MLC Nagababu (Image Source: Twitter)
సూపర్ ఎక్స్‌క్లూజివ్

MLC Nagababu: వర్మకు నాగబాబు మరో ఝలక్.. పిఠాపురంలో అకస్మిక పర్యటన.. చెక్ పెట్టేందుకేనా?

MLC Nagababu: పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నియోజకవర్గమైన పిఠాపురం (Pithapuram Assembly constituency) గత కొన్ని రోజులుగా రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. పవన్ కల్యాణ్ గెలుపులో కీలకంగా వ్యవహరించిన టీడీపీ నేత వర్మ.. ప్రస్తుతం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే జనసేన నేత నాగబాబు.. పార్టీ ఆవిర్భావ సభలో పవన్ గెలుపునకు ఎవరూ బాధ్యులు కాదని తేల్చి చెప్పారు. ఈ కామెంట్స్ పై వర్మ అనుచరులు గరం గరంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన నాగబాబు.. పిఠాపురానికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు.


నాగబాబు పర్యటన
కూటమి ప్రభుత్వంలో ఎమ్మెల్సీగా బాధ్యతలు చేపట్టిన జనసేన నేత నాగబాబు (MLC Naga babu).. పిఠాపురంలో తన తొలి అధికారిక పర్యటనను ఖరారు చేశారు. ఏప్రిల్ 4, 5 తేదీల్లో నియోజకవర్గంలో ఆయన పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పిఠాపురంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలు, నూతన నిర్మాణాలను నాగబాబు ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమంలో శాసన మండలి ప్రభుత్వ విప్ శ్రీ పిడుగు హరి ప్రసాద్ గారు, టిడ్కో చైర్మన్ శ్రీ వేముల పాటి అజయ్ కుమార్, పిఠాపురం ఇంచార్జి శ్రీ మర్రెడ్డి శ్రీనివాస్ హాజరుకానున్నారు.

వర్మకు చెక్ పెట్టడానికేనా?
పవన్ కల్యాణ్ గెలవకముందు నుంచి ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మ (SVSN Varma).. పిఠాపురం టీడీపీ ఇంఛార్జిగా ఉంటూ వచ్చారు. పవన్ సడెన్ ఎంట్రీతో సీనంతా రివర్స్ అయ్యింది. పొత్తులో భాగంగా ఆయన తన సీటును పవన్ కు త్యాగం చేశారు. ఆ తర్వాత ఎన్నికల ప్రచారంలోనూ పవన్ వెంటే తిరిగారు. పవన్ గెలుపునకు వర్మ చాలా కృషి చేశారని ఆయన వర్గం చెబుతుంటుంది. ఈ క్రమంలోనే డిప్యూటీ సీఎం పవన్ నియోజకవర్గంలో లేని సమయంలో వర్మనే అధికారాన్ని చెలాయిస్తున్నారన్న ప్రచారం కూడా ఉంది. ఈ క్రమంలో నాగబాబు.. పిఠాపురంపై ఫోకస్ పెట్టడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఇక పిఠాపురం బాధ్యతలను పవన్ పేరు మీద నాగబాబే చూస్తారని జనసేన వర్గాలు చర్చించుకుంటున్నాయి. దీంతో వర్మకు చెక్ పెట్టేందుకే నాగబాబు పిఠాపురంలో అడుగుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.


Also Read: Sharmila On Avinash Reddy: నెక్స్ట్ టార్గెట్ సునీతేనా? షర్మిల సంచలన కామెంట్స్

వర్మ నెక్ట్స్ టార్గెట్ ఏంటి?
ఎస్.వీ.ఎస్.ఎన్. వర్మకు అటు టీడీపీలో గానీ.. ఇటు జనసేనలో గానీ సముచిత స్థానం దక్కడం లేదని ఆయన అనుచరులు కోపంతో ఉన్నారు. ఈ క్రమంలోనే వర్మ.. త్వరలో వైసీపీలో చేరతారన్న ప్రచారం పెద్ద ఎత్తున మెుదలైంది. వైసీపీ సోషల్ మీడియా (YCP Social Media).. వర్మ రాకను ముందుగానే ఖరారు చేసేస్తోంది. అయితే జోరుగా జరుగుతున్న ఈ ప్రచారాన్ని వర్మ గానీ, అతడి అనుచర వర్గం గానీ ఖండించడం లేదు. దీంతో వైసీపీలోకి ఆయన వెళ్లడం ఖాయమేనన్న సందేహాలు ఏపీ రాజకీయాల్లో వ్యక్తమవుతున్నాయి. అదే జరిగితే పిఠాపురం నుంచి వంగా గీతను తప్పించి.. వర్మకు వైసీపీ ఇంఛార్జ్ బాధ్యతలు అప్పగించే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు