TGSCSC Students(Image credit: Twitter)
తెలంగాణ

TGSCSC Students: గ్రూప్ – 1 ఫలితాల్లో తెలంగాణ సత్తా.. అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

TGSCSC Students: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) ఇటీవల విడుదల చేసిన గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితాలో తెలంగాణ షెడ్యూల్డ్ కులాల స్టడీ సర్కిల్ (టీజీఎస్‌సీఎస్సీ) విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ జాబితాలో స్టడీ సర్కిల్‌కు చెందిన 68 మంది విద్యార్థులు 400 కంటే ఎక్కువ మార్కులు సాధించి ఉన్నత ర్యాంకులను కైవసం చేసుకున్నారు. వీరిలో 40 మందికి పైగా విద్యార్థులు గ్రూప్-1లో డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ వంటి ప్రతిష్ఠాత్మక ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రిన్సిపాల్ సెక్రటరీ, ఎస్‌సీడీడీ టీజీఎస్‌సీఎస్సీ అధ్యక్షుడు ఎన్. శ్రీధర్ (ఐఏఎస్) తెలిపారు.

ఈ సందర్భంగా ఎన్. శ్రీధర్ మాట్లాడుతూ.. స్టడీ సర్కిల్ విద్యార్థులు సాధించిన విజయాలను వివరించారు. బి. వనజ (38వ ర్యాంక్), ఆర్. మేరీ గోల్డ్ (56వ ర్యాంక్), ఎం. రవితేజ (66వ ర్యాంక్), కిషన్ పటేల్ (72వ ర్యాంక్), ఇ. రాకేష్ (78వ ర్యాంక్), బి. శ్రావణ్ (84వ ర్యాంక్), డి. ప్రవీణ్ (105వ ర్యాంక్) జనరల్ స్టేట్ టాప్ ర్యాంకులను సాధించారని పేర్కొన్నారు. అంతేకాకుండా, ఎస్సీ కేటగిరీలో 2, 3, 4 మరియు 10వ స్టేట్ ర్యాంకులు, ఎస్టీ కేటగిరీలో 2వ స్టేట్ ర్యాంక్, బీసీ-డీ కేటగిరీలో 10వ స్టేట్ ర్యాంక్‌ను విద్యార్థులు సొంతం చేసుకున్నారని ఆయన వెల్లడించారు.

Read also: నిరుద్యోగులూ.. అప్లై చేసుకున్నారా? కలెక్టర్ సమీక్ష

ఈ విజయాల నేపథ్యంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, పీడబ్ల్యూడీ వర్గాలకు చెందిన నిరుద్యోగ యువత కోసం కోచింగ్ కార్యక్రమాలను నిర్వహించేందుకు సకాలంలో నిధులు మంజూరు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎన్. శ్రీధర్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిధుల వల్ల విద్యార్థులకు పోటీ పరీక్షలకు సమర్థవంతమైన శిక్షణ అందించడం సాధ్యమైందని, ఫలితంగా ఎక్కువ మంది రాష్ట్ర మరియు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం లభిస్తుందని ఆయన ఆకాంక్షించారు.

గ్రూప్-1 ఉద్యోగాలకు ఎంపికయ్యే అవకాశం ఉన్న విద్యార్థులందరికీ ఎన్. శ్రీధర్ అభినందనలు తెలియజేశారు. ఈ విజయం స్టడీ సర్కిల్ శిక్షణ నాణ్యతకు, విద్యార్థుల కృషికి నిదర్శనంగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.

Just In

01

Gopichand33: యాక్షన్ మోడ్‌లో గోపీచంద్.. తాజా అప్డేట్ ఇదే..

Premaledhani: ‘ప్రేమ లేదని’ గ్లింప్స్ విడుదల.. ఎలా ఉందంటే?

Taapsee Pannu: ముంబైలోనే ఉన్నా.. ఆ ప్రచారాలు ఆపండి

Jubilee Hills Bypoll: ఆ రెండు పార్టీల మధ్యే పోటీ!.. జూబ్లీహిల్స్ క్షేత్రస్థాయి పరిస్థితి ఇదే!

OG Movie: ఓటీటీలోనూ ఊచకోత మొదలెట్టిన ‘ఓజీ’.. 8 దేశాల్లో టాప్ 1 ప్లేస్‌లో!