధిత రోగులు
రాష్ట్రంలో 54,362 మంది శ్వాస సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 35,088 మంది కాగా.. మహిళలు 19,274 మంది ఉన్నారు. నెల్లూరు, విజయనగరం, తిరుపతి జిల్లాల్లో అత్యధికం అల్లూరి సీతారామరాజు, పశ్చిమ గోదావరి, బాపట్ల జిల్లాల్లో అత్యల్పం.

నరాల సంబంధిత అనారోగ్యం
రాష్ట్రంలో 1,07,433 మంది నరాల సంబంధిత అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. వీరిలో మగవాళ్లు 63,698 మంది కాగా, మహిళలు 43,735 మంది ఉన్నారు. విజయనగరం, నంద్యాల, కర్నూలు జిల్లాల్లో అత్యధికం. అల్లూరి సీతారామరాజు, శ్రీ సత్యసాయి, మన్యం జిల్లాల్లో అత్యల్పంగా ఉన్నారు.

Also Read: Adavi Talli Bata: రాములమ్మ కోసం అడవికి వెళ్లిన పవన్.. ఆ ఒక్క మాట కోసమేనట..!

కిడ్నీ వ్యాధిగ్రస్తులు
రాష్ట్రంలో 1,73,479 మంది కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఉన్నారు. వీరిలో మగవాళ్లు 1,22,672 మంది కాగా, మహిళలు 50,807 మంది ఉన్నారు. కిడ్నీ బాధితులు.. శ్రీకాకుళం, పల్నాడు, గుంటూరు జిల్లాల్లో అత్యధికంగా ఉన్నారు. అల్లూరి సీతారామరాజు, మన్యం, అనకాపల్లి జిల్లాల్లో అత్యల్పం.

మరికొన్ని వ్యాధులు

❄️ వాటిలో హైపర్ టెన్షన్, హార్ట్ స్ట్రోక్‌లు, గుండె వ్యాధుల విషయంలో… తూర్పుగోదావరి, విశాఖపట్నం, గుంటూరు జిల్లాల్లో అత్యంత ప్రమాదకర పరిస్థితులు నెలకొన్నాయి.

❄️ జీవన విధానం వల్ల వ్యాప్తి చెందే వ్యాధులు ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో నమోదవుతున్నాయి.

❄️ వాయు కాలుష్యం, స్మోకింగ్ వంటి కారణాల వల్ల ఆస్తమా, నిమోనియా, COPD కేసులు… ప్రకాశం, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో అధికంగా ఉన్నాయి.

❄️ టీబీ, డెంగ్యూ, మలేరియా, డయేరియా వంటి వ్యాధులు శ్రీకాకుళం, విజయనగరం, కడప జిల్లాల్లో ఎక్కువగా నమోదవుతున్నట్టు గుర్తించారు.

❄️హైపర్ టెన్షన్, డయాబెటిస్, తాగునీటిలో టాక్సిన్స్‌తో అనారోగ్యం బారిన పడ్డ వాళ్లు ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలో ఎక్కువగా ఉన్నారు.

❄️ పొగాకు ఇతర అలవాట్ల కారణంగా సర్వైకల్, బ్రెస్ట్, ఓరల్ క్యాన్సర్ రోగులు గుంటూరు, కృష్ణా, విశాఖపట్నం జిల్లాల్లో ఎక్కువ ఉన్నారు.

❄️ అనీమియా, ప్రీ టర్మ్ బర్త్స్, మాల్‌న్యూట్రిషియన్ సమస్యలతో బాధపడేవారు విజయనగరం, శ్రీకాకుళం, అనంతపురం జిల్లాల్లో ఎక్కువ.

❄️ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వచ్చే వ్యాధులు, డిప్రెషన్, యాంగ్జయిటీ కేసులు.. విశాఖపట్నం, విజయవాడ, కడప జిల్లాల్లో ఎక్కువ.

❄️ వర్షాకాలంలో ఎక్కువగా వచ్చే చికున్ గున్యా, డెంగ్యూ, మలేరియా కేసులు అల్లూరి సీతారామరాజు, విశాఖపట్నం, తూర్పుగోదావరి జిల్లాల్లో ఎక్కువ.

❄️ అలాగే రోడ్డు ప్రమాదాల వల్ల మరణాలు ఎక్కువగా కృష్ణా, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో చోటు చేసుకుంటున్నాయి.

Just In

01

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!