BC Dharna at Jantar Mantar(Image Credit: Twitter)
తెలంగాణ

BC Dharna at Jantar Mantar: ఢిల్లీలో బీసీ పోరు.. గళమెత్తిన తెలంగాణ కాంగ్రెస్

BC Dharna at Jantar Mantar: బీసీ రిజర్వేషన్ల బిల్లును పార్లమెంట్‌లో ఆమోదించాలని, దేశవ్యాప్తంగా కులగణన జరపాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘాలు మహాధర్నా చేపట్టాయి. ఈ ధర్నాలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు ఇతర మంత్రులు, బీసీ ఎమ్మెల్యేలు పాల్గొననున్నారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, దానిని రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చాలని ఈ ధర్నా ద్వారా బీసీ సంఘాలు కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ఈ డిమాండ్‌ను మరింత బలోపేతం చేసేందుకు, మహాధర్నా అనంతరం తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రులు మరియు జాతీయ నేతలతో సమావేశమై బీసీ రిజర్వేషన్ల పెంపుకు మద్దతు తెలపాలని కోరనుంది.

ఈ సందర్భంగా బీసీ సంఘాల నేతలు మాట్లాడుతూ.. దేశంలో సామాజిక న్యాయం సాధించాలంటే కులగణన అత్యవసరం. బీసీలకు తగిన ప్రాతినిధ్యం, అవకాశాలు కల్పించేందుకు రిజర్వేషన్లు 42 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ ఆందోళన ద్వారా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి, బీసీల దీర్ఘకాల డిమాండ్‌ను నెరవేర్చాలని వారు వ్యాఖ్యానించారు.

Also Read: కేంద్రంపై బీసీ నేతల పోరుబాట.. ఢిల్లీలో మహా ధర్నాకు సర్వం సిద్దం!

తెలంగాణ నుంచి పాల్గొనే నేతలు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం గట్టి నిబద్ధతతో ఉందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో బీసీల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని వ్యాఖ్యానించారు. రాహుల్ గాంధీ కూడా ఈ ధర్నాలో భాగస్వామ్యం కానుండటం ఈ పోరు జాతీయ స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది.

మహాధర్నా తర్వాత తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రులతో జరిపే చర్చలు ఈ ఉద్యమ భవిష్యత్తును నిర్ణయించే అవకాశం ఉంది. బీసీ రిజర్వేషన్ల పెంపు కోసం దేశవ్యాప్తంగా ఏకమైన గొంతుకను వినిపించేందుకు ఈ ధర్నా ముఖ్యమైన అడుగుగా పలువురు బీసీ మేధావులు పరిగణిస్తున్నారు.

బీసీ రిజర్వేషన్లు.. కాంగ్రెస్ పోరాటం..
బీసీ సామాజిక వర్గాలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ బలమైన పోరాటాన్ని కొనసాగిస్తోంది. కులగణన జరిపి, తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీలో బీసీ బిల్లు ఆమోదించిన ప్రభుత్వం.. ఆ తర్వాత ఈ బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి ఆమోదం పొందేలా చేయడం కోసం బహుముఖ వ్యూహంతో కాంగ్రెస్ ముందుకు సాగుతోంది. ఈ పోరాటం బీసీలకు సామాజిక న్యాయం కల్పించడంతో పాటు వారి రాజకీయ, ఆర్థిక హక్కులను కాపాడటం లక్ష్యంగా పెట్టుకున్నది.

కాంగ్రెస్ పార్టీ దీర్ఘకాలంగా దేశవ్యాప్త కులగణన జరపాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోంది. ఈ డిమాండ్‌ను బలోపేతం చేసేందుకు ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా జరిగే బీసీ సంఘాల ఆందోళనలకు మద్దతు తెలుపుతూ, ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే మహాధర్నాలోనూ పాల్గొంటున్నారు. ‘కులగణన లేకుండా బీసీలకు న్యాయం జరగదు. జనాభాలో వారి నిజమైన శాతాన్ని తెలుసుకోవడం ద్వారానే సరైన రిజర్వేషన్లు కల్పించగలం’ అని రాహుల్ గాంధీ గతంలో పలు సందర్భాల్లో పేర్కొన్నారు. ఈ డిమాండ్‌ను జాతీయ స్థాయిలో బలంగా వినిపించేందుకు కాంగ్రెస్ రాష్ట్రాల్లోనూ ఉద్యమాలను సమన్వయం చేస్తోంది.

తెలంగాణ అసెంబ్లీలో ఆమోదం పొందిన ఈ బిల్లును పార్లమెంట్‌లోనూ ప్రవేశపెట్టి, రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్‌లో చేర్చేందుకు కాంగ్రెస్ ఒత్తిడి తెస్తోంది. ఈ లక్ష్యంతో ఢిల్లీలో జరిగే మహాధర్నాలో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డితో పాటు టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, ఇతర బీసీ ఎమ్మెల్యేలు పాల్గొని కేంద్రంపై ఒత్తిడి పెంచనున్నారు. ధర్నా అనంతరం తెలంగాణ మంత్రుల బృందం కేంద్రమంత్రులు, జాతీయ నేతలతో సమావేశమై, ఈ బిల్లుకు మద్దతు కూడగట్టేందుకు చర్చలు జరపనుంది.

Also Read: మంత్రివర్గ విస్తరణ.. మళ్లీ మొదటికొచ్చిందా? అసలేం జరుగుతోంది?

కాంగ్రెస్ నేతలు ఈ పోరాటాన్ని రాజకీయంగా మాత్రమే కాకుండా సామాజిక న్యాయ ఉద్యమంగా చూస్తున్నారు. ‘బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడం ద్వారా విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యంలో వారికి తగిన అవకాశాలు లభిస్తాయి. ఇది కాంగ్రెస్ యొక్క చిరకాల సామాజిక న్యాయ లక్ష్యం’ అని రాహుల్ గాంధీ ఒక సందర్భంలో పేర్కొన్నారు.

ఈ పోరాటంలో బీసీ సంక్షేమ సంఘాలతో కాంగ్రెస్ సమన్వయం చేస్తూ ముందుకు సాగుతోంది. జంతర్‌మంతర్ వద్ద జరిగే మహాధర్నా ఈ సమన్వయానికి ఒక ఉదాహరణగా నిలుస్తుంది. ఈ ఉద్యమం ద్వారా కాంగ్రెస్ బీసీల గొంతును జాతీయ స్థాయిలో వినిపించడంతో పాటు, కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేస్తోంది.

కులగణన నుంచి పార్లమెంట్ ఆమోదం వరకు బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించేందుకు కాంగ్రెస్ చేస్తున్న ఈ పోరాటం దేశంలో సామాజిక న్యాయ ఉద్యమంలో కీలక ఘట్టంగా నిలిచే అవకాశం ఉన్నది రాజకీయ విశ్లేషకులు, వివిధ సంఘాల నేతలు భావిస్తున్నారు.

Just In

01

Viral Video: యూనివర్శిటీలో దారుణం.. విద్యార్థి చెంపపై 50-60 సార్లు దాడి.. వీడియో వైరల్

Ponguleti Srinivasa Reddy: పేద ప్రజల అభ్యున్నతే సీఎం కల.. మంత్రి కీలక వ్యాఖ్యలు

Niharika Konidela: ‘కమిటీ కుర్రోళ్లు’ ఖాతాలో మరో రెండు.. హిస్టరీ క్రియేట్ చేసిన నిహారిక!

Shreyas Iyer: శ్రేయస్ అయ్యర్‌కు కెప్టెన్సీ.. ఇండియా-ఏ జట్టుని ప్రకటించిన బీసీసీఐ

Son Kills Father: రాష్ట్రంలో ఘోరం.. కూతురిపై చేతబడి చేశాడని.. తండ్రిని చంపిన కొడుకు