రాజమండ్రి స్వేచ్ఛ: Case on Harsha Kumar: పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపి పడేశారని, పోలీసులు కేసు పక్కదోవ పట్టిస్తున్నారంటూ ఇటీవల ఆరోపణలు చేసిన మాజీ ఎంపీ హర్షకుమార్‌పై శనివారం కేసు నమోదయింది. ప్రవీణ్‌ను ఎక్కడో హత్య చేసి, రోడ్డు పక్కన విసిరివేయడం ద్వారా రోడ్డు యాక్సిడెంట్‌గా చిత్రీకరించే ప్రయత్నం జరిగిందని హర్షకుమార్ ఆరోపించారు. ఈ ఘటనకు సంబంధించిన ఆధారాలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్పారు. దీంతో, విచారణకు వచ్చి ఆధారాలు సమర్పించాలంటూ పోలీసులు తొలుత నోటీసులు పంపించారు.
విచారణకు హాజరు కాలేదు. పైగా మళ్లీ అదేస్థాయిలో ఆరోపణలు చేయడంపై సీరియస్ అయిన పోలీసులు కేసు నమోదు చేశారు. బీఎన్ఎస్ సెక్షన్ 196, 197 కింద ఎఫ్ఐఆర్ రికార్డు చేశారు. పాస్టర్ ప్రవీణ్‌ది రోడ్డు ప్రమాదమని స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ, హత్య చేశారంటూ హర్షకుమార్, ఓ మతం వారిని మరొక వర్గానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని, శాంతి భద్రతలకు భంగం కలిగిస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు. కేసు నమోదు కావడంతో వర్షకుమార్ శనివారం విచారణకు వెళ్లారు. అయితే, ఎలాంటి సాక్ష్యాలు అందించలేదు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/
కేసు నమోదైన కేసులో హర్షకుమార్ మాట్లాడుతూ, పాస్టర్ ప్రవీణ్‌కు న్యాయం చేయాలని కోరితే, పోలీసులు తనపై కేసు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మద్యం మత్తులో బండి నడపడంతోనే ప్రమాదం జరిగి మృతి చెందారంటూ పోలీసులు అబద్దమాడుతున్నట్టు ఆయన పునరుద్ఘాటించారు. తాను కేసులకు భయపడబోనని అన్నారు.
ఇన్ని రోజులైనా పోలీసులు ఆయన పోస్టుమార్టం నివేదికను ఎందుకు బయటపెట్టలేదని ప్రశ్నించారు. ఏపీ పోలీసులు పోస్టుమార్టం రిపోర్టును బయటపెట్టకపోతే తెలంగాణ పోలీసులను ఆశ్రయించి మళ్లీ శవ పరీక్ష చేయిస్తానని ఆయన అన్నారు.
Also Read: Mohan Babu: పక్కవాళ్లు నాశనం కావాలని ఎప్పుడూ కోరుకోకూడదు.. ఏం చెప్పారు సార్!