Visakhapatnam: ఇటీవలే భార్య, భర్తల మధ్య తగాదాలు ఎక్కువవుతున్నాయి. చిన్నగా మొదలైన గొడవలు ఒకర్నినొకరు కొట్టుకుని, చంపుకునే వరకు వెళ్తున్నాయి. ఇద్దరూ జాబ్స్ చేయడంతో నువ్వెంత..అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్తున్నారు. తాజాగా, విశాఖలో దారుణం జరిగింది. భర్త కొట్టడంతో భార్య చికిత్స పొందుతూ మృతి చెందింది.
భార్య, భర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతుండేవి. కోపంలో భర్త కొట్టడంతో భార్య చికిత్స పొందుతూ మరణించింది. భర్త కొట్టడంతో పక్కనున్న కరెంట్ పోల్ కి తల తగిలి తలకు భాగానికి గాయం కావడంతో, దీంతో ఆమె స్పృహా కోల్పోయింది. వెంటనే KGH లో చికిత్స పొందుతూ హాస్పిటల్ కు తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందింది.
వైజాగ్ డాన్సర్స్ అసోసియేషన్లో భర్త బంగార్రాజు, మృతురాలు రమాదేవి డాన్సర్స్ గా పని చేస్తున్నారు. భర్తతో కలిసి మాధవధారలో నివాసం ఉంటున్నారు. చిన్న చిన్న గొడవలు రావడంతో అల్లిపురం వెంకటేశ్వర మెట్టు వద్ద తల్లి ఇంటికి చేరుకున్న రమాదేవి వెళ్ళింది. మూడు రోజుల క్రితం భర్త బంగార్రాజు అత్తగారి ఇంటికి అల్లిపురం వెళ్లి గొడవ పెట్టుకున్నాడు. భర్త కోపాన్ని కంట్రోల్ చేసుకోలేక భార్యను గట్టిగా కొట్టడంతో తల పోల్ కి వెళ్ళి తగిలింది. చికిత్స పొందుతూ ప్రాణాలు వదిలింది. భర్త పైన కేసు నమోదు చేసి టూ టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.