తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Sai Kumar on BRS BJP: బీఆర్ ఎస్ ను బీజేఆర్ ఎస్ గా (భారతీయ జనతా రాష్ట్ర సమితి) పేరు మార్చాలని ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మన్ మెట్టు సాయికుమార్ విమర్శించారు. ఆయన గాంధీభవన్ లో మాట్లాడుతూ బీజేపీ, బీఆర్ ఎస్ చీకటి ఒప్పందాలు ఇంకా ఎంత కాలం? అంటూ ప్రశ్నించారు. బీజేపీ, బీఆర్ ఎస్ లు ఒకటేనని జనాలందరికీ తెలుసునని వివరించారు.
స్క్రిప్టు నుంచి పాలసీల వరకు ఆ రెండు పార్టీలు ఒకే విధానాన్ని అనుసరిస్తున్నాయన్నారు. మూడేళ్ల తర్వాత తామే అధికారంలోకి వస్తామని కేటీఆర్ పగటి కలలు కంటున్నారన్నారు. ముప్పై ఏళ్లు దాటినా, బీఆర్ ఎస్ ప్రతిపక్షంలోనే కొనసాగుతుందన్నారు. పదేళ్లలో బీఆర్ ఎస్ చేసిన అరాచకం అంతా ఇంత కాదన్నారు.
రాసుకుంటే రామకోటి చెప్పుకుంటూ పోతే రామాయణం అంత ఉంటుందని వెల్లడించారు. రాష్ట్ర ఖజానాను దోచుకొని ఫామ్ హౌజ్ ప్యాలెస్ లు కట్టుకున్నారన్నారు. కేటీఆర్ అబద్ధాలను పదే పదే చెప్పి నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ఇక ప్రజాప్రభుత్వంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తుంటే, బీజేపీ, బీఆర్ ఎస్ లకు కడుపు మండుతుందన్నారు.
ప్రభుత్వం ప్రజలకు మంచి చేస్తుంటే కేటీఆర్ అండ్ టీమ్ కళ్లల్లో రక్తం కారుతుందన్నారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/