తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Kisan Yatra: రాష్ట్రంలో కిసాన్ యాత్రను ప్రారంభించాలని కాంగ్రెస్ పార్టీ ప్రణాళిక ను సిద్ధం చేస్తున్నది. త్వరలోనే షెడ్యూల్ విడుదల చేయనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ఈ యాత్ర ను నిర్వహించేలా పార్టీ నేతలు రెడీ అవుతున్నారు. ప్రతి గ్రామంలో రైతులతో మెంబర్షిప్ చేయించేలా డ్రైవ్ చేయనున్నారు. ఈ మెంబర్షిప్ కార్యక్రమాన్ని మంగళవారం పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో గాంధీభవన్ లో అధికారికంగా లాంచ్ చేశారు. యాత్ర ప్రారంభం కాగానే విడతల వారీగా జిల్లాల్లో డ్రైవ్ లు జరగనున్నాయి.
అంతేగాక రైతుల రుణ మాఫీ నుంచి ధాన్యం కొనుగోళ్ల వరకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, రైతులకు చేకూర్చిన లబ్ధి స్పష్టంగా అర్థమయ్యేలా వివరించనున్నారు. స్టేట్ కాంగ్రెస్ కు ఏఐసీసీ కూడా తాజాగా ఆదేశాలిచ్చింది. ఈ మేరకు ఆల్ ఇండియా కిసాన్ కాంగ్రెస్ కమిటీ వైస్ చైర్మన్ అఖిలేష్ సుక్లా, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు ప్రత్యేక లేఖ రాశారు.
యాత్ర ద్వారా వివరణ ఇలా..
ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక అమలు చేసిన పథకాలపై రైతులకు వివరించనున్నారు. రైతు రుణ మాఫీ, రైతుకు పెట్టుబడి సాయం, రైతు భరోసా, భీమా ప్రీమియ చెల్లింపు, పచ్చి రొట్టే విత్తనాల సబ్సిడీ, పంట నష్టం, డ్రిప్, స్పీంక్లేర్ ప్రోత్సాహక సబ్సిడీ, ఆయిల్ పామ్ సాగు ప్రోత్సాహక సబ్సిడీ, పట్టుగూళ్ల ప్రోత్సాహకం, మార్కెట్ యార్డులలో నిర్వహించిన అభివృద్ధి పనులు, రైతు వేదికల్లో పరికరాలు ఏర్పాటుతో పాటు పంటల కొనుగోళ్లపై క్లారిటీ ఇవ్వనున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ లోకి వచ్చాక ఎంత ఖర్చు చేశారు? రైతులకు ఎంత లబ్ధి జరిగింది? అనే వివరాలను వెల్లడించనున్నారు.
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు..
కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దేశ వ్యాప్తంగా రైతులను మోటివేట్ చేసేందుకు కాంగ్రెస్ ప్రయత్నాలు చేస్తున్నది. దీనిలో భాగంగానే కిసాన్ మజ్దూర్ సమ్మన్ , న్యాయ యాత్ర పేరిట దేశ వ్యాప్తంగా మెంబర్ షిప్ డ్రైవ్ ప్రారంభించింది. అన్ని రాష్ట్రాల్లో ఈ డ్రైవ్ చేయనున్నారు. ప్రతి జిల్లాలో దాదాపు వెయ్యి మందికి తగ్గకుండా మెంబర్షిప్ చేయించనున్నారు. ఆల్ ఇండియా కిసాన్ సెల్ ఆధ్వర్యంలో ప్రత్యేక యాప్ ను కూడా రెడీ చేశారు.ఈ యాప్ లో మెంబర్షిప్ పొందిన రైతుల వివరాలు లభ్యమవుతాయి.
Also Read: Vennam Srikanth Reddy: సన్నబియ్యం పంపిణీ షురూ.. టీపీసీసీ రాష్ట్ర కార్యదర్శి కీలక వ్యాఖ్యలు
దేశ వ్యాప్తంగా డ్రైవ్ పూర్తి కాగానే త్వరలో ఢిల్లీలో భారీ ధర్నా కార్యక్రమాన్ని కూడా నిర్వహించనున్నారు. మద్ధతు ధరకు చట్ట బద్ధత, రైతులకు లోన్లు, విత్తనాలు, ఎరువులకు సబ్సిడీ, విద్యుత్ పంపిణీ, జంతువుల నుంచి పంట రక్షణకు ప్రత్యేక విధానాలు, రైతు సంక్షేమ చర్యలు, క్రాప్ ఇన్సురెన్స్ వంటి పథకాలను దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేయనున్నారు.
తెలంగాణ మోడల్ పై అన్ని రాష్ట్రాల్లో ప్రచారం..
తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసిన రైతు రుణమాఫీ, రైతు భరోసా, విత్తనాల సబ్సిడీ వంటి విధానాలపై దేశ వ్యాప్తంగా ప్రచారం చేయనున్నారు. మన రాష్ట్రంతో పాటు మిగతా రాష్ట్రాల్లోనూ ఈ అంశాలపై పుల్ పబ్లిసిటీ ఇవ్వనున్నారు. కొన్ని ప్రాంతాలలో తెలంగాణ లో అమలు చేసిన ప్రాజెక్టుపై డెమో నిర్వహించనున్నారు. పవర్ పాయింట్ ప్రజేంటేషన్ ద్వారా రైతులకు తెలియజేయనున్నారు.
Also Read: Minister Ponnam prabhakar: దేశంలోనే తెలంగాణ ఫస్ట్.. కోటిమందిని కోటీశ్వరులం చేస్తాం.. మంత్రి పొన్నం