Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప, పుష్ప 2 చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ఏ హీరోకి లేని భారీ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. ఈ చిత్రం ఎవరూ ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ అయి రూ. 1850 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి, రికార్డ్స్ ను బ్రేక్ చేసింది. అంతే కాదు, బాహుబలి 2 రికార్డులు కూడా బద్దలు కొట్టి ముందుకు దూసుకెళ్లింది. అల్లు అర్జున్ అంటే ఇప్పుడు నేషనల్ కాదు.. ఇంటర్నేషనల్ రేంజ్ లో క్రేజ్ సంపాదించుకున్నాడు.
Also Read: CM Chandrababu: చంద్రబాబుపై భువనమ్మకు కంప్లైంట్.. చేసింది ఎవరో కాదు.. ఆ మంత్రే!
అయితే, ఇప్పుడు తన తర్వాత తీయబోయే సినిమాలపై ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. ఎలాంటి సినిమా తీస్తాడా ? అని ప్రపంచం మొత్తం చూస్తుంది. ప్రస్తుతం బన్నీ చేతిలో ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా నాలుగు చిత్రాలు ఉన్నాయి. త్రివిక్రమ్ డైరెక్షన్ లో మైథాలజీ కాన్సెప్ట్ అని చెప్పడంతో దాని మీద భారీ అంచనాలున్నాయి. అయితే, త్రివిక్రమ్ చిత్రం కంటే ముందు అట్లీతో ఓ పాన్ ఇండియా తీస్తాడని సినీ వర్గాల నుంచి సమాచారం. ఇప్పటికే స్టోరీకి సంబందించిన పనులు మొత్తం అయిపోయాయి. షూటింగ్ త్వరలోనే ప్రారంభం కానుంది.
అయితే, తాజాగా ఈ రోజు అల్లు అర్జున్ క్లోజ్ ఫ్రెండ్, నిర్మాత బన్నీ వాసు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై బిగ్ అప్డేట్ ఇచ్చారు. బన్నీ వాసు ” షాకింగ్ సర్ ప్రైజ్ కోసం అందరూ ప్రిపేర్ అయి ఉండండి.ఏప్రిల్ 8న రానుందని తన ఎక్స్ లో ట్వీట్ చేశాడు.
ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ బర్డ్ డే. దీంతో, ఆ రోజు అల్లు అర్జున్ – అట్లీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించనున్నారని తెలుస్తుంది. ఈ వార్త తెలిసిన బన్నీ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అట్లీ డైరెక్షన్ లో భారీ కమర్షియల్ మూవీ అల్లు అర్జున్ చేయబోతున్నట్టు తెలుస్తుంది.
అంతే కాదు, ఈ చిత్రంలో అల్లు అర్జున్ డ్యూల్ రోల్ చేస్తాడని టాక్ నడుస్తుంది. దీనిలో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా హీరోయిన్ గా నటిస్తుందని రూమర్స్ వినిపిస్తున్నాయి. మరి, దీనిలో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.