Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ( Allu Arjun) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రీసెంట్ గా బన్నీ హీరోగా నటించిన ” పుష్ప2 ” మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికి తెలిసిందే. గతేడాది 2025 డిసెంబర్ లో రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పాత రికార్డులను బ్రేక్ చేసి, కొత్త రికార్డులను క్రియోట్ చేసింది. వరల్డ్ వైడ్ గా అల్లు అర్జున్ క్రేజ్ విపరీతంగా పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా పుష్ప2 లాంగ్ రన్ లో మొత్తం రూ. 1870 కోట్లకు పైగా కలెక్ట్ చేసి .. ఇండియన్ సినిమాలో హయ్యస్ట్ కలెక్షన్స్ సాధించిన రెండవ మూవీగా చోటు సంపాదించుకుంది. దీంతో, దేశమంతా ఐకాన్ స్టార్ ఇక్కడ తగ్గేదే లే అంటూ పేరు మారుమోగింది. అల్లు అర్జున్ అంటే పేరు ఒక్కటే కాదు పాన్ ఇండియా బ్రాండ్ అనే రేంజ్ కి ఎదిగాడు.
ఇదిలా ఉండగా ఈ నేపథ్యంలోనే ఓ ఆసక్తికరమైన వార్త నెట్టింట హల్చల్ చేస్తుంది. తెలిసిన సమాచారం ప్రకారం అల్లు అర్జున్ తన పేరును త్వరలో మార్చుకోనున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. న్యూమరాలజీ ప్రకారం బన్నీ తన పేరులోని లెటర్స్ ను మార్చే ఆలోచనలో ఉన్నారట. ఇప్పుడున్న లెటర్స్ తో పాటు U’లు, N’ లు కొత్తగా యాడ్ అవుతాయని సినీ వర్గాల నుంచి సమాచారం. అయితే, ఈ వార్తల్లో ఎంత వరకు నిజముందో తెలియాల్సి ఉంది.
Also Read: Inspector Jobs: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. పోలీసు ఉద్యోగాలకు నోటిఫికేషన్.. అర్హతలు ఇవే!
దీని గురించి అతని టీమ్ నుంచి ఇంకా ఎలాంటి సమాచారం బయటకు రాలేదు. ఇదిలా ఉండగా.. బన్నీ అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ పై రోజురోజుకూ అభిమానుల్లో ఆసక్తి పెరుగుతోంది. స్టార్ డైరెక్టర్ అట్లీతో కలిసి #AA22 అనే పాన్ ఇండియా చిత్రానికి రెడీ అవుతున్నారు. ఈ నెల 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ నుమూవీ టీం అధికారికంగా ప్రకటించింది. వీటితో పాటు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక మూవీని లైన్లో పెట్టారు. దీనిలో ఐకాన్ స్టార్ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపించనున్నారని టాక్ వినబడుతోంది.