Child Protection Commission: రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్‌గా కొత్తకోట సీతా దయాకర్‌రెడ్డి నియమితులయ్యారు. మరో ఆరుగురు సభ్యులను కూడా ప్రభుత్వం నియమించింది. బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి మూడేండ్ల పాటు ఈ కమిషన్ కొనసాగనున్నది. సభ్యులుగా కంచర్ల వందనాగౌడ్, మరిపల్లి చందన, బి.అపర్ణ, గోగుల సరిత, ప్రేమలతా అగర్వాల్, బి.వచన్ కుమార్ వ్యవహరించనున్నారు.
మొత్తం ఏడుగురు సభ్యులుండే కమిషన్‌లో ఒక్కరు మినహా మిగిలినవారంతా మహిళలే. చైర్‌పర్సన్, సభ్యుల వయసు 60 ఏండ్లయిన తర్వాత కమిషన్ నుంచి తప్పుకోవాల్సి ఉంటుందని మార్గదర్శకాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్ పేర్కొన్నారు. నియామకం ఉత్తర్వులు జారీ అయిన వెంటనే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
Also read: CM Revanth Reddy: సీఎం రేవంత్ పై హైటెక్ కుట్రలు.. ఫేక్ వీడియోల హల్ చల్.. నెటిజన్స్ ఫైర్..