Sreeleela
ఎంటర్‌టైన్మెంట్

Sreeleela: ఆకతాయిలు చేసిన పనితో శ్రీలీల షాక్.. పబ్లిక్‌లో అలా లాక్కెళ్లిపోయారేంటి? వీడియో వైరల్!

Sreeleela: డ్యాన్సింగ్ బ్యూటీ శ్రీలీలకు చేదు అనుభవం ఎదురైంది. పబ్లిక్‌లో నడిచివెళుతుండగా కొందరు ఆకతాయిలు ఆమెను బలవంతంగా లాగేసి, ఎక్కడెక్కడో చేతులు వేసే ప్రయత్నం చేశారు. ఆకతాయిలు చేసిన ఈ పనికి షాకైనా శ్రీలీల వెంటనే తేరుకుని వారి నుంచి తనని తాను కాపాడుకుంది. ఇదంతా సినిమా కథ కాదండోయ్.. నిజంగా జరిగింది. ప్రస్తుతం శ్రీలీల టాలీవుడ్‌లో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తున్న విషయం తెలిసిందే.

బాలీవుడ ఫేమస్ దర్శకుడు అనురాగ్ బసు దర్శకత్వంలో కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఓ ప్రేమ కథా చిత్రంలో శ్రీలీల హీరోయిన్‌గా సెలక్ట్ అయింది. ఈ చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అందులో భాగంగా ఇటీవల టీమ్ డార్జిలింగ్‌కు వెళ్లింది. డార్జిలింగ్‌లో షూటింగ్ ముగించుకుని బయలు దేరిన శ్రీలీలను పబ్లిక్ చుట్టుముట్టారు. హీరో కార్తీక్ ఆర్యన్ ముందు నడుచుకుంటూ వస్తుండగా, వెనుక శ్రీలీల ఫ్యాన్స్ చేతులకు తన చేయి తగిలేలా నడిచి వస్తూ ఉంది.

Also Read- Ram Charan: ‘పెద్ది’ ఫస్ట్ షాట్‌లో రామ్ చరణ్ స్క్రీన్‌ప్రైజెస్స్ ఎలా ఉందంటే?

అలా వస్తున్న ఆమెను ఆకతాయిలు కొందరు చేతులు పట్టుకుని బలవంతంగా గుంపులోకి లాగేశారు. అసలే పిడికెడు కండ కూడా లేని శ్రీలీల, ఆకతాయిలు అలా లాగగానే షాక్‌కి గురైంది. వెంటనే ఆమెను చుట్టుముట్టిన జనం ఎక్కడెక్కడో చేతులు వేసే ప్రయత్నం చేయగా.. తేరుకున్న చిత్ర టీమ్ ఆమెను జనంలోకి నుంచి బయటకు తీసుకొచ్చేశారు. అయితే అప్పటికే ఆమె చేతికి దెబ్బ తాకినట్లుగా, చేయి పట్టుకుని కాస్త ఇబ్బందిగా నడుస్తూ కనిపించింది శ్రీలీల. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మాధ్యమాలలో వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన శ్రీలీల అభిమానులు ఎవడ్రా వాడు అలా లాగేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇప్పుడనే కాదు, ఎప్పుడైనా సరే.. పబ్లిక్‌లోకి సెలబ్రిటీలు వెళ్లినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకేం కాదులే అని, ప్రేక్షకులకు చేయి అందించాలని చూస్తే ఇలాగే ఉంటుంది. అలాంటి వారికి బాలయ్య లాంటి వారే కరెక్ట్. అందుకే బాలయ్య ఎక్కడ ఎలా ఉండాలో? అలా ఉంటాడని ఆయన ఫ్యాన్స్ కూడా చెబుతుంటారు. మొత్తానికి అయితే శ్రీలీలకు ఈ ఘటన ఒక లెసన్ అవుతుందనడంలో ఆశ్చర్యం లేదు. ఇకపై ఆమె ఇలాంటి విషయాలలో ఎవరికీ ఛాన్స్ ఇచ్చేలా బిహేవ్ చేయదనే భావించవచ్చు.

Also Read- Ramam: ‘విశ్వం’ తర్వాత ‘రామం’.. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

శ్రీలీల సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం బాలీవుడ్‌లో చేస్తున్న ఈ సినిమాతో పాటు ఆమెకు మరో ఆఫర్ వచ్చినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. కానీ, ఆ ఆఫర్ చేజారినట్లుగా కూడా వార్తలు వచ్చాయి. ఇక ఆమె నితిన్ సరసన నటించిన ‘రాబిన్‌హుడ్’ చిత్రం రీసెంట్‌గా విడుదలై అనుకున్నంతగా సక్సెస్ సాధించలేకపోయింది. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఆమె చేతులో రెండు, మూడు సినిమాలు ఉన్నాయి. బాలీవుడ్‌కు సంబంధించి మాత్రం ఆమెకు మరో అవకాశం వరించినట్లుగా ఇప్పటి వరకు వార్తలైతే రాలేదు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..