Priyadarshi: ప్రస్తుతం ఏ సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్ చుసిన అలేఖ్య చిట్టి పికిల్స్ గురించే నడుస్తోంది. మీ పచ్చడి రేట్లు ఇలా ఉన్నాయ్ ఏంటి అని అడిగినందుకు.. . కస్టమర్ తో అసభ్యకర మాటలు మాట్లాడుతూ అలేఖ్య లిమిట్స్ క్రాస్ చేసి మాట్లాడింది. ఇది వైరల్ కావడంతో నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.
అయితే, ఇప్పుడు దీనిని మూవీ ప్రమోషన్స్ కోసం వాడేస్తున్నారు. ఎవరి పనుల్లో వారే ఉన్నారు. దొరికిందే సందు అనుకుని ‘సారంగపాణి జాతకం’ చిత్ర బృందం ఏకంగా వీడియో చేసి అప్లోడ్ చేసింది.
ఈ వీడియోలో హీరోయిన్ రూప డ్రెస్సు ఎంత బావుందో కదా అని చూపించగా.. హ బావుందని ప్రియదర్శి అంటూనే , డ్రెస్సు రేట్ చూసి షాక్ అయి వామ్మో 14,999 నా అని అంటాడు. అప్పుడు హీరోయిన్ నువ్వు కెరియర్ మీద ఫోకస్ పెట్టాలమ్మా .. అర్ధమవుతుందా? రేపు నీ పెళ్ళామో ? గర్ల్ ఫ్రెండో డ్రెస్సు చూపించినప్పుడు ఎక్స్పెన్సివ్ అన్నావనుకో .. వదిలిపడేస్తది నిన్ను అని అంటుంది. అప్పుడు ప్రియదర్శి షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇస్తాడు.
అప్పుడు రూప ” నువ్వు దయచేసి ప్రేమలు, పెళ్లిళ్ల జోలికి వెళ్ళమాకు అప్పుడే .. కెరియర్ మీద ఫోకస్ పెట్టు.. ఒక్క డ్రెస్సు కే ఇంత రేటా అని అంటున్నావ్ .. పెళ్లి అయ్యాక నీ పెళ్ళాం ల్యాండ్, బంగారం అని అడిగితే ఏం కొనిపెడతవ్ రా నువ్వు ” అని అంటుంది. ఇక చివరికి ప్రియదర్శి చేతిలో ఉన్న బుక్ ని తీసుకుని లైఫ్ లో ఎలా సెటిల్ అవ్వాలో ముందు అది ఆలోచించు.. అని హీరోయిన్ అనగా.. అప్పుడు మనోడు వెంటనే ” నేను పచ్చళ్ల బిజినెస్ పెడతా ” అని అంటాడు.
Also Read: Sri Rama Navami: భద్రాద్రిలో ముమ్మరంగా శ్రీరామనవమి ఏర్పాట్లు.. అధికారులకు మంత్రి కీలక ఆదేశాలు
అలేఖ్య చిట్టి పికిల్స్ ఇష్యూ ను తీసుకుని ప్రమోషన్స్ కి కావాల్సిన విధంగా ‘సారంగపాణి జాతకం’ టీమ్ చేసిన ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తుంది. మరి, ఇది సినిమాకి ప్లస్ అవుతుందో ? లేక విమర్శలు ఎదురుకుంటారో అనేది చూడాల్సి ఉంది.