Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు! | Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్
Telangana RTC (Image Source: Twitter)
Telangana News

Telangana RTC: ఆర్టీసీలో ఏడడుగుల బుల్లెట్.. అతడిపై సీఎం రేవంత్ ఫోకస్.. మంత్రి కీలక ఆదేశాలు!

Telangana RTC: తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న అమీన్ అహ్మద్ అన్సారీ (Amin Ahmad Ansari) పేరు.. ఇటీవల పెద్ద ఎత్తున వార్తల్లో నిలిచింది. ఆరు అడుగుల బస్సులో ఏడు అడుగుల కండక్టర్ అంటూ అతడి పేరు మార్మోగింది. అయితే చదవడానికి ఎలా ఉన్న.. తన హైట్ కంటే చాలా చిన్నగా ఉన్న బస్సులో అమీన్ పడుతున్న కష్టం అంతా ఇంతా కాదు. ప్రభుత్వ ఉద్యోగాన్ని వదులుకోలేక.. అలాగానీ రన్నింగ్ బస్ లో గంటల తరబడి మెడ వంచుకొని పని చేయలేక నిత్యం నరకం అనుభవిస్తున్నాడు. అమీన్ గురించి పెద్ద ఎత్తున చర్చ జరగడంతో రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ కు కీలక సూచనలు చేశారు.

Also Read: CM Chandrababu: తమ్ముళ్లకు ఏమైంది?.. టైమ్ చూసి సీఎం చెక్ పెట్టబోతున్నారా!

హైదరాబాద్ చంద్రాయణ గుట్ట షాహీ నగర్ కు చెందిన ఆర్టీసీ కండక్టర్ అమీన్ అహ్మద్ అన్సారీ ఎత్తు 214 సెం.మీ (సుమారు 7 అడుగులు). 195 సెం.మీ. (6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తు ఉన్న బస్సులో నిత్యం విధులు నిర్వహిస్తూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. దీనిపై తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) స్పందిస్తూ.. ఆర్టీసీ ఎండీ సజ్జనార్ (Sajjanar) కి కీలక ఆదేశాలు ఇచ్చారు. అమీన్ అంశం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి దృష్టికి వెళ్లిందన్న మంత్రి.. ఆయన సూచన మేరకు ఆర్టీసీ(TGRTC)లో మరో సరైన ఉద్యోగం అతడికి ఇవ్వాలని కోరారు. దీంతో ఆర్టీసీ ఎండీ.. ఆ దిశగా చర్యలు తీసుకోనున్నారు. అదే జరిగితే అమీన్ కు గొప్ప ఊరట లభించనుంది.

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!