Aicc Meenakshi natrajan(image credit:X)
తెలంగాణ

అంతా మీనాక్షి నటరాజన్ కనుసైగలలోనే? ఆ నేతల్లో దడదడ..

Aicc Meenakshi natrajan: కాంగ్రెస్ లీడర్లపై ఏఐసీసీ ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ ఫోకస్ పెట్టారు. ఎవరు ఏం చేస్తున్నారు? పార్టీ యాక్టివిటీస్ లో ఎలా భాగస్వామ్యం అవుతున్నారు? ప్రభుత్వం, పార్టీని సమన్వయం చేయడంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు? ప్రజలు, కార్యకర్తల సమస్యలను ఎలా పరిష్కరించగల్గుతున్నారు? తదితర అంశాలను ఏఐసీసీ ఇన్ చార్జీ సీరియస్ గా మానినిటరింగ్ చేస్తున్నారు. ఈ మేరకు గాంధీభవన్ వార్ రూమ్ ఆధ్వర్యంలో కనెక్టివిటీ సెల్ ను ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లోని నేతలతో ఈ కనెక్టివిటీ సెల్ అనుసంధానమై ఉంటుంది.

ఏఐసీసీ చీఫ్​ తన ఫోన్ లోనే ఈ కనెక్టివిటీ సెల్ ను ఆపరేట్ చేసేలా లాగిన్ వ్యవస్థను క్రియేట్ చేశారు. మంత్రుల నుంచి మండల అధ్యక్షుల వరకు ఆమె నేరుగా మాట్లాడేందుకు ఈ విధానాన్ని వినియోగించుకోవచ్చని వార్ రూమ్ లోని ఓ సభ్యుడు తెలిపారు. ఎప్పటికప్పుడు రివ్యూలు, పార్టి పరిస్థితిని సమీక్షించనున్నారు. ఇంటర్నల్ ఇష్యూస్ పై ఆరా తీసి పరిష్కారాన్ని చూపనున్నారు. మరి కొన్ని రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు రానున్నాయి.

Also read: KCR on Congress MLAs: గులాబీ బాస్ చెంతకు పెద్ద పంచాయతీ?

ఈ నేపథ్యంలోనే నేతల మధ్య గ్యాప్ రాకూదనే ఉద్దేశ్యంతోనే మేడం మీనాక్షి తన పర్యవేక్షణను కొనసాగిస్తున్నారని టీపీసీసీ సెల్ లీడర్లు చెప్తున్నారు. తాను బాధ్యతలు తీసుకున్న తర్వాత జరిగే అతి పెద్ద ఎన్నికలు కావడంతో లీడర్లను సమన్వయం చేసేందుకే మీనాక్షి ప్రయారిటీగా పెట్టుకున్నారు. ఆమె ఆదేశాలు, సలహాలు, సూచనలు వంటివి కూడా ఈ కనెక్టివిటీ సెల్ నుంచే అన్నిజిల్లాల నేతలకు వెళ్లనున్నాయి.

ఇంటర్నల్ టీమ్ లో ఎవరెవరు…?
ఇక ఇప్పటికే అన్ని జిల్లాల్లో తన ఇంటర్నల్ టీమ్ ను ఏర్పాటు చేసుకున్న ఏఐసీసీ ఇన్ చార్జీ…పార్టీ, ప్రభుత్వం, లీడర్ల వ్యక్తిగత పనీతరు వంటి అంశాలపై ఎప్పటికప్పుడు రిపోర్టులు తెప్పించుకుంటున్నట్లు తెలిసింది. ఈ ఇంటర్నల్ టీమ్ లో పొలిటికల్ లీడర్ల నుంచి అధికారుల వరకు ఉన్నట్లు సమాచారం. ఒక వైపు పార్టీ పరిస్థితులపై నేరుగా ఆయా లీడర్ల నుంచి అభిప్రాయాలు సేకరిస్తూనే, దీనికి పార్లర్ గా మీనాక్షి నటరాజన్ తన ఇంటర్నల్ టీమ్ తో నివేదికలు తెప్పించుకోవడం గమనార్హం. ఫ్యాక్ట్ తెలుసుకునేందుకే ఏఐసీసీ ఇన్ చార్జీ ఈ తరహాలో వ్యవహరిస్తుంటారని ఓ నేత తెలిపారు.

పార్టీలో డిసిప్లెన్ , సమన్వయం, సమిష్ట వర్క్ వంటివి తప్పనిసరిగా ఉండాలని ఆమె ఇప్పటికే పలుమార్లు స్టేట్ నేతలకు సూచించారు. వర్క్ విషయంలో తాను కాంప్రమైజ్ కాననే విషయాన్ని కూడా ఆమె నొక్కి చెప్పారు. పార్టీ లీడర్లు, తన ఇంటర్నల్ టీమ్ ద్వారా వచ్చిన రిపోర్టులను ఏఐసీసీ ఇన్ చార్జీ ఎప్పటికప్పుడు రాహుల్ గాంధీకి పంపిస్తారని పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు. రాహుల్ గాంధీ కోటరీలోని కీలక నేతల్లో ఈమె ఒకరు అంటూ ఆయన వ్యాఖ్యానించారు.

నేతల్లో దడ..?
ఏఐసీసీ ఇన్ చార్జీగా మీనాక్షి నటరాజన్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి స్టేట్ కాంగ్రెస్ నేతల్లో దడ పుడుతుంది. ఆమె నిర్ణయాలు ఎప్పుడు ఎలా ఉంటాయోనని ఆందోళన చెందుతున్నారు. పార్టీలో స్ట్రిక్ట్ రూల్స్ ఇంప్లిమెంట్ చేస్తారనే భయం ఆయా లీడర్లలో ఉన్నది. పైగా ఆమె నిత్యం రిపోర్టులు సేకరిస్తుంటారు. దీంతో తమ పనితీరుపై హైకమాండ్ కు ఎలాంటి నివేదిక అందుతుందోననే టెన్షన్ కూడా ఉన్నది. గతంలో ఓ దఫా ఆమె ఏకంగా మంత్రుల పనితీరుపై కూడా హైకమాండ్ కు రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది.

ఇందులో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, ఉత్తమ్ కుమార్ రెడ్డిలకు వెరీ గుడ్ ఫర్మామెన్స్ అంటూ రిపోర్టు ఇచ్చినట్లు తెలిసింది. మిగతా మంత్రుల్లో కొందరికి గుడ్ అని మాత్రమే ఇవ్వగా, ఒకరిద్దరికి బెటర్ టూ మోర్ వర్క్ అని క్యాప్షన్ ఇచ్చినట్లు ఏఐసీసీకి చెందిన ఓ సీనియర్ నేత వెల్లడించారు. ఈ లెక్కన ఆమె ఏ స్థాయిలో నిఘా పెట్టారనేది అంచనా వేయొచ్చు.

Just In

01

Land Scam: ఎర్రగుంటలో ప్రభుత్వ భూముల కబ్జా.. ఆర్టీఐ ద్వారా వెలుగులోకి?

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?