Karate Classes for Girls: అమ్మాయిలకు ఆత్మరక్షణ విద్య ఎంతో అవసరమని ప్రతి ఒక్కరు వినియోగించుకొని ముందుకు రావాలని ఆందోల్ టీఎస్ డబ్ల్యూ ఆర్ ఈఎస్ వైస్ ప్రిన్సిపల్ భవాని అన్నారు. గురువారం అందోలులోని టీఎస్ డబ్ల్యూ ఆర్ ఈ ఎస్ ఆవరణలో వారియర్ మార్షల్ ఆర్ట్స్ అకాడమీ గ్రాండ్ మాస్టర్ పోచయ్య ఆధ్వర్యంలో సుమారు 150 మంది విద్యార్థినీలకు ప్రత్యేక బెల్ట్ ఎగ్జామ్ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ గత రెండు నెలలుగా పాఠశాల ఆవరణలో మార్షల్ ఆర్ట్స్ సెల్ఫ్ డిఫెన్స్ పాఠశాలలు నేర్పించడం ఎంతో ఆనందదాయకమని ఆమె అన్నారు.
Also Read: Naa Anvesh – HCU Land: నా అన్వేష్‌ను తెగ వాడేసిన బీఆర్ఎస్.. బిగ్ షాకిచ్చిన అన్వేష్..
కరాటే విద్య ద్వారా ప్రతి విద్యార్థి తమ భవిష్యత్తులో ఉన్నత విజయాలు సాధించడానికి ముందుకు సాగుతారని అన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థినిలు ప్రత్యేక ప్రతిభను కనబరిచి బెల్టులు, సర్టిఫికెట్లు కైవసం చేసుకున్నారు. ఎగ్జామ్ లో విద్యార్థులు చేసిన మార్షల్ ఆర్ట్స్ విన్యాసాలు అందరిని ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో కరాటే మాస్టర్‌లు మురళి, షాదుల్లా, నవీన్, మహేష్ విష్ణువర్ధన్, హరి ప్రసాద్, సుప్రియ, స్పందన, సింధు, ప్రణవి, భానుప్రియ, సంజన, మాధవి, భవజ్ఞ ఉపాధ్యాయునిలు తదితరులు పాల్గొన్నారు.
స్వేచ్ఛ ఈ పేపర్ కోసం ఈ https://epaper.swetchadaily.com/క్ క్లిక్ చేయగలరు