TDP vs YCP: విశాఖపట్నంకు చెందిన ఓ టీడీపీ మహిళా నేత చెప్పుతో ఒకరిపై దాడికి పాల్పడినట్లు ఆరోపిస్తూ.. వైసీపీ సంచలన ట్వీట్ చేసింది. ఇటీవల ఏపీలో టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య విమర్శనాస్త్రాలు ఎక్కువయ్యాయని చెప్పవచ్చు. ప్రధానంగా సోషల్ మీడియా వేదికగా ఇరు పార్టీలు విమర్శల జోరు సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారిక ట్విట్టర్ ఖాతా నుండి ఓ పోస్ట్ సంచలనగా మారింది.
వైసీపీ విడుదల చేసిన ట్వీట్ ఆధారంగా.. విశాఖపట్టణానికి చెందిన జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మిని ఉద్దేశించి వైసీపీ ట్వీట్ చేసింది. వైసీపీ విడుదల చేసిన ట్వీట్ లో ఒక పోలీస్ అధికారి ఎదురుగా, ఓ వ్యక్తి కూర్చొని ఉండగా అనంతలక్ష్మి అక్కడికి చేరుకున్నారు. ఏమి జరిగిందో ఏమో కానీ, అనంతలక్ష్మి తన కాలి చెప్పుతో ఆ వ్యక్తిని చెడామడా వాయించేశారు.
ఈ వీడియో ఇప్పటి వీడియోనా లేక పాత వీడియోనా అన్నది తెలియాల్సి ఉంది. కానీ వైసీపీ మాత్రం విశాఖలో చెప్పుతో కొట్టిన టీడీపీ నేత అంటూనే, దెబ్బలు తిన్న సదరు వ్యక్తి ఫిర్యాదులతో పోలీసులు కేసు నమోదు చేయబోతే, ఆ పోలీసుల్ని బెదిరిస్తూ ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ టిడిపి మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి హెచ్చరించారని ట్వీట్ లో చెప్పుకొచ్చింది.
అంతేకాకుండా క్రమశిక్షణ, కాకరకాయ అంటూ కబుర్లు చెప్తారు, ఇదేనా మీ పార్టీ వారి క్రమశిక్షణ అంటూ టిడిపి జాతీయ అధ్యక్షులు, సీఎం చంద్రబాబుకు మంత్రి నారా లోకేష్ కు వైసీపీ ట్వీట్ ను ట్యాగ్ చేసింది.
ఒక మహిళ చెప్పుతో కొట్టిన కారణం మాత్రం తెలియని వైసీపీ, ఏకంగా దాడి అంటూ పోస్ట్ చేయడంపై తెలుగు తమ్ముళ్లు ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం మీద ఒకరిపై దాడికి పాల్పడడం వెనుక ఎన్నో కారణాలు ఉంటాయి. ఆ కారణాలు తెలియకుండా వైసీపీ స్పీడ్ అయిందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.
Also Read: Nara Lokesh: ‘నేనున్నా.. మిమ్మల్ని టచ్ చేయలేరు’.. మహిళకు లోకేష్ భరోసా
అయితే వైసీపీ ట్వీట్ పై టీడీపీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. అలాగే వీడియోపై క్లారిటీ రావాల్సిన అవసరం ఉంది. టిడిపి వర్సెస్ వైసీపీ మధ్య సాగుతున్న సోషల్ మీడియా వార్ కాక మీద ఉండగా, విమర్శలు మాత్రం అదే రేంజ్ లో కాక పుట్టిస్తున్నాయని చెప్పవచ్చు.
విశాఖలో పోలీసుల సమక్షంలోనే ఓ వ్యక్తిని చెప్పుతో కొట్టిన జిల్లా టీడీపీ మహిళా అధ్యక్షురాలు అనంతలక్ష్మి
సదరు వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేయబోతే.. ఆ పోలీసుల్నే బెదిరిస్తూ ట్రాన్స్ఫర్ చేయిస్తానంటూ హెచ్చరిక
క్రమశిక్షణ.. కాకరకాయ అంటూ కబుర్లు చెప్తారు.. ఇదేనా @ncbn,… pic.twitter.com/tqGDSlTz8c
— YSR Congress Party (@YSRCParty) April 7, 2025