Broken Mirror Image Source Pixabay
లైఫ్‌స్టైల్

Broken Mirror: వాస్తు ప్రకారం పగిలిన అద్దం ఇంట్లో ఉంచుకుంటే.. జీవితం నాశనమవుతుందా?.. దీనిలో వాస్తవమెంత?

Broken Mirror: మన అందరి ఇళ్ళలో అద్దం కచ్చితంగా ఉంటుంది. అది చిన్నది కావొచ్చు .. పెద్దది కావొచ్చు .. ఏదొక అద్దం అయితే పక్కా ఉంటుంది. కానీ, ఒక్కోసారి అనుకోకుండా చేతిలో నుంచి జారి అద్దం కింద పడి పగిలిపోతుంటుంది. అయిన కూడా కొందరు అలాగే ఉపయోగిస్తుంటారు. ఇంకొందరు పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచడకూడదని పారేస్తుంటారు. కానీ మన పెద్దలు వాస్తు ప్రకారం పగిలిన అద్దంలో ముఖం చూసుకోకూడదని, అలా చూసుకుంటే అనేక సమస్యలు వస్తాయని చెబుతుంటారు. దీనిలో వాస్తవమెంత అనేది ఇక్కడ తెలుసుకుందాం..

లక్ష్మీ దేవి..

పురాతన కాలంలో లక్ష్మీ దేవిని అద్దంగా భావించే వాళ్ళు. ఎందుకంటే, అద్దంలో మిమల్ని మీరు చూసుకున్నప్పుడు లక్ష్మీదేవి కూడా మురిసిపోయేదట. అద్దం కింద పడి పగిలిన రోజు లక్ష్మీ దేవి కూడా ముక్కలవుతుందని నమ్మేవాళ్ళు. మీ ఇంట్లో ఉన్న సంతోషం, డబ్బు అన్నింటినీ కోల్పోతారని సంకేతం. అద్దం పగిలితే, ఇంట్లో భయంకరమైన కష్టాలు తప్పవు, ప్రశాంతత ఉండదు, ఇంకా జీవితంలో ఎన్నో సమస్యలు వస్తాయని పురాణాలు కూడా చెబుతున్నాయి. మన తర తరాల వారు కూడా అద్దాన్ని దేవతగా కొలిచేవాళ్ళు.

Also Read:  Collector Anudeep Durishetty: ప్రభుత్వ ఆసుపత్రుల్లో గర్భిణిలకు.. సరైన వైద్యం అందించాలి జిల్లా కలెక్టర్ సూచన

జ్యోతిష్యశాస్త్ర గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే..

జ్యోతిష్యశాస్త్ర గ్రంథాలు ఏం చెబుతున్నాయంటే.. అద్దం పగిలినప్పుడు ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ ఎక్కువయ్యి పనులు కూడా చేయలేరు. అలాగే, అద్దం సరైన దిశలోనే అమర్చాలి. ఇంటి ముందు అద్దాలు ఉంచరాదు .. బయట వాళ్ళ ప్రతిబింబాలు దానిలో కనిపించినప్పుడు మీ ఇంట్లోకి దుష్ట శక్తులు వస్తాయని చెబుతున్నాయి. ఇంట్లో అద్దం తల మీద ఉంటే, అది మంచి ఫలితాలను ఇవ్వదని విశ్వసిస్తారు.

Also Read: AP Rains: ఏపీ వర్షాలపై లేటెస్ట్ అప్ డేట్.. ఆ జిల్లాలలో ఉరుములు.. మెరుపులే.. తస్మాత్ జాగ్రత్త

పురాణాలు ఏం చెబుతున్నాయంటే..

పురాణాలు ఏం చెబుతున్నాయంటే.. పగిలిన అద్దంలో పదే పదే ప్రతిబింబం చూసుకుంటే మరణం సంభవించవచ్చని చెబుతున్నాయి. కాబట్టి, పగిలిన అద్దాన్ని ఇంట్లో ఉంచకూడదని వాస్తు నిపుణులు కూడా సూచిస్తున్నారు.

Just In

01

Sensational Cases: రాష్ట్రంలో సంచలన కేసులు.. నత్తనడకగా విచారణ.. ఇది దేనికి సంకేతం..?

Turakapalem Village: ఎవరూ వంట చేసుకోవద్దు.. కనీసం నీళ్లూ తాగొద్దు.. ప్రభుత్వం ఆదేశాలు

Ponguleti Srinivasa Reddy: త్వరలో సాదాబైనామాలకు మోక్షం.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Su From So OTT release: ‘ఓటీటీలోకి వచ్చేస్తున్న కామెడీ థ్రిల్లర్.. ఎక్కడంటే?

BRS Party: గులాబీ పార్టీకి డ్యామేజ్.. కంట్రోల్ చేసేందుకు ప్రయత్నం?.. సాధ్యపడేనా..?