TG Singareni Collieries: సింగరేణి నయా టార్గెట్.. సాధ్యమైతే దశ తిరిగినట్లే! | Swetchadaily | Telugu Online Daily News
TG Singareni Collieries (imagecredit:twitter)
Telangana News

TG Singareni Collieries: సింగరేణి నయా టార్గెట్.. సాధ్యమైతే దశ తిరిగినట్లే!

కరీంనగర్‌ స్వేచ్ఛః TG Singareni Collieries: తెలంగాణ రాష్ట్రం సిరుల మాగాణి అయిన సింగరేణి సంస్థ 2025-26 ఆర్ధిక సంవత్సరానికి గాను 76 మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరంలో 72 మిలియన్‌ టన్నుల ఉత్పత్తి లక్ష్యం కాగా కొత్త ఆర్ధిక సంవత్సరంలో మరో నాలుగు మిలియన్‌ టన్నుల బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకుంది. ఈఆర్ధిక సంవత్సరం కొత్త గనుల ఏర్పాటుతో పాటు రానున్న రోజుల్లో బొగ్గు బ్లాక్‌ల వేలంలో సైతం పాల్గొని సింగరేణి భవిష్యత్‌ తరాలకు పునాది వేయడానికి సంస్థ ఆలోచనలు చేస్తుంది. 2024-25 ఆర్ధిక సంవత్సరం మార్చి 31తో ముగియడంతో 2025-26 ఆర్ధిక సంవత్సరంపై దృష్టి సారించింది. ఇప్పటికే అనుమతులు వచ్చిన గనుల్లో బొగ్గు ఉత్పత్తి ప్రారంభిస్తే మరో 10 మిలియన్‌ టన్నుల వరకు అదనంగా బొగ్గు ఉత్పత్తి అయ్యే అవకాశాలు ఉన్నాయి.

వేలంలో పాల్గొనే దిశగా.. 

ప్రస్తుతం సింగరేణి వ్యాప్తంగా సంస్థకు 28 అండర్‌ గ్రౌండ్ బొగ్గు గనులు ఉండగా 18 ఓపెన్‌ కాస్ట్‌ బొగ్గు గనులు ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న అండర్‌ గ్రౌండ్‌ బొగ్గు గనులతో పాటు కొన్ని ఓపెన్‌ కాస్ట్‌లలో రానున్న రోజుల్లో బొగ్గు ఉత్పత్తి కష్టం మారింది. ఈనేపథ్యంలో సింగరేణి సంస్థ కొత్త బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనే ఆలోచనలో ఉన్నట్లు తెలిసింది. కేంద్ర ప్రభుత్వం బొగ్గు గనుల వేలం వేయాలని నిర్ణయం తీసుకొగా రాష్ట్రంలో గతంలో అధికారంలో ఉన్న బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం బొగ్గు బ్లాక్‌ల వేలంలో పాల్గొనకుండ నిర్ణయం తీసుకుంది.

Alao Read: Bhatti Vikramarka: ప్రతి పథకం అందుతుందా? డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నలు..

గత ప్రభుత్వ నిర్ణయంతో సింగరేణికి చెందిన రెండు బొగ్గు గనులను ప్రైవేట్‌ సంస్థలు దక్కించుకున్నాయి. గడిచిన మూడు సంవత్సరాలుగా సింగరేణి సంస్థ కేంద్ర ప్రభుత్వ వేలం పాటలకు దూరంగా ఉండటంతో రానున్న రోజుల్లో సింగరేణి సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారే అవకాశాలు ఉన్నాయి. ఈనేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం నిర్వహించే వేలం పాల్గొనాలని సింగరేణిని విస్తరించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. సింగరేణి సంస్థ నిర్ణయం తీసుకుంటే తెలంగాణ, ఒరిస్సాతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సింగరేణి సంస్థ విస్తరించే అవకాశం ఉంది.

కొత్త గనుల్లో ఉత్పత్తిపై దృష్టి.. 

సింగరేణి సంస్థ ఇప్పటికే పలు కొత్త గనుల తవ్వకాలకు సంబంధించి అనుమతి పొందింది. ఈఆర్ధిక సంవత్సరంలో కొత్త గనుల్లో బొగ్గు ఉత్పత్తి లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా కొత్తగా ప్రారంభించనున్న వెంకటేష్ ఖని ఓపెన్‌ కాస్ట్‌కు పర్యావరణ అనుమతి లభించింది. ఇల్లందులోని రొంపెడు ఓపెన్‌ కాస్ట్‌కు అనుమతి వచ్చే అవకాశాలు ఉండగా గోలేటి ఓసీపీ, మాదారం ఓసీపీ, రామగుండం ఓసీపీలకు అనుమతులు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి.

ఇప్పటికే అనుమతులు వచ్చిన ఒరిస్సాలోని నైనీ బొగ్గు బ్లాక్‌కు సంబంధించి అడవీ శాఖకు భూబదలాయింపు ప్రక్రియ పూర్తి అయితే నైనీలో సైతం ఈఏడాది బొగ్గు ఉత్పత్తి చేసే అవకాశాలు ఉన్నాయి. మొత్తం మీదీ 2025-26 ఆర్ధిక సంవత్సరం సింగరేణికి మరో కీలక ఉత్పత్తి ఆర్ధిక సంవత్సరం కానున్నది.

Also Read; Drunken Drive: మందు కొట్టి బండి నడుపుతున్నారా.. ఇకా కటకటాలే

Just In

01

Bigg Boss Telugu 9: భరణి ఇమిటేషన్ అదుర్స్.. ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ లోడింగ్..

KTR Vs Congress: ఉప్పల మల్లయ్య ఇంటికి వెళ్లి.. కేటీఆర్ కీలక వ్యాఖ్యలు

Itlu Arjuna: ‘న్యూ గయ్ ఇన్ టౌన్’ ఎవరో తెలిసిపోయింది.. ‘సోల్ ఆఫ్ అర్జున’ వచ్చేసింది

India Vs South Africa: దక్షిణాఫ్రికాతో మూడో టీ20.. టాస్ గెలిచిన భారత్.. ఏం ఎంచుకుందంటే?

KCR: 19న కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్‌ఎల్పీ భేటీ.. మరో ప్రజా ఉద్యమం!.. కీలక నిర్ణయాలు!