Rajiv Yuva Vikasam Scheme: రాజీవ్ యువ వికాస పథకం కింద అర్హులైన యువత పెద్ద ఎత్తున దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ,ఈబీసీ యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఉద్దేశించి ప్రతిష్టాత్మకంగా అమలు చేయనున్న రాజీవ్ యువ వికాస పథకం ద్వారా ఎక్కువ మంది లబ్ధి పొందే విధంగా నల్గొండ జిల్లాలో యువతకు అవగాహన కల్పించడంలో భాగంగా షెడ్యూల్ కులాల కార్పొరేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నల్గొండ జిల్లా, కనగల్ మండలం, జి .యడవల్లి గ్రామంలో రాజీవ్ యువ వికాస పథకంపై అవగాహన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన జిల్లా కలెక్టర్ త్రిపాటి యువతను ఉద్దేశించి మాట్లాడుతూ జి. యడవల్లి గ్రామం అత్యంత వెనుకబడిన గ్రామమని, గ్రామాన్ని అభివృద్ధి చేసేందుకుగాను రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆదేశాల మేరకు తాను గ్రామాన్ని దత్తత తీసుకుంటున్నట్లు కలెక్టర్ ప్రకటించారు. గ్రామ అభివృద్ధిలో భాగంగా అవసరమైతే గ్రామానికి ప్రత్యేక మంజూరీలు ఇవ్వడం పై దృష్టి పెడతామన్నారు.
Push-pull train: వరంగల్ నుండి హైదరాబాద్ కు పుష్ పుల్ ట్రైన్? ఎంపీ కావ్య ఏమన్నారంటే?
రాజీవ్ యువ వికాస పథకంలో అర్హులు దరఖాస్తు చేసుకోవాలని, స్థానికత చాలా ముఖ్యమని, ఈనెల 14 లోగా ఈ పథకం కింద ఆర్థిక సహాయం కోరే వారు దరఖాస్తు చేసుకోవాలని, నాలుగు లక్షల రూపాయల వరకు ఈ పథకం కింద ఆర్థిక సాయం పొందేందుకు అవకాశం ఉందని తెలిపారు .దరఖాస్తుతో పాటు, రేషన్ కార్డును జతచేయాలని, ఒకవేళ రేషన్ కార్డులు లేనట్లైతే ఆదాయం, కులం ధ్రువపత్రాలు సమర్పించాలని, స్థానికతహసిల్దార్ 24 గంటల్లో వీటిని జారీచేయాలని పక్కనే ఉన్న తహసిల్దార్ పద్మను ఆదేశించారు.
రాజీవ్ యువ వికాస పథకం కింద జి .ఎడవల్లి నుండి అత్యధిక దరఖాస్తులు వచ్చేలా చూడాలని ఆమె కోరారు. ఎస్సీ కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ బి.మాన్య నాయక్, ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి విజయేందర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ అధికారి రాజ్ కుమార్, సహాయ బీసీ సంక్షేమ అధికారి సంజీవయ్య, శ్రీనివాస్ గౌడ్, అనూప్ రెడ్డి, తహసిల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎడవల్లి చెరువు అలుగును పరిశీలించారు.అలుగు మరమ్మతుల కోసం ప్రతిపాదనలు పంపించాలని ఆర్డీవోను, ఎంపీడీవోను ఆదేశించారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు