Singeetam Srinivasa Rao about Aditya 369
ఎంటర్‌టైన్మెంట్

Singeetam Srinivasa Rao: శ్రీకృష్ణదేవరాయలు పాత్ర‌లో మరో హీరోని ఊహించుకోలేను

Singeetam Srinivasa Rao: సింగీతం శ్రీనివాసరావు.. ఈ పేరుకి పరిచయం అక్కరలేదు. అప్పుడెప్పుడో వచ్చిన ‘ఆదిత్య 369’ నుంచి రీసెంట్‌గా వచ్చిన ‘కల్కి 2898AD’ వరకు సింగీతం తన ప్రతిభను కనబరుస్తూనే ఉన్నారు. సింగీతం గొప్పతనం ఏమిటంటే.. ఆల్‌రౌండర్ ఆయన. అవును ఒక్కో దర్శకుడికి ఒక్కో శైలి ఉంటుందని అంటుంటారు. కానీ, సింగీతం‌లో అన్ని రకాల దర్శకులు మిళితమై ఉన్నారనేది, ఆయన చేసిన సినిమాలు చూస్తే అర్థమవుతోంది. ఇవాళ పాన్ ఇండియా అని పరుగులు పెడుతున్నారు కానీ, ఆయన అప్పుడెప్పుడో చేసిన సినిమాలన్నీ పాన్ ఇండియా కాన్సెప్ట్ లే! ఇది కచ్చితంగా అంతా అంగీకరించాల్సిందే. అలాంటి పాన్ ఇండియా కాన్సెప్ట్‌లో ఒక చిత్రం నందమూరి నటసింహం బాలకృష్ణ నటించిన ‘ఆదిత్య 369’. ఈ దృశ్యకావ్యాన్ని శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్ నిర్మించగా, దాదాపు 34 సంవత్సరాల తర్వాత సరికొత్తగా ముస్తాబై ఈతరం ప్రేక్షకుల్ని సైతం మంత్రముగ్ధుల్ని చేసేందుకు ఏప్రిల్ 4న గ్రాండ్‌గా రీ రిలీజ్ కాబోతోంది. ఈ నేపథ్యంలో 93 ఏళ్ల నవ యువ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు.. ఈ సినిమాకు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాట్లాడుతూ..

Also Read- Mega Daughter Niharika: నిహారిక నెక్ట్స్ ఎవరితోనో తెలుసా?

‘‘34 ఏళ్ల క్రితం విడుదలైన ‘ఆదిత్య 369’ సరికొత్తగా 4కెలో డిజిటలైజ్ అయి, 5.1 సౌండ్ మిక్స్‌తో వస్తుండటం అనేది నాకు చాలా చాలా వండర్ ఫుల్ ఎక్స్‌పీరియెన్స్. మేము అప్పుడీ సినిమాను ఒక టైప్ ఆఫ్ టెక్నికల్ యాక్సిలెరెన్స్‌లో చేశాము. ఇప్పుడున్న టెక్నాలజీ గురించి తెలిసిన తర్వాత.. అరెరే ఈ సినిమాని ఇప్పుడు తీసుంటే బాగుండేదే అని అనిపించిన క్షణాలెన్నో ఉన్నాయి. నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమాను కంప్లీట్‌గా అప్‌గ్రేడ్ చేసి, కాంటెంపరరీ టెక్నాలజీకి ఈక్వెల్‌గా చేసి రీ రిలీజ్ చేస్తానంటే.. ఆస‌క్తి ఉన్న‌ ప్రేక్ష‌కుల‌కే కాదు, నాలాంటి వాళ్ల‌కి కూడా చూడాల‌నిపిస్తుంది. నిజంగా ఇది ఒక థ్రిల్లింగ్ ఎక్స్‌పీరియెన్స్.

ఇందులో ఆర్టిస్ట్‌ల విషయానికి వస్తే.. ముందు బాల‌కృష్ణని అనుకున్నాం. ఆ త‌ర్వాత కృష్ణ‌ప్ర‌సాద్ ఆర్టిస్ట్‌ల సెల‌క్ష‌న్ బాధ్య‌త‌ తీసుకున్నారు. హీరోయిన్‌గా విజ‌య‌శాంతి ఉంటే బాగుంటుంద‌ని కృష్ణ‌ప్ర‌సాద్, బాల‌కృష్ణ‌ భావించారు. ఆమె కూడా చాలా ఎక్సైట్ అయింది. కానీ ఆమె కాల్షీట్లు ఈ సినిమాకు సెట్ అవ్వ‌లేదు. ఈ పర్టికులర్ సబ్జెక్టుకు ఆర్టిస్ట్‌ల టైం అనేది మోర్ ఇంపార్టెంట్. కావాల్సిన‌ప్పుడు ఆర్టిస్టులు అందుబాటులో ఉండ‌టం ఎంతో అవ‌స‌రం. అప్పుడు మోహిని అనే అమ్మాయిని అనుకున్నాం. ఆ అమ్మాయి ఈ సినిమాలోకి ఎలా వ‌చ్చిందంటే.. ‘మైఖేల్ మదన కామ రాజు’ అనే సినిమాకు వ‌ర్క్ చేస్తున్న స‌మ‌యంలో ఒక రోజు ద‌ర్శ‌క‌ర‌చ‌యిత పంజు అరుణాచలంతో మాట్లాడుతున్నాను. ఆయ‌నకు హార్స్ రేసులపై మ‌క్కువ ఎక్కువ‌. ఎప్పుడూ హార్స్ రేసుల‌కు సంబంధించి పుస్తకాలు ప‌ట్టుకుని ఉండేవారు. మేమిద్ద‌రం మాట్లాడుకుంటూ ఉండ‌గా.. ఆయ‌న చెప్పారు. త‌మ‌ హార్స్ క్ల‌బ్‌లో సెక్రటరీ కూతురు చూడ‌చ‌క్క‌గా ఉంటుందని మోహినిని ప‌రిచ‌యం చేశారు. అప్ప‌టికే త‌మిళంలో ఆమె రెండు సినిమాలు చేసింది. దాంతో ఆమెను ఆడిష‌న్ చేశాము. యాక్టింగ్, డ్యాన్స్ చ‌క్క‌గా చేస్తుంది.. పైగా అడిగిన‌న్ని కాల్షీట్స్ ఇచ్చేందుకు రెడీగా ఉంది. కెమెరామన్ పీసీ శ్రీరామ్ కూడా మోహినిని రికమండ్ చేశారు.

Also Read- IPL Betting Addiction: పల్లెలకు పాకిన ఐపీఎల్ బెట్టింగ్.. నిఘా పెంచిన పోలీస్

అలాగే టినూ ఆనంద్‌తో నాకు ముందు నుంచి ప‌రిచ‌యం ఉంది. ప్రొఫెసర్ పాత్ర‌కు బాగా సెట్ అవుతారని ఆయ‌నని తీసుకున్నాము. ఇక రెగ్యుల‌ర్ సినిమాల్లో మాదిరి భ‌య‌పెట్టే విల‌న్‌ కాకుండా పిల్ల‌ల‌కు కూడా ఎంట‌ర్టైనింగ్‌గా అనిపించే విల‌న్ కావాల‌ని అమ్రీష్‌పురిని ఎంచుకున్నాం. ఆయ‌న‌ క్యారెక్ట‌ర్‌ను కూడా కొంచెం ఫ‌న్నీగా డిజైన్ చేశాము. శ్రీకృష్ణదేవరాయలు పాత్ర‌కు ఫ‌స్ట్ ఛాయిస్ మాత్రం బాల‌కృష్ణే. మ‌రెవ్వ‌రిని మేము అనుకోలేదు. ఇప్ప‌టికీ ఆ పాత్ర‌లో బాల‌కృష్ణని త‌ప్ప మ‌రొక‌రిని ఊహించ‌లేను.’’ అని చెప్పుకొచ్చారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు