AP Secretariat Fire Accident: ఆంధ్రప్రదేశ్ సచివాలయం (AP Secretariat)లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. తెల్లవారుజామున సెక్రటేరియట్ లోని రెండో బ్లాక్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగింది. వెంటనే అప్రమత్తమైన ఎస్పీఎఫ్ సిబ్బంది.. అగ్నిమాపక దళాలకు సమాచారం అందించారు. దీంతో ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకొని మంటలను అదుపుచేశారు.
సచివాలయం రెండో బ్లాక్ లోని బ్యాటరీలు ఉంచే ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. ఘటన జరిగిన బ్లాక్ లోనే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఛాంబర్ సైతం ఉంది. అలాగే ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ (Payyavula Keshav), పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ (Nadendla Manohar), పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ (Kandula Duregesh), దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Anam Rama Narayana Reddy), మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి నారాయణ, హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత (Vangalapudi Anitha) పేషీలు కూడా అక్కడే ఉన్నాయి.
Also Read: MLC Nagababu: వర్మకు నాగబాబు మరో ఝలక్.. పిఠాపురంలో అకస్మిక పర్యటన.. చెక్ పెట్టేందుకేనా?
తెల్లవారుజామున ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పిందని చెప్పవచ్చు. ఉద్యోగులు ఎవరూ లేకపోవడంతో పెను విపత్తు నుంచి బయటపడినట్లు అగ్నిమాపక సిబ్బంది చెబుతున్నారు. మరోవైపు ఘటనపై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీస్తున్నారు. ప్రమాదానికి సంబంధించి అందుబాటులో ఉన్న వివరాలను అధికారులు హోంమంత్రికి అందజేశారు. ఇది సాధారణంగా జరిగిన ప్రమాదామా? లేదా ఎవరైన కుట్ర చేసి చేశారా అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.