స్వేచ్ఛ, సినిమా:Peddi vs Pushpa 2: చాలాకాలంగా కొణిదెల, అల్లు ఫ్యాన్ వార్ జరుగుతున్నది. పుష్ప 2 మూవీ సమయంలో ఇది పీక్స్‌కు చేరింది. అప్పటి నుంచి అల్లు అర్జున్, రామ్ చరణ్ సినిమాల మధ్య పోటీ ఎక్కువైంది. ప్రస్తుతం పెద్ది సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. షూటింగ్ సగం కూడా పూర్తి కాలేదు. కానీ, అప్పుడే ఆడియో రైట్స్ రూ.45 కోట్లకు అమ్ముడు పోయాయి. టీ సిరీస్ సంస్థ కొనుగోలు చేసింది. అయితే, పుష్ప 2 ఆడియో రైట్స్ అప్పట్లోనే రూ.54 కోట్లకు అమ్ముడుపోయాయి.
పెద్ది రూ.45 కోట్లే పలకడంతో బన్నీ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. దీంతో మళ్లీ అభిమానుల మధ్య ఫ్యాన్ వార్ మొదలయ్యింది. బుచ్చిబాబు, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘పెద్ది’ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. రెహమాన్ లాంటి బ్రాండ్ ఉన్నా కూడా ఈ సినిమా ఆడియో రైట్స్ కేవలం రూ.45 కోట్లకు మాత్రమే అమ్ముడుపోవడం ఏంటి అని ఇండస్ట్రీ నిపుణులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఈయన తెలుగు సినిమాకు సంగీతాన్ని అందించి చాలాకాలం అయ్యింది.
Also read: Arjun Son of Vyjayanthi: ‘నాయాల్ది’.. నాయుడేమన్నాడే.. వగలాడీ నీ నడకల్లో!