KCR on Congress MLAs(image credit:X)
తెలంగాణ

KCR on Congress MLAs: గులాబీ బాస్ చెంతకు పెద్ద పంచాయతీ?

KCR on Congress MLAs: కారు దిగకుండా పార్టీ అధినేత పక్కా వ్యూహాలు రచిస్తున్నారు. రజతోత్సవాల సమయంలో ఎవరైనా ముఖ్య నేతలు పార్టీ మారితే డ్యామేజ్ అవుతుందని గ్రహించి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పార్టీ కార్యక్రమాల్లో, సమావేశాల్లో నేతలంతా పాల్గొనేలా చర్యలు చేపడుతున్నారు. పార్టీ మారినోళ్లు మళ్లీ చేరేందుకు సుముఖంగా ఉన్నారని, ఎవరికైనా ఆలోచన ఉంటే విరమించుకోవాలని, లేకుంటే భవిష్యత్ ఉండదని మరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారు. సభ విజయవంతానికి కేసీఆర్ రంగంలోకి దిగడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు అవుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రజోత్సవ వేడుకల్లో భాగంగా భారీ బహిరంగసభకు పార్టీ అధిష్టానం ప్లాన్ చేస్తుంది. ఏకంగా పార్టీ అధినేత కేసీఆర్ రంగంలోకి దిగి సభ విజయవంతానికి వ్యూహాలు చరిస్తున్నారు. అందులో భాగంగానే ఉమ్మడి పది జిల్లాల్లోని ముఖ్య నేతలతో ఫాం హౌజ్ వేదికగా భేటీలు నిర్వహించారు. కేంద్ర, రాష్ట్రాల్లోని రాజకీయ పరిస్థితులపై ఆరా తీయడంతో వైఫల్యాలను నేతలకు వివరించారు. ప్రజలకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో వైఫల్యం చెందాయని పేర్కొన్నారు.

ప్రజలు ప్రభుత్వంపై కోపంతో ఉన్నారని రాష్ట్రంలో ఎప్పుడు ఎన్నికలు నిర్వహించినా గెలిచేది బీఆర్ఎస్ పార్టీయేనని భరోసా కల్పించారు. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ లో చేరిన 10మంది ఎమ్మెల్యేలు తిరిగి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు. కానీ తానుమాత్రం వారికి ఏ హామీ ఇవ్వలేదని కూడా స్పష్టం చేశారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలు మళ్లీ కోరుకుంటున్నారని చెబుతూ నేతల్లో భరోసా నింపే ప్రయత్నం చేశారు.

హస్తం నేతలు సుముఖత?
పార్టీ మారిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో పాటు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని ఉమ్మడి జిల్లా నేతల భేటీల్లో కేసీఆర్ చెప్పడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. నిజంగానే కాంగ్రెస్ లో అసంతృప్తిగా ఎమ్మెల్యేలు ఉన్నారా? ఉంటే వారు బీఆర్ఎస్ లో చేరేందుకు సిద్ధంగా ఉన్నారా? అనేది ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నారని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఐదేళ్లు అధికారంలో ఉండాలని కోరుకుంటున్నట్లు కేసీఆర్ చెప్పారు.

Also read: MLA Raja Singh: ఓవైసీ.. అరుపులకు భయపడను.. శోభాయాత్రలో రాజాసింగ్

ఇప్పుడు వరంగల్ సభ నేపథ్యంలో మళ్లీ ఈ అంశాన్ని నేతలకు చెప్పడం కొసమెరుపు. ఒక వేళ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్ లో చేర్చుకుంటే డ్యామేజ్ అవుతుందని, విమర్శలు వస్తాయనే వెనుకంజ వేస్తున్నారా? అనేది కూడా పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. ఈ తరుణంలో చేరికలు వద్దని భావిస్తున్నట్లు పార్టీకి చెందిన ఓ సీనియర్ నేత తెలిపారు.

పార్టీ డ్యామేజ్ కాకుండా చర్యలు
సభను భారీ సక్సెస్ చేయాలని పార్టీ భావిస్తుంది. అందులో భాగంగానే కేసీఆర్ ఒక్కో ఉమ్మడి జిల్లాకు చెందిన 20 నుంచి 30మంది నేతలతో భేటీ అయ్యారు. అందులో మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. అయితే సభ ముందు కాంగ్రెస్ ప్రణాళికలు రూపొందించి ముఖ్య నేతలను కాంగ్రెస్ లో చేర్చుకుంటే పార్టీ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది.

దీంతో నేతల్లోనూ, కేడర్ లోనూ పార్టీకి వ్యతిరేకంగా మెసేజ్ వెళ్లే అవకాశం లేకపోలేదు. దీన్ని గమనించిన కేసీఆర్… పార్టీ నుంచి నేతలు ఎవరు ఇతర పార్టీల్లోకి వెళ్లకుండా భరోసా కల్పించారు. ఎవరికైనా పార్టీ మారే ఆలోచన వచ్చినా దానిని విత్ డ్రా చేసుకునేలా దిశానిర్దేశం చేశారు. రాబోయే కాలంలో బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తుందని, పార్టీ మారి రాజకీయ భవిష్యత్ నాశనం చేసుకోవద్దని పరోక్షంగా హెచ్చరికలు సైతం చేశారు.

సభసక్సెస్ కు అన్నీ తానై…
వరంగల్ సభ బాధ్యతలను కేసీఆర్ తీసుకున్నారు. హరీష్ రావు, కేటీఆర్ కు నేతల కోఆర్డినేషన్, సన్నాహక సమావేశాలు నిర్వహించే బాధ్యతలు అప్పగిస్తారని భావించినప్పటికీ కేసీఆర్ రంగంలోకి దిగారు. ఉమ్మడి జిల్లా నేతలతో భేటీ అయ్యి దిశానిర్దేశం చేశారు. ఎవరు ఏం చేయాలి? పార్టీ కేడర్ ను సభకు ఎలా తరలించాలి? వారి వాహనాల కూర్పు, వసతుల కల్పనపై సూచనలు చేశారు. ప్రతి గ్రామం నుంచి కార్యకర్తలను తరలించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. ఫస్ట్ సారి సభ నిర్వహణపై కేసీఆర్ స్వయంగా సమావేశాలు నిర్వహించడం అని పార్టీ నేతలు పేర్కొంటున్నారు.

త్వరలోనే మరోసారి అన్ని ఉమ్మడి జిల్లాలకు చెందిన నేతలతో గులాబీ అధినేత భేటీ కానున్నట్లు తెలిసింది. పార్టీ అనుబంధ సంఘాల నేతలతో భేటీలు మాత్రం కేటీఆర్ కు అప్పగించినట్లు సమాచారం. మరోవైపు ఏ నేత ఎంతమందిని సభకు తరలిస్తున్నారనే వివరాలను సేకరించబోతున్నట్లు తెలిసింది. ఆ నేత పనితనంను బట్టి పార్టీలో ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు సమాచారం.

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్