Ramam Movie Poster
ఎంటర్‌టైన్మెంట్

Ramam: ‘విశ్వం’ తర్వాత ‘రామం’.. ఈసారి ఎంటర్‌టైన్‌మెంట్ పీక్స్!

Ramam: ఇటీవల శ్రీనువైట్ల, గోపీచంద్ కాంబినేషన్‌లో వచ్చిన ‘విశ్వం’ సినిమా సమయంలో చిత్రాలయం స్టూడియోస్ సంస్థ వార్తలలో నిలిచిన విషయం తెలిసిందే. ఆ సినిమా విషయంలో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ వ్యవహరించిన తీరుపై ఇప్పటికీ కాంట్రవర్సీ నడుస్తూనే ఉంది. అదలా ఉండగానే ఈ బ్యానర్‌లో ఓ పవర్ ఫుల్ సినిమాను ప్రకటించారు. ఈసారి పాన్ ఇండియా స్థాయిలో ఈ సంస్థ ప్రభంజనం సృష్టించేందుకు సిద్ధమైంది. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈ పాన్ ఇండియా చిత్ర విశేషాలను నిర్మాత వేణు దోనేపూడి ప్రకటించారు.

Also Read- Athammas Kitchen: అలేఖ్య పచ్చళ్ల కాంట్రవర్సీతో ‘అత్తమ్మాస్ కిచెన్’ ట్రెండింగ్‌లోకి.. మ్యాటర్ ఏంటంటే?

ఓ యంగ్ హీరో కథానాయకుడిగా నటించనున్న ఈ పాన్ ఇండియా సినిమాకు ‘రామం’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ‘ది రైజ్ ఆఫ్ అకీరా’ అనేది ట్యాగ్‌లైన్. ధర్మ సంస్థాపనకు యుద్ధం చేసిన రాముడి అడుగు జాడల్లో నడుస్తూ, ఆయన చూపిన బాట ప్రపంచానికి ఆదర్శమని చాటి చెప్పే వీరుడు కథగా, ఇప్పటి వరకు ఇండియన్ సిల్వర్ స్క్రీన్‌పై రానటువంటి ఓ గొప్ప యోధుడికి సంబంధించిన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని ఈ సందర్భంగా మేకర్స్ తెలియజేశారు.

ఈ సినిమాకు దర్శకుడు ఎవరంటే.. ఇండస్ట్రీలో పలువురి దర్శకుల దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసిన లోక‌మాన్య‌ని ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు నిర్మాత వేణు దోనేపూడి. భారీ బడ్జెట్‌‌తో, అంత‌ర్జాతీయ విలువ‌ల‌తో పాన్ ఇండియా మూవీగా ‘రామం’ను రూపొందిస్తున్నామని, భారతీయులకు పర్వదినమైన శ్రీరామనవమి సందర్భంగా ‘రామం’ సినిమా టైటిల్, మోషన్ పోస్టర్‌ను విడుదల చేయడం ఎంతో ఆనందంగా ఉందని తెలిపారు.

Also Read- Peddi First Shot: ఇది కదా కావాల్సింది.. ‘పెద్ది ఫస్ట్ షాట్’ ఫ్యాన్స్‌కి పండగే!

ఇంకా నిర్మాత వేణు దోనేపూడి మాట్లాడుతూ.. ‘‘సమస్త మానవాళికి తారక మంత్రం శ్రీరామనామం. ధర్మ సంస్థాపనకు ఆ శ్రీరామచంద్రుడు చూపిన బాటే కాదు.. అధర్మం నిర్మూలించటానికి ఆయన కోదండం చేపట్టి చూపిన వీరత్వం గురించి ఎంత చెప్పినా తక్కువే. అలాంటి గొప్ప సమగ్ర మూర్తిమత్వాన్ని బేస్ చేసుకుని, నేటి కాలానికి అలనాటి రామరాజ్యాన్ని కనెక్ట్ చేస్తూ.. ఇప్పటి వరకు ఇండియన్ స్క్రీన్‌పై రానటువంటి వైవిధ్యమైన కథతో ‘రామం’ సినిమాను రూపొందించబోతున్నాం.

ప్ర‌స్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. అతి త్వ‌ర‌లోనే షూటింగ్ ప్రారంభం అవుతుంది. అసలు కాంప్రమైజ్ కాకుండా.. అత్యుత్తమ ప్రమాణాలతో, అంతర్జాతీయ సాంకేతిక విలువలతో ఎంతో ప్ర‌తిష్టాత్మ‌కంగా ఈ సినిమాను ప్రేక్షకులకు ఇవ్వనున్నాం. ఈ సినిమాలో టాలీవుడ్‌కి చెందిన ఓ రైజింగ్ స్టార్ హీరోగా నటించనున్నారు. త్వరలోనే ఆ హీరో పేరు రివీల్ చేస్తాం. అలాగే దేశ వ్యాప్తంగా అగ్ర నటీనటులు, సాంకేతిక నిపుణులు ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. పూర్తి వివరాలతో త్వరలోనే అప్డేట్ ఇస్తాం’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Blood Moon Eclipse 2025: అమ్మో చంద్ర గ్రహణం.. బిడ్డలను కనేదేలే.. గర్భిణీల వింత వాదన!

CM Revanth Reddy: దేశంలోనే భాద్‌షా.. జ‌న‌గామ క‌లెక్ట‌ర్‌ను అభినందించిన సీఎం

AGI impact: 2030 నాటికి 99 శాతం మంది ఉద్యోగాలు ఊడుతాయ్!!.. పొంచివున్న ఏఐ ముప్పు

A Minecraft Movie Review: ఊహా ప్రపంచంలోకి వెళ్తే ఏం జరగుతుంది.. తిరిగి రావాలంటే ఏం చేయాలి?

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..