Suryapet: అరుదైన శాస్త్ర చికిత్స ద్వారా మహిళ కడుపు నుంచి భారీ కణితి తొలంగించిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలంలో చోటు చేసుకుంది. పట్టణంలోని విష్ణు జనరల్ ల్యాప్రోస్కోపిక్ హాస్పటల్ వైద్యుడు అనంతు విష్ణువర్ధన్ గౌడ్ తెలిపిన వివరాల ప్రకారం
సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామానికి చెందిన సరోజన (42) గత కొంత కాలంగా కడుపునొప్పితో బాధపడుతూ బుధవారం చికిత్స నిమితం తమ హాస్పిటల్ కు రాగా గురువారం వైద్య పరీక్షలు నిర్వహించి.. స్కానింగ్ చేయగా అండాశయం వద్ద 7 కిలోల కణితి ఉన్నట్లుగా గుర్తించారు.
ఈ క్రమంలో సదరు మహళకు హస్పటల్ లో అరుదైన శస్త్ర చికిత్స చేసి అండాశయం వద్ద ఉన్న 7 కిలోల కణితిని తొలగించారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య స్థితి బాగానే ఉన్నట్లుగా డాక్టర్ విష్ణువర్ధన్ గౌడ్ తెలిపారు.
Also read: Jack Trailer: ‘మిషన్ బటర్ ఫ్లై’ వర్సెస్ ‘ఆపరేషన్ రెడ్ థండర్’.. ట్రైలర్ ఎలా ఉందంటే?