Jagityal District(image credit: X)
తెలంగాణ

Jagityal District: కమిషన్ కొనుగోలా? ఓపెన్ వేలమా? మామిడి కొనుగోలు పై మల్లగుల్లాలు..

కరీంనగర్‌,స్వేచ్ఛః Jagityal District: మామిడి కాయల ఉత్పత్తికి పెట్టింది పేరు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా.. పాత జిల్లా పరిధిలోని ప్రస్తుతం కొత్త జిల్లాలు అయిన జగిత్యాల, పెద్దపల్లి, రాజన్నసిరిసిల్ల జిల్లాతో పాటు కరీంనగర్‌ జిల్లాలో సుమారుగా 80వేల ఎకరాల్లో మామిడి తోటలు విస్తరించి ఉన్నాయి. ప్రతియేటా ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా వ్యాప్తంగా ఉత్పత్తి అయ్యే మామిడి కాయలు దేశంలోని పలు రాష్ట్రాలకు వ్యాపారులు తరలిస్తారు. ఉమ్మడి జిల్లాలోని మామిడి పండ్లకు దేశంలోని ఢిల్లీ, హర్యాణ, జమ్ముకశ్మీర్‌, మహారాష్ట్ర, పంజాబ్‌ రాష్ట్రాలతో పాటు వివిధ ప్రధాన పట్టణాలకు తరలించడంతో పాటు దుబాయి వంటి దేశాలకు ఎగుమతి అవుతుంటాయి.
మామిడి సీజన్‌ వచ్చిందంటే చాలు జగిత్యాల జిల్లా కేంద్రంలో ప్రతి యేటా కోట్ల రూపాయాల వ్యాపారం జరుగుతుంది. ఇక్కడ పండించే బెంగనపల్లి, దశేరి, హిమాయత్‌ వంటి రకాలను దేశంలోని వివిధ ప్రాంతాల వ్యాపారులు ఇక్కడికి వచ్చి మామిడి కొనుగోలు చేసి వివిధ ప్రాంతాలకు తరలిస్తారు. సీజన్‌లో అధికారికంగా రూ. 400కోట్ల నుంచి రూ. 500 కోట్ల వరకు వ్యాపారం జరుగుతుందని అంచనా.. ప్రతియేటా ఏప్రిల్‌ నెలలో ప్రారంభమై జూన్‌ వరకు మామిడి వ్యాపారం జరుగుతుంది. రైతులు పండించిన మామిడి పండ్లను విక్రయించడానికి జగిత్యాల జిల్లా చల్‌గల్‌లో ప్రత్యేకంగా మామిడి మార్కెట్‌ను ఏర్పాటు చేశారు. సీజన్‌ ప్రారంభం కావడంతో మామిడి కాయలు మరో వారం 10రోజుల్లో మార్కెట్‌కు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈఏడాది ఏపద్దతి మామిడి కొనుగోలు చేయాలనే విషయంపై ఇప్పటి వరకు అధికారులు ఎలాంటి స్పష్టత ఇవ్వడం లేదు..
ఓపెన్‌ పద్దతిలో..
ఓపెన్‌ పద్దతిలో మామిడి కాయలు కొనుగోలు చేస్తే రైతులకు మేలు జరుగుతుందని రైతులు అంటున్నారు. ఓపెన్‌ మార్కెట్‌లో కొనుగోలు చేయడం వలన స్థానిక వ్యాపారులతో పాటు దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు కొనుగోలు చేయడం వలన పోటీ పెరిగి ధర పెరిగి రైతులకు గిట్టుబాటు అవుతుందని అంటున్నారు. ఈపద్దతిలో మామిడి కాయలు కొనుగోలు చేస్తే మార్కెట్‌ ఫీజు నాలుగు శాతం చెల్లించాల్సి వస్తుంది. అదే విధంగా స్థానిక వ్యాపారులతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యాపారులు సిండికేట్‌గా మారితే ధరలు తగ్గే అవకాశం ఉందనే అందోళన సైతం పలువురు రైతులు వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్‌కు తీసుకువచ్చిన మామిడి కాయలు వ్యాపారులు కొనుగోలు చేయమని మెండికేస్తే తిరిగి ఇంటికి తీసుకుపోవడం కష్టం. వ్యాపారులు చెప్పిన ధరకు విక్రయించాల్సి వస్తుందని మరి కొందరు రైతులు అంటున్నారు.

Also read: TGSRTC: టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం.. ఇక నుండి ఉద్యోగులకు మరిన్ని వైద్య సేవలు.. 

కమీషన్‌ పద్దతిలో..
కమీషన్‌ పద్దతిలో కొనుగోలు చేస్తే మార్కెట్‌లో లైసెన్స్‌ తీసుకున్న వ్యాపారులు మాత్రమే కొనుగోలు చేస్తారు. రైతులు తన తోట నుంచి శాంపిల్‌గా కొన్ని కాయలు తీసుకువచ్చి వ్యాపారులకు చూపిస్తాడు. రైతుకు ధర నచ్చితే తోట నుంచి కాయలు సేకరించి మార్కెట్‌కు తీసుకువస్తాడు. కమీషన్‌ పద్దతిలో మార్కెట్‌కు శాంపిల్‌ తీసుకువచ్చినప్పుడు ఒక రేటు కాయలు తీసుకువచ్చిన సమయంలో మరో రేటుతో రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అంతే కాకుండ కాష్‌ కటింగ్‌ పేరుతో రైతుల వద్ద నగదు కోత విధిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. రెండు పద్దతుల్లో ఏపద్దతి మేలు అవుతుందో అర్ధం కాక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఒక వర్గం వారు కమీషన్‌ పద్దతి అంటే మరో వర్గం వారు ఓపెన్‌ మార్కెట్‌ అంటున్నారు. ఫైనల్‌గా అధికారులు ఏలాంటి నిర్ణయం తీసుకుంటారో అని అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

Just In

01

Donald Trump: భారత్‌పై ట్రంప్ యూటర్న్.. మోదీ ఎప్పటికీ ఫ్రెండే అంటూ.. దగ్గరయ్యేందుకు తాపత్రయం!

SIIMA Awards 2025: సైమా 2025 విజేతలు ఎవరంటే?.. ఖుషీ అవుతున్న ఆ హీరోల ఫ్యాన్స్

Telangana Jagruthi: తెలంగాణ జాగృతి సంస్థ నాయకులు ఫైర్.. కారణం అదేనా..?

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు