Mazaka: యంగ్ హీరో సందీప్ కిషన్, రావు రమేష్ తండ్రీకొడుకులుగా నటించిన చిత్రం ‘మజాకా’. ‘ధమాకా’ దర్శకుడు త్రినాథరావు నక్కిన దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా థియేటర్లలో అనుకున్నంత సక్సెస్‌ని మాత్రం సాధించలేదు. దీంతో టీమ్ అంత నిరాశలో ఉంది. కారణం, ‘ధమాకా’ను మించి ఈ సినిమా సక్సెస్ అవుతుందని.. విడుదలకు ముందు టీమ్ అంతా ప్రచారం చేసింది. ముఖ్యంగా త్రినాధరావు నక్కిన ‘మజాకా’ విషయంలో ఫుల్ కాన్పిడెంట్‌గా కనిపించారు. సందీప్ కిషన్ కూడా ఈసారి తెలుగులో తనకి పక్కాగా హిట్ వస్తుందని ఫిక్సయిపోయారు. కానీ విడుదల తర్వాత వారి ఆశలన్నీ ఆవిరైపోయాయి. ఇందులో ఎంటర్‌టైన్‌మెంట్ లోటులేనప్పటికీ, కాన్సెప్ట్‌లో ఉన్న కన్ఫ్యూజన్, ఈ సినిమాను ప్రేక్షకుల చెంతకు చేర్చలేకపోయింది. మరి థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా, ఉగాది స్పెషల్‌గా ఓటీటీలోకి వచ్చింది.
Also Read- Jack Trailer: ‘మిషన్ బటర్ ఫ్లై’ వర్సెస్ ‘ఆపరేషన్ రెడ్ థండర్’.. ట్రైలర్ ఎలా ఉందంటే?
ఓటీటీలో ఈ సినిమా మంచి స్పందనను రాబట్టుకుంటున్నట్లుగా సదరు ఓటీటీ అధికారికంగా ప్రకటించింది. ఉగాది స్పెషల్‌గా జీ5 ఓటీటీలోకి ఈ సినిమా స్ట్రీమింగ్‌కు వచ్చింది. ప్రస్తుతం జీ5 ఓటీటీలో టాప్‌లో ట్రెండ్ అవడమే కాకుండా.. 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను సైతం రాబట్టుకోవడం విశేషం. ఈ సినిమా 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను క్రాస్ చేసినట్లుగా జీ5 ఓటీటీ సంస్థ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేసింది. అంటే, ఈ సినిమా ఓటీటీలో వర్కవుట్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇందుకు ముందు ఇదే ఓటీటీలో విడుదలైన ‘సంక్రాంతికి వస్తున్నాం’ ఓటీటీ రికార్డులను బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. థియేటర్లలో దుమ్మురేపిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా, ఓటీటీలోనూ అదే జోరును కొనసాగించింది. ఆ సినిమా తర్వాత జీ5లోకి మరికొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చినా, ఆ స్థాయిలో అయితే ఆదరణను దక్కించుకోలేదు. మళ్లీ ‘మజాకా’ చిత్రమే ఆ క్రెడిట్‌ను సొంతం చేసుకుంది.
100 Million Streaming Minutes, just like that – with so much fun, mazaa and entertainmentttt 🥳🥳
Don’t miss #MazakaOnZee5@sundeepkishan @riturv #RaoRamesh @AnshuActress @TrinadharaoNak1 @KumarBezwada @leon_james @AnilSunkara1 @RajeshDanda_ @balajigutta @lemonsprasad pic.twitter.com/DZRzihYTOF
— ZEE5 Telugu (@ZEE5Telugu) April 3, 2025
ఓటీటీ ప్రేక్షకులు రావు రమేష్, సందీప్ కిషన్ల నటనకు ఫిదా అవుతున్నారు. తండ్రీ కొడుకులుగా వారిద్దరూ ఈ సినిమాలో నవ్విస్తూనే, ఆడియెన్స్‌ని ఎమోషనల్‌కు గురి చేస్తారు. ఈ కామెడీ, సెంటిమెంట్ ఓటీటీ ప్రేక్షకులను బాగా నచ్చేసింది. థియేటర్లలో మెప్పించకపోయినా, ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న ఆదరణ చూసి టీమ్ టీముంతా సంతోషాన్ని వ్యక్తం చేస్తుంది. ఈ సందర్భంగా జీ5 సౌత్ వైస్ ప్రెసిడెంట్ లాయిడ్ జేవియర్ సైతం తన సంతోషాన్ని తెలియజేశారు. ఆయన మాట్లాడుతూ.. ‘ప్రాంతీయ చిత్రాల్లో ప్రస్తుతం ‘మజాకా’ చిత్రం జీ5లో ట్రెండ్ అవుతోంది. తెలుగులో కొత్త మైలురాయిని నెలకొల్పిన ‘మజాకా’ విజయంతో మేము చాలా సంతోషంగా ఉన్నాం. రావు రమేష్, సందీప్ కిషన్ కాంబోని అందరూ ఇష్టపడుతున్నారు. తండ్రీకొడుకులుగా వారిద్దరి నటన అందరినీ ఆకట్టుకుంది. ఈ విజయం మా ప్రేక్షకులకు మంచి కంటెంట్‌ను అందించే జీ5 నిబద్ధతను మరింత బలోపేతం చేస్తుందని అన్నారు.
Also Read- Actress: ఆ సినిమాలో థియేటర్లో ఆడియన్స్‌ని భయపెట్టిన అమ్మాయి ఎవరో తెలుసా..?
ఓటీటీలో ఈ సినిమాకు వస్తున్న స్పందన చూసి రావు రమేష్, సందీప్ కిషన్ కూడా వీక్షకులకు థ్యాంక్స్ చెప్పారు. ‘మజాకా’ సినిమాకు ఓటీటీలో వస్తున్న స్పందన చూసి నేను నిజంగా థ్రిల్ అయ్యాను. లవ్, కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా వచ్చిన ఈ సినిమాను జనాలు జీ5లో ఇంత ఆదరించడం చూస్తుంటే ఆనందంగా ఉంది. ప్రేక్షకుల నుంచి వస్తున్న ఈ సానుకూల స్పందనకు ఎంతో ఆనందమేస్తోంది. ఇంత మంచి చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన వారికి ఎప్పుడూ కృతజ్ఞుడినే అని రావు రమేష్ అంటే, ‘‘డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లో ‘మజాకా’కు వస్తున్న అద్భుతమైన స్పందన చూసి ఎంతో సంతోషంగా ఉందని, పక్కింటి అబ్బాయిలా ఉండే కృష్ణ పాత్రను పోషించడం సవాల్‌గా అనిపించినా.. అలాంటి పాత్రను పోషించడం ఆనందంగా ఉంది’’ అని అన్నారు హీరో సందీప్ కిషన్. మా సినిమాను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థ్యాంక్స్ అని వారిరువురు తెలిపారు.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు