Collector Anudeep Durishetty: గర్భిణీలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాన్పులు చేసుకునేలా గర్భిణీలను ఆశా, ఏఎన్ఎం, వైద్య సిబ్బంది చైతన్యపర్చాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి సూచించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వివిధప్రోగ్రామ్ అధికారులు, ఎస్ పీ హెచ్ఓలు,వైద్యా ధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో జిల్లా కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వం వైద్య రంగానికి ఎంతో ప్రాధాన్యతనిస్తుందని, ఆ దిశగా రోగులకు మెరుగైన వైద్య సేవలు అందాలని సూచించారు.
ప్రతి పీహెచ్ సీలో గర్భిణీ ల రిజిస్ట్రేషన్, ప్రసవాలు, వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమం, రాష్ట్రీయ బాల స్వస్తియ కార్యక్రమం, అసంక్రమిత వ్యాధులు, కుష్టు వ్యాధి నివారణ, క్షయ వ్యాధిపై వైద్య విభాగాల వారీగా సమీక్షించారు. గర్భిణీ ల రిజిస్ట్రేషన్ లో ఆశా, ఏ ఎన్ ఎం ల పాత్ర ప్రముఖంగా ఉండాలని,విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సత్వర చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లాలో 68 శాతం ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రులలో,అలాగే 42 శాతం ప్రసవాలు ప్రవేట్ ఆసుపత్రుల్లో జరిగాయని పేర్కొన్నారు.
Also Read; Collector Muzammil Khan: రైతన్నను మెచ్చుకున్న జిల్లా కలెక్టర్.. అసలు స్టోరీ ఇదే!
ప్రభుత్వ ఆసుపత్రులలో 72 శాతం వరకు పెంచేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా జిల్లాలో బీసీజీ 129 శాతం ఓపీవీ 120 శాతం, హైపర్ టైటిస్ బి 94 శాతం అలాగే పెంటా వాక్సిన్ 129 శాతం చేపట్టడం జరిగిందన్నారు.ఇలాంటి కార్యక్రమాల నిర్వహణ కోసం వచ్చే సంవత్సరం కూడా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసి అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.ఆర్బిఎస్ కే కార్యక్రమంలో భాగంగా ఇప్పటివరకు 147 కేసులను రిఫరల్ ఆస్పత్రులకు పంపి న్యూరో, ఆర్తో, డెంటల్ అలాగే అనీమియా కేసులకు మెరుగైన వైద్యం అందించడం జరిగిందని వివరించారు.
Also Read : TGCET Results 2025: తెలంగాణ CET ఫలితాలు విడుదల.. 36,334 మందికి సీట్లు
అసంక్రమిత వ్యాధులను నివారించుటకు ప్రజల్లో అవగాహన కల్పించాలని ధూమాపానం, మద్యం సేవించుట, ఆహారపు అలవాట్ల పై పూర్తి అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లాలోని పాఠశాలలు, కళాశాల విద్యార్థులకు మానసిక వ్యాధి నిపుణుల ద్వారా అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారణకు ప్రత్యేక కృషి చేయాలని ఆదేశించారు. గతం కంటే ప్రస్తుతం ఆత్మహత్య నివారణ చర్యలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు. ఎన్ సి డి ద్వారా డయాబెటిస్, బ్లడ్ ప్రెషర్, క్యాన్సర్, హార్ట్ స్ట్రోక్,బ్రెస్ట్ కాన్సర్, లపై పెద్ద ఎత్తున ప్రజలకు అవగాహన కల్పించే దిశగా కార్యచరణ చేపట్టాలని వైద్య అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో అదనపు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ జయమాలిని , చల్లాదేవి డీడీసీ ఓ డాక్టర్ సరస్వతి, ఇన్ ఛార్జి అడిషనల్ డీఎంహెచ్ఓ చల్లాదేవి, మాస్ మీడియా అధికారి,జే.రాములు,డిప్యూటీ డెమో నరసింహ , జిల్లాలోని అందరూ ప్రోగ్రాం ఆఫీసర్లు ,ఎస్బీహెచ్ ఓలు వైద్యాధికారులు, తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/ లింక్ క్లిక్ చేయగలరు