Athammas Kitchen: ప్రస్తుతం సోషల్ మీడియాలో అలేఖ్య చిట్టి పచ్చళ్ల కాంట్రవర్సీ (Alekhya Chitti Pickles Controversy) సెన్సేషనల్‌గా మారిన విషయం తెలిసిందే. ముగ్గురు సిస్టర్స్ కలిసి ప్రారంభించిన ఈ అలేఖ్య పికెల్స్.. ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది. కారణం, చేజేతులా వారి వ్యాపారాన్ని వారి నోటిదూలతో వారే నాశనం చేసుకున్నారు. కస్టమర్స్‌ని మెప్పించి, బిజినెస్‌ని పెంచుకోవాల్సిన ఈ సిస్టర్స్.. మీ పచ్చళ్లు అంత రేటా? అన్నందుకు బూతు పురాణం అందుకుంటున్నారు.
ఆ కస్టమర్స్ వారి బూతులని సోషల్ మీడియాలో పెట్టేయడంతో.. ఒక్కసారి ఈ పచ్చళ్ల పాపలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే వారికి ఈ విషయంలో కొంత సానుభూతి కూడా లభిస్తుంది. వారు రేటు చెప్పారు.. నచ్చితే కొనుక్కోండి, లేదంటే వేరే చోట తీసుకోండి. అంతేకానీ, పదే పదే కావాలని వారిని ప్రశ్నిస్తూ, విసిగిస్తే.. రిప్లయ్‌లు అలాగే ఉంటాయి అంటూ కొందరు నెటిజన్లు ఈ పచ్చళ్ల పాపలకు మద్దతు తెలుపుతున్నారు.
Also Read- Allu Arjun: అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు కిక్ ఇచ్చే న్యూస్.. తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్
మరికొందరు మాత్రం బిజినెస్ చేసే వారికి ఓపిక ఎక్కువ ఉండాలి. కస్టమర్ ఎంత విసిగించినా, ఓపికగా సమాధానమిచ్చి.. ఒకటికి రెండు బాటిల్స్ కొనే విధంగా చేసుకోవాలి కానీ, నలుగురు నవ్వుకునేలా, అసహ్యించుకునేలా ఆ మాటలేంటి? మీరసలు అమ్మాయిలేనా? అసలు మీకు సంస్కారం ఉందా? మీ తల్లిదండ్రులు నేర్పిన సంస్కారం ఇదేనా? అంటూ ఫైర్ అవుతుండటంతో.. వారం, పది రోజులుగా సోషల్ మీడియాలో ఇదే పెద్ద టాపిక్‌గా మారింది. ఈ పచ్చళ్ల కాంట్రవర్సీని ఎవరికి నచ్చినట్లుగా వారు ప్రమోట్ చేసుకుంటున్నారు. సినిమా వాళ్లు కూడా ఈ పచ్చళ్ల కాంట్రవర్సీపై రీల్స్ చేస్తుండటం విశేషం.
అలేఖ్య పికల్స్ కాదు అత్తమ్మస్ కిచెన్ లో పులిహోర, ఉప్మా, పొంగల్ కొనగలిగేవాడిని చూసుకోండి.
తెలుసుగా ఎవరిదో సురేఖగారిదే. pic.twitter.com/5WsbOHZbgT
— Soma 🚲🚲 (@SSK_1924) April 5, 2025
ఇదిలా ఉంటే, ఈ అలేఖ్య పచ్చళ్ల కాంట్రవర్సీతో ఇప్పుడు ఇంకో పేరు కూడా ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. అదే ‘అత్తమ్మాస్ కిచెన్’. ఈ కిచెన్ ఎవరిదో తెలుసుగా. స్వయంగా మెగా కోడలు ఉపాసన (Upasana), తన అత్తగారైన సురేఖ (Surekha Konidela)తో పెట్టించారు. ఇందులో ఉండే ఐటమ్స్ రేట్స్‌ని చూపిస్తూ.. అలేఖ్య పికెల్స్ కాదు.. అత్తమ్మాస్ కిచెన్‌లో పులిహోర, ఉప్మా, పొంగల్ కొనగలిగేవాడిని చూసుకోండి.. అంటూ నెటిజన్లు కొందరు పోస్ట్‌లు చేస్తున్నారు. ఈ పోస్ట్‌లతో అలేఖ్య పికెల్స్ ప్లేస్‌లోకి అత్తమ్మాస్ కిచెన్ ఐటమ్స్, వాటి ధరలు ట్రెండ్‌లోకి వచ్చేశాయి.
Also Read- Peddi First Shot: ఇది కదా కావాల్సింది.. ‘పెద్ది ఫస్ట్ షాట్’ ఫ్యాన్స్‌కి పండగే!
ఇన్‌స్టెంట్‌గా చేసుకోవడానికి అద్భుతమైన రుచితో ‘అత్తమ్మాస్ కిచెన్’లోని ఐటమ్స్ ఉంటాయని ఉపాసన ఇప్పటికే పలు మార్లు చెప్పి ఉన్నారు. ఏదైనా టూర్స్ వెళ్లేటప్పుడే, విదేశాలకు వెళ్లినప్పుడు ఇవి ఎంతో ఉపయోగపడతాయని, టెస్ట్ చేసి మరీ చూపించారు. ప్రస్తుతం వీటికి డిమాండ్ ఉంది కాబట్టే.. ఆ రేట్స్ ఉన్నాయి. కొనగలిగిన వారే కొనుక్కుంటారు.. మీరు కొనండి అని వాళ్లేం వీడియోలు చేయడం లేదు కదా.. అంటూ మెగాభిమానులు కొందరు ‘అత్తమ్మాస్ కిచెన్’పై కామెంట్స్ చేస్తున్న వారికి కౌంటర్స్ ఇస్తున్నారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు