Single First Song: కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్ అంటే కచ్చితంగా శ్రీ విష్ణు పేరే వినబడుతుంది. ఆయన హీరోగా చేస్తున్న సినిమా వస్తుంది అంటే హిట్, ఫ్లాప్‌లతో సంబంధం లేకుండా ఎంటర్‌టైన్‌మెంట్ గ్యారంటీ అని ఫిక్స్ అయిపోవచ్చు. అందుకే శ్రీ విష్ణు (Sree Vishnu) సినిమాలకు, శ్రీ విష్ణుకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ఇప్పుడాయన హీరోగా, టాలీవుడ్ ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకుంటోన్న హోల్సమ్ ఎంటర్‌టైనర్ చిత్రం ‘#సింగిల్’. కార్తీక్ రాజు (Caarthick Raju) దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాను.. గీతా ఆర్ట్స్ (Geetha Arts) మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పిస్తుండగా.. కళ్యా ఫిల్మ్స్‌తో కలిసి చిత్రాన్ని విద్యా కొప్పినీడి, భాను ప్రతాప, రియాజ్ చౌదరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఈ వేసవికి విడుదల కానున్న ఈ చిత్రం నుంచి శుక్రవారం మేకర్స్ ఫస్ట్ సింగిల్ ‘శిల్పి ఎవరో’ను విడుదల చేసి, మ్యూజిక్ ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశారు. ఫస్ట్ సింగిల్ విషయానికి వస్తే..
Also Read- Sailesh Kolanu: ఒక్క సెకను కూడా ఆలోచించకుండా ఎలా లీక్ చేస్తారు.. టాలీవుడ్ డైరెక్టర్ సంచలన ట్వీట్
‘‘ఏఐ కూడ ఊహించలేదుగా.. ఇంతందాన్ని ఏం చెప్పినా
యామ్ ఐ ఫాలింగ్ ఇన్ టు ద లవ్ అని స్టేటస్ పెట్టనా..
హెడ్‌ఫోన్స్ ఏమో నీ చెవులపైన.. మ్యూజిక్ నాలో మొదలయ్యెనా
ఫస్ట్ లవ్ సాంగ్ సిట్టింగ్స్ ఏవో.. నాలో జరిగేనా
శిల్పి ఎవరోయి.. శిల్పమెనుక
తెల్పు చిరునామా.. ఏ సెల్ఫీ దిగుతా’’ అంటూ సాగిన ఈ పాటకు విశాల్ చంద్రశేఖర్ చక్కని స్వరాలతో ఓ సోల్ ఫుల్ రొమాంటిక్ మెలోడీని కంపోజ్ చేశారు. ఈ పాటకు ప్రముఖ లిరిసిస్ట్ శ్రీమణి సాహిత్యం అందించగా.. యాజిన్ నిజార్ సోల్ ఫుల్ వోకల్స్‌తో పాట స్థాయిని పెంచారు. అలాగే ఈ పాట బ్యూటీఫుల్ విజువల్స్‌తో చూడగానే ఆకర్షిస్తోంది. హీరో శ్రీ విష్ణు.. తన జీవితంలోని ఇద్దరు స్పెషల్ భామలైన కేతిక శర్మ, ఇవానాల అందాన్ని వర్ణిస్తూ, వారి అందంపై ప్రశంసలు కురిపిస్తున్నట్లుగా ఈ పాట సాగింది.
Also Read- OTT Movie: బిడ్డ కోసం దెయ్యాలతో యుద్ధం చేసిన ఓ తల్లి కథ .. త్వరలో ఓటీటీలోకి.. ఎక్కడ చూడొచ్చంటే?
ముఖ్యంగా నేటి యువతను ఆలరించేలా, ఆకర్షించేలా ఈ పాటను శ్రీమణి రచించారు. ఇందులోని మోడరన్ వైబ్, థీమ్ యూత్‌ని మెస్మరైజ్ చేయడం పక్కా అనేలా పాటను చిత్రీకరించినట్లుగా ఈ లిరికల్ సాంగ్ చూస్తుంటే తెలుస్తుంది. అమ్మాయిని శిల్పంతో పోల్చుతూ.. ఆ శిల్పాన్ని చెక్కిన శిల్పి ఎవరో అని.. చిన్న చిన్న ఇంగ్లీష్ పదాలతో పాటను అల్లిన తీరుకు శ్రీమణిని అభినందించక తప్పదు. కచ్చితంగా ఈ సాంగ్ చార్ట్ బస్టర్‌గా నిలుస్తుందని చెప్పుకోవచ్చు. ఇక ఈ పాటలో శ్రీ విష్ణు కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. ఇంతకు ముందు కొన్ని సీరియస్ పాత్రలలో కనిపించిన శ్రీ విష్ణు.. ఈ సినిమాలో మాత్రం ఓ లవర్ బాయ్‌లా ప్రేక్షకులను అలరించబోతున్నారు. చూస్తుంటే ఇది ట్రయాంగిల్ లవ్ స్టోరీ అనేది అర్థమవుతోంది. కంటెంట్ విషయంలో రాజీ పడని శ్రీ విష్ణు.. ఈ సినిమాతో ఎలాంటి రిజల్ట్‌ని రాబడతాడో తెలియాలంటే మాత్రం.. మే 9 వరకు వెయిట్ చేయాల్సిందే.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు