Mega Daughter Niharika: మెగా డాటర్ నిహారిక యమా స్పీడ్ మీదుంది. విడాకుల అనంతరం ఆమె మళ్లీ మీడియా ముందుకు రాదని చాలా మంది అనుకున్నారు. కానీ, ధైర్యంగా ఓ మహిళ ఎలా నిలబడగలదో చూపెడుతూ.. ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తుంది. నిర్మాతగా తన పింక్ ఎలిఫెంట్ ఫిక్చర్స్ బ్యానర్‌పై మంచి కథాబలమున్న చిత్రాలను సెలక్ట్ చేసుకుంటూ, ఇండస్ట్రీలో తన మార్క్‌ని ప్రదర్శిస్తోంది. రీసెంట్‌గా ‘కమిటీ కుర్రోళ్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టిన నిహారిక.. ఇప్పుడు తన నెక్ట్స్ సినిమాకు రంగం సిద్ధం చేసుకుంటుంది. ఈసారి తను నిర్మించబోయే సినిమా ఓ ఎనర్జిటిక్ హీరోతో ఉంటుందని ఇటీవల ఆమె ప్రకటించిన విషయం తెలిసిందే. ఆమె చెప్పినట్లుగానే ఆ హీరో పేరుతో కొన్ని వివరాలను తన బ్యానర్ నుంచి అధికారికంగా విడుదల చేసింది.
Also Read- Naga Vamsi: నిర్మాత నాగవంశీని బాయ్‌కాట్ చేసే దమ్ముందా?
నిహారిక తన నిర్మాణ సంస్థ పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై చేస్తున్న రెండో చిత్రం మానస శర్మ దర్శకత్వంలో ఉండబోతుంది. ‘మ్యాడ్, మ్యాడ్ స్క్వేర్’ చిత్రాల్లో అద్భుతమైన నటనతో ప్రతిభావంతుడైన, ఎనర్జిటిక్ యంగ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న సంగీత్ శోభన్ ఈ చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. సంగీత్ సోలో హీరోగా నటించనున్న తొలి సినిమా ఇదే కావడం విశేషం. ‘మ్యాడ్’ సిరీస్ చిత్రాలలో ఆయన మరికొంత మంది హీరోలతో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా తర్వాత అతని కెరీర్ మరింతగా పుంజుకుంటుందని, అలాంటి కథతో ఈ సినిమా ఉంటుందని చిత్రయూనిట్ చెబుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను అతి త్వరలోనే మేకర్స్ వెల్లడించనున్నారు.
Also Read- Raghurama Krishnam Raju: విచారణకు ప్రభావతి సహకరించాల్సిందే.. రఘురామ కేసులో సుప్రీంకోర్టు ఆదేశాలు
సంగీత్ శోభన్‌తో నిహారిక కొన్ని వెబ్ ఫిల్మ్స్‌ని ఇప్పటికే నిర్మించింది. అంతేకాదు, ఆ వెబ్ ఫిల్మ్స్‌కి డైరెక్టర్ మానస శర్మ కూడా భాగమై ఉండటం గమనార్హం. ఆ వివరాల్లోకి వెళితే.. జీ5తో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ రూపొందించిన వెబ్ సిరీస్ ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి మానస శర్మ రచయిత వ్యవహరించింది. ఈ వెబ్ సిరీస్‌లో సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటించారు. అలాగే సోనీ లివ్ రూపొందించిన ‘బెంచ్ లైఫ్’కి మానస శర్మ దర్శకురాలిగా పని చేశారు. ఇప్పుడు పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై నిహారిక నిర్మిస్తోన్న ఈ సినిమాతో మానస శర్మ ఫీచర్ ఫిల్మ్ డైరెక్టర్‌గా అరంగేట్రం చేయబోతున్నారు. ఈ చిత్రానికి మానస శర్మ కథను అందిస్తుండగా, మహేష్ ఉప్పల కో రైటర్ బాధ్యతలతో పాటు స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించనున్నారు. నిర్మాతగా నిహారిక కొణిదెల 2024లో విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ చిత్రంతో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకుని తెలుగు చిత్రపరిశ్రమలో సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్‌గా తన మార్క్‌ను క్రియేట్ చేశారు. ఇప్పుడు రాబోయే ఈ సినిమాతోనూ మరోసారి తన సక్సెస్‌ని కంటిన్యూ చేస్తుందని యూనిట్ ధీమాని వ్యక్తం చేస్తోంది.
స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు