Viral Image Source Twitter
Viral, తెలంగాణ

Viral: బస్సు ఆరడుగులు.. కండక్టర్ ఏడడుగులు.. షాక్ అవుతున్న ప్రయాణికులు?

Viral : ప్రపంచంలోని మనుషులు అందరూ ఒకేలా ఉండరు. ఎత్తు, బరువుల మధ్య చాలా తేడా ఉంటుంది. మనలో కొందరు చూడటానికి పొట్టిగా, చిన్నగా ఉంటారు. ఇంకొందరు ఏడడుగులు ఎత్తుతో అందర్ని ఆశ్చర్యపరస్తుంటారు. అయితే ఇది కొంత వరకు బాగానే ఉంటుంది కానీ, దాని కారణంగా చాలా ఇబ్బందులు పడుతుంటారు.

ఎందుకంటే, ఎత్తుగా ఉండేవారు కొన్ని చోట్ల సమస్యలు ఖచ్చితంగా ఎదుర్కొంటారు. అలాంటి ఎలాంటి వాహనాలలో ప్రయాణించలేరు. ఇక, వీరు జాబ్స్ చేసే వాళ్ళు అయితే వారికి దేవుడే దిక్కు. తాజాగా అలాంటి ఘటనే సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఏడడుగులు ఉన్న అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి.. కండక్టర్‌ ఉద్యోగం చేస్తూ చాలా సమస్యలు ఎదుర్కొంటున్నాడు.

Also Read :  Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాస పథకంకు అప్లై చేస్తున్నారా? రేషన్ కార్డు లేదా? అయితే ఇలా చేయండి

అమీన్ అహ్మద్ అన్సారీ అనే వ్యక్తి హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట షాహీనగర్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన తండ్రి కాచిగూడ డిపోలో హెడ్‌కానిస్టేబుల్‌గా పనిచేశారు. అయితే, అనారోగ్య సమస్యలతో ఆయన 2021లో మరణించారు. దీంతో, కారుణ్య నియామకం కింద ఇంటర్‌ చదివిన యువకుడికి మెహిదీపట్నం డిపోలో కండక్టర్‌గా ఉద్యోగం ఇచ్చారు.

Also Read : Ponguleti Srinivas Reddy: మత్సకారులకు భరోసా.. ఒక్కొక్కరికి రూ.8,500 సామాగ్రి.. మంత్రి పొంగులేటి కీలక వ్యాఖ్యలు

అతడు ఏడడుగుల పొడవు ఉండటంతో విధులు నిర్వర్తించడం పెద్ద సవాల్‌గా మారింది. బస్సుల్లో రోజూ సగటున ఐదు ట్రిప్పుల్లో 10గంటల వరకు ప్రయాణించాల్సి వస్తోంది. 195 సెం.మీ.(6 అడుగుల 4 అంగుళాలు) ఎత్తుండే బస్సు లోపల 214 సెం.మీ. పొడవున్న తాను గంటల తరబడి తల వంచి ప్రయాణిస్తుండటంతో మెడ, వెన్నునొప్పి, నిద్రలేమితో హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నానని అన్సారీ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు దీనిపై రియాక్ట్ అయి అమీన్ అహ్మద్ అన్సారీకి ఆర్టీసీలోనే వేరే జాబ్ ఇవ్వాలని ప్రయాణికులు కోరుతున్నారు.

Just In

01

CV Anand: ప్రతీ పెద్ద పండుగ పోలీసులకు సవాలే .. హైదరాబాద్ సీపీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ