Peddi Movie First Look
ఎంటర్‌టైన్మెంట్

Peddi First Shot: ఆ అనుమానాలకు చెక్.. అదిరిపోయే అప్డేట్ ఇచ్చిన బుచ్చి!

Peddi First Shot: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటోన్న చిత్రం ‘పెద్ది’ (Peddi). ఇటీవలే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ని మేకర్స్ విడుదల చేశారు. రామ్ చరణ్ (Global Star Ram Charan) బర్త్‌డే స్పెషల్‌గా వచ్చిన ఈ చిత్ర ఫస్ట్ లుక్ ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంది. సినిమా టైటిల్ కూడా, ఈ సినిమా ప్రారంభానికి ముందే సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫైనల్‌‌గా అదే టైటిల్‌ని మేకర్స్ ఫిక్స్ చేసి, ఫస్ట్ లుక్ వదిలారు. ఈ ఫస్ట్ లుక్ తర్వాత ఈ సినిమాను చూసే కోణమే మారిపోయింది.

కారణం తన గురువు సుకుమార్‌ని మించేలా శిష్యుడు బుచ్చిబాబు ఏదో ప్లాన్ చేస్తున్నాడనేలా, ఒకే ఒక్క లుక్‌తో టాక్ మొదలైంది. అన్నీ భారీగా ఏర్పాటు చేసుకున్న బుచ్చిబాబు.. ఈ సినిమా విషయంలో అస్సలు కాంప్రమైజ్ కావడం లేదు, నిర్మాతలని కానివ్వడం లేదు. బుచ్చిబాబుపై ఉన్న నమ్మకంతో మేకర్స్ కూడా ఆయన ఏది అడిగితే అది ఇచ్చేస్తున్నారు. అలా ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్‌ని ఈ చిత్రానికి సంగీతం అందించేలా బుచ్చి తన కథతో ఒప్పించాడు. బాలీవుడ్ భామ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుంది.

Also Read- Mahesh Babu: మహేష్‌ చేతిలో పాస్‌పోర్ట్.. అప్పుడే జక్కన్న వదిలేశాడా? మీమ్స్ చూశారా!

ఇక ఫస్ట్ లుక్‌తో గ్యాప్ ఇవ్వకుండా వెంటనే ‘పెద్ది ఫస్ట్ షాట్’ అంటూ మరో అప్డేట్‌ని మేకర్స్ ఇచ్చిన విషయం తెలిసిందే. శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 6న ఉదయం 11 గంటల 45 నిమిషాలకు ‘పెద్ది ఫస్ట్ షాట్’ విడుదల చేయబోతున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ‘పెద్ది ఫస్ట్ షాట్’ అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. అవేంటంటే, అనుకున్న టైమ్‌కి ఈ ఫస్ట్ షాట్‌కి సంగీత దర్శకుడు రెహమాన్ మిక్సింగ్ పూర్తి చేస్తాడా? తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషలలో రానున్న ఈ ఫస్ట్ షాట్‌కు రెహమాన్ అనుకున్న టైమ్‌కి పని పూర్తి చేస్తాడా? అని మెగా ఫ్యాన్స్ కూడా అనుమానాలు వ్యక్తం చేశారు.

అందుకు కారణం, ప్రస్తుతం ఏఆర్ రెహమాన్ లైఫ్‌లో చోటు చేసుకున్న పరిణామాలే. అందులోనూ ఈ మధ్య ఆయన హెల్త్ విషయంలో రకరకాలుగా వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో వెల్లడైన అనుమానాలకు.. దర్శకుడు బుచ్చి ఒకే ఒక్క పిక్‌తో క్లారిటీ ఇచ్చేశాడు. ‘పెద్ది ఫస్ట్ షాట్’కు సంబంధించి బుచ్చి బాబు సానా, సంగీత దర్శకుడు ఎ.ఆర్. రెహమాన్ తుది మిక్సింగ్ పనిని పూర్తి చేసినట్లుగా నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. దీంతో అనుమానాలన్నీ పటాపంచల్ అయిపోయాయి. అనుకున్న టైమ్‌కి ‘పెద్ది’ దిగుతాడు అనేలా మేకర్స్ ఇచ్చిన అప్డేట్‌తో ఫ్యాన్స్‌కు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Also Read- Trivikram Srinivas: త్రివిక్రమ్ చెప్పిన ‘జై ఎన్టీఆర్’ మీనింగ్ ఇదే.. ఇక ఫ్యాన్స్‌ని ఆపతరమా?

మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో.. వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. కన్నడ నటుడు శివ రాజ్ కుమార్ అద్భుతమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, దివ్యేందు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాకు ప్రముఖ సినిమాటోగ్రాఫర్ ఆర్. రత్నవేలు డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం ‘పెద్ది ఫస్ట్ షాట్’ ట్యాగ్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.

">

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

O Cheliya movie song: ‘ఓ.. చెలియా’ సినిమా నుంచి పాటను విడుదల చేసిన మంచు మనోజ్..

Khairatabad Ganesh 2025: గంగమ్మ ఒడికి.. ఖైరతాబాద్ మహా గణపతి.. భారీగా తరలివచ్చిన భక్తులు

Ponguleti Srinivasa Reddy: అభివృద్ధి సంక్షేమాన్ని ముందుకు తీసుకెళ్లడమే మా లక్ష్యం: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్