Hyderabad Footpaths incident (imagecredi:twitter)
తెలంగాణ

Hyderabad Footpaths incident: రోడ్డుపై నడిచేవాళ్లు జాగ్రత్త.. భయపెడుతున్న లెక్కలు!

తెలంగాణ బ్యూరో స్వేచ్ఛ: Hyderabad Footpaths incident: విశ్వనగరంలో పాదచారులు ట్రాఫిక్​ పద్మవ్యూహంలో అభిమన్యులవుతున్నారు. జరుగుతున్న ప్రమాదాల్లో నెలకు కనీసం 7 గురు మృత్యువాత పడుతుండగా 64 మందికి పైగా గాయపడుతున్నారు. వీరిలో కొందరు శాశ్వత అంగవికలురుగా మారి జీవచ్ఛవాల్లా మిగిలిపోతున్నారు. ఈ విషాదాలకు ప్రధాన కారణం ర్యాష్​ డ్రైవింగ్​ అని పోలీసు అధికారులు విశ్లేషిస్తున్నారు. ఇది కొంతవరకు నిజమే అయినా సురక్షితంగా దాటటానికి ఆయా రహదారులపై సరైన ఏర్పాట్లు లేకపోవటమే పాదచారుల ప్రాణాలు తీస్తోందన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

2024 చివరి నాటికి గ్రేటర్​ హైదరాబాద్​ లో 89 లక్ష​ల వాహనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏ రోడ్డు చూసినా నిత్యం వచ్చిపోయే వాహనాలతో కిటకిటలాడుతూ కనిపిస్తోంది. చాలా రహదారులపై అర్ధరాత్రి వరకు ఇదే పరిస్థితి నెలకొని ఉంటుండటం గమనార్హం. ఇటువంటి పరిస్థితుల్లో కొంతమంది వాహనదారులు చేస్తున్న ర్యాష్​ డ్రైవింగ్​ ప్రమాదాలకు కారణమవుతోంది.

Also Readl: Pastor Praveen Death: పాస్టర్ ప్రవీణ్ మృతిపై వీడని ఉత్కంఠ.. కొలిక్కి వచ్చేనా?

ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులు గాలితో పోటీ పడుతున్నట్టుగా రయ్యిన దూసుకెళుతుండటం యాక్సిడెంట్లకు దారి తీస్తోంది. ఇక్కడ గమనించాల్సిన అంశం ఏమిటంటే ముందుకు దూసుకెళ్లటమే లక్ష్యం అన్నట్టుగా వీళ్లు జిగ్​ జాగ్​ డ్రైవింగ్ చేస్తుండటం. ఇటువంటి పరిస్థితుల్లో అధికశాతం రహదారులపై సురక్షితంగా రోడ్డు దాటటానికి ఎలాంటి ఏర్పాట్లు లేకపోవటం పాదచారుల ప్రాణాల మీదకు తెస్తోంది. ప్రమాదాలను తగ్గించటానికి నిత్యం వాహనాలతో కిటకిటలాడే ట్యాంక్​ బండ్, మలక్​ పేట, మెహదీపట్నం తదితర ప్రాంతాల్లో పెలికాన్​ సిగ్నళ్లను ఏర్పాటు చేశారు.

రోడ్డు దాటే ముందు పాదచారులు పెలికాన్​ సిగ్నల్ ను ఆన్​ చేస్తే వాహనదారులు ఆగాల్సి ఉంటుంది. అయితే, ఈ సిగ్నళ్లను ఏ ఒక్కరు కూడా పట్టించుకోవటం లేదు. ఒకవైపు పాదచారులు సిగ్నల్​ ఆన్​ చేసి రోడ్డు దాటుతున్నా వాహనాలతో రయ్యిన దూసుకెళుతున్నారు. ఇక, కొన్నిచోట్ల ఫుట్​ ఓవర్​ బ్రిడ్జీలను ఏర్పాటు చేసినా వాటిని ఉపయోగించుకుంటున్న వారి సంఖ్య అంతంత మాత్రంగానే ఉంటోంది. అన్ని మెట్లు ఎక్కి బ్రిడ్జి పైనుంచి వెళ్లటం ఎందుకనుకుంటూ పాదచారులు రోడ్డు దాటుతూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు.

ఇక, రాంగ్​ రూట్​ డ్రైవింగ్​ కూడా పాదచారుల ప్రాణాలను బలి తీసుకుంటున్నది. ట్రాఫిక్​ విభాగానికి చెందిన ఓ సీనియర్​ అధికారితో మాట్లాడగా వాహనాలు నడిపే వారు స్వీయ క్రమశిక్షణను పాటిస్తే ఇలాంటి విషాదాలను తగ్గించవచ్చన్నారు. ఉన్న చోట్ల అయినా పెలికాన్​ సిగ్నళ్లను పట్టించుకోవాలని చెప్పారు. పరిమితికి మించిన వేగంతో జిగ్ జాగ్​ డ్రైవింగ్​ అస్సలు చేయవద్దన్నారు. ఇక, పాదచారులు కూడా జీబ్రా లైన్లు ఉన్న చోటే రోడ్లు దాటాలన్నారు. అప్పుడే కొన్ని ప్రాణాలైనా దక్కుతాయని వ్యాఖ్యానించారు.

Also Read: Alluri district News: తల్లి ముందే బిడ్డను ఎత్తుకెళ్లిన కిలేడీ.. 5 గంటల్లో సీన్ రివర్స్!

 

Just In

01

Gaddam Prasad Kumar: మహిళల ఆర్థిక అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యం.. గడ్డం ప్రసాద్ కీలక వ్యాఖ్యలు

Naresh65: కామెడీ గోస్ కాస్మిక్.. అల్లరి నరేష్ 65వ చిత్ర వివరాలివే..!

Drug Factory Busted:చర్లపల్లిలో డ్రగ్ తయారీ ఫ్యాక్టరీపై దాడి.. వేల కోట్ల రూపాయల మాదకద్రవ్యాలు సీజ్

Gold Kalash robbery: మారువేషంలో వచ్చి జైనమత ‘బంగారు కలశాలు’ కొట్టేశాడు

Director Krish: ‘హరి హర వీరమల్లు’ విషయంలో చాలా బాధగా ఉంది