Mega157 Gang
ఎంటర్‌టైన్మెంట్

Mega157: బ్లాక్ బస్టర్ మెషీన్ డ్యూటీ ఎక్కేశాడు.. రాబోయే సంక్రాంతికి రఫ్ఫాడించుడే!

Mega157: మెగాస్టార్ చిరంజీవితో బ్లాక్ బస్టర్ మెషీన్ అనిల్ రావిపూడి ఓ సినిమా చేయబోతున్న విషయం తెలిసిందే. నూతన తెలుగు సంవత్సరం ఉగాదిని పురస్కరించుకుని ఈ సినిమా పూజా కార్యక్రమాలతో అట్టహాసంగా ప్రారంభమైంది. అలా ప్రారంభమైందో, లేదో.. అప్పుడు అనిల్ రావిపూడి డ్యూటీ ఎక్కేశాడు. ఇంతకు ముందు ఆయన డైరెక్ట్ చేసిన ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ప్రమోషన్స్‌ని ఎలా నిర్వహించాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా ఇండస్ట్రీకి ఒక లెసన్‌గా ఆయన ప్రమోషన్స్‌ని నిర్వహించారంటే అస్సలు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చిరుతో చేస్తున్న సినిమా ప్రారంభం నుంచే.. ప్రమోషన్స్‌ని స్టార్ట్ చేశాడీ బ్లాక్‌బస్టర్ డైరెక్టర్.

Also Read- Arjun Son of Vyjayanthi: ‘నాయాల్ది’.. నాయుడేమన్నాడే.. వగలాడీ నీ నడకల్లో!

మంగళవారం మెగా157కు సంబంధించిన క్రూని తెలియజేస్తూ ఓ వీడియోను అనిల్ రావిపూడి ట్విట్టర్ ఎక్స్ వేదికగా విడుదల చేశారు. చిరంజీవి హిట్ సినిమాలలోని డైలాగ్స్‌తో తన టీమ్‌ని నిలబెట్టి.. ఆ సినిమాలకు సంబంధించిన పోస్టర్ దగ్గర ఆ టీమ్ చిరంజీవిని ఇంట్రడ్యూస్ చేసుకునే వీడియో ఇది. ఇంతకు ముందు ఎప్పుడూ కూడా ఇలాంటి వీడియో రాలేదు అంటే, అనిల్ ఆలోచనలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. తన టీమ్‌ని అసిస్టెంట్ డైరెక్టర్స్, ఎడిటర్, మ్యూజిక్ డైరెక్టర్, నిర్మాతలు ఇలా టోటల్ క్రూ మొత్తాన్ని ఒక చోటకి చేర్చి, ఈ సినిమా ఏ స్థాయిలో ఉండబోతుందో, ఏ నేపథ్యంలో ఉండబోతుందో హింట్ ఇచ్చేలా తన టాలెంట్‌ని ప్రదర్శించాడు అనిల్ రావిపూడి. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఈ సినిమా కోసం తన గ్యాంగ్ ఎంతగా వేచి చూస్తుందనేది ఈ వీడియో ద్వారా తెలియజేశారు.

Also Read- RK Roja on Pawan Kalyan: శ్రీవారిని నిద్రపోనివ్వరా.. ఇదే మీ సనాతనమా.. పవన్ కు రోజా చురకలు

ముందుగా ఈ వీడియోలో.. మేమంతా డైరెక్షన్ డిపార్ట్‌మెంట్ అంటూ ‘చూడాలనివుంది’ పోస్టర్ వద్ద ఉన్న గ్యాంగ్ అంతా చిరంజీవికి పరిచయం చేసుకున్నారు. ‘అన్నయ్య’ సినిమా పోస్టర్ పెట్టి.. క్యారెక్టర్‌తో మా తమ్ముళ్లు జెమ్స్ అండీ జెమ్స్ అనే డైలాగ్‌ని అనుకరిస్తూ.. మా డైరెక్టర్ జెమ్ సార్..మేము కూడా జెమ్ లాగా వర్క్ చేస్తామని అడిషనల్ డైలాగ్ రైటర్స్ తమని పరిచయం చేసుకున్నారు. ‘హిట్లర్’ పోస్టర్ దగ్గర కో- రైటర్ నారాయణ, ‘రౌడీ అల్లుడు’ పోస్టర్ వద్ద కో-రైటర్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ సాయికృష్ణ.. ‘ముఠామేస్త్రి’ పోస్టర్ వద్ద ప్రొడక్షన్ డిజైనర్ ఏఎస్ ప్రకాశ్, ‘ఇంద్ర’ పోస్టర్ వద్ద ఎడిటర్ తమ్మిరాజు, ‘ఠాగూర్’ పోస్టర్ వద్ద డీఓపీ సమీర్ రెడ్డి, ‘మాస్టర్’ సినిమా పోస్టర్ వద్ద సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియో వంటి వారంతా తమని తాము పరిచయం చేసుకోగా, నిర్మాతలు సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ సినిమాతో ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ పండుగను ఆశించవచ్చని వాగ్దానం చేశారు. సుస్మిత కొణిదెల నీ ఇంటిపేరు నిలబెట్టాలంటూ తన కుమార్తెకు చిరు చిన్న కామిక్ టచ్ ఇచ్చారు.

ఫైనల్‌గా.. అందరూ కనిపించారు, అసలైన వాడు ఎక్కడ అని చిరు అనగానే.. అనిల్ రావిపూడి తన శైలిలో సెట్‌లోని నాయకత్వానికి అనుగుణంగా ‘గ్యాంగ్ లీడర్‌’ పోస్టర్ వద్ద గ్యాంగ్ లీడర్‌గా తనను తాను పరిచయం చేసుకుని ‘రఫ్ఫాడిద్ధం..’ అంటూ ఈ వీడియోని ముగించారు. మొత్తంగా అయితే ఈ వినూత్న వీడియో సినిమాపై భారీగా అంచనాలను పెంచేస్తుంది. బ్లాక్‌బస్టర్ లోడింగ్ అనే సంజ్ఞలు ఇస్తూ.. టీమ్ అంతా ఎంత ఉత్సాహంగా ఉందో తెలియజేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాను సంక్రాంతి 2026కు విడుదల చేయబోతున్నట్లుగా ఈ వీడియోలో మేకర్స్ ప్రకటించారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Crime News: తీరుమారని గంజాయి పెడ్లర్ పై పీడీ యాక్ట్.. ఉత్తర్వులు జారీ!

Crime News: హైదరాబాద్‌లో దారుణం.. మార్ఫింగ్ ఫోటోలతో యవతికి బెదిరింపులు

Teja Sajja: టాలీవుడ్ హీరోల గురించి ఎవరికీ తెలియని విషయం చెప్పిన తేజ సజ్జా.. ఇలా కూడా ఉంటుందా?

Balapur Laddu Auction 2025: బాలాపూర్ లడ్డు సరికొత్త రికార్డ్.. ఈసారి ఎన్ని రూ.లక్షలు పలికిందంటే?

Pending Bills: పెండింగ్‌లో అద్దెవాహన బిల్లులు.. ఖజానా కోసం ఎంపీడీవోల చూపులు