TG Intermediate calendar: 2025-26 విద్యా సంవత్సరానికి (Academic Year) విద్యా సంవత్సరానికి సంబంధించి తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు (Telangana Intermediate Board) కీలక ప్రకటన చేసింది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ (TG Intermediate calendar) ను విడుదల చేసింది. కాలేజీ పనిదినాలతో (Inter College Working Days) పాటు పరీక్షా తేదీలు, సెలవులు (Holidays) వంటి వివరాలను ఇంటర్ బోర్డ్ విడుదల చేసింది.
వర్కింగ్ డేస్
2025-26 విద్యా సంవత్సరం క్యాలెండర్ లో ఇంటర్మీడియట్ బోర్డు పలు కీలక ప్రటనలు చేసింది. 2025 జూన్ 2వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు ప్రారంభమవుతాయని వెల్లడించింది. అటు 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి 226 రోజులు కాలేజీలు పనిచేస్తాయని తెలిపింది. అలాగే ఎంతో కీలకమైన దసరా సెలవులపైనా ఈ క్యాలెండర్ లోనే ఇంటర్ బోర్డ్ క్లారిటీ ఇచ్చింది. 2025 సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు దసరా హాలీడేస్ (Dussehra Holidays 2025) ఉండనున్నట్లు తెలిపింది.
Also Read: AP Secretariat Fire Accident: పవన్ కల్యాణ్ బ్లాక్ లో అగ్నిప్రమాదం.. ఎగసిపడ్డ మంటలు.. ప్లాన్ చేసి చేశారా?
ఏ పరీక్షలు ఎప్పుడంటే?
ఇంటర్ పరీక్షల తేదీలను సైతం అకడామిక్ క్యాలెండర్ లో బోర్డు ఖరారు చేసింది. నవంబర్ 10 నుంచి 15 వరకు హాఫ్ ఇయర్లీ ఎగ్జామినేషన్స్ (Inter Half Yearly Exams 2025) నిర్వహించనున్నట్లు తెలిపింది. 2026 జనవరి 11 నుంచి 18వ తేదీ వరకు సంక్రాంతి సెలవులు (Sankranthi Holidays) ఉండనున్నాయి. ఆ తర్వాత జనవరి 19-24 తేదీల మధ్య ప్రీ ఫైనల్ పరీక్షలు (Inter Pre – Finals Exams) నిర్వహించనున్నారు. ఫిబ్రవరి తొలి వారంలో ప్రాక్టికల్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయనున్నారు. మార్చి ఫస్ట్ వీక్‌లో ఇంటర్ పబ్లిక్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి చివరి వర్కింగ్ డేగా మార్చి 21 ఉండనుంది. ఏప్రిల్ 1 నుంచి మే 31 వరకు సమ్మర్ హాలిడేస్ ప్రకటించారు.