జయశంకర్ భూపాలపల్లి స్వేచ్చ: Minister Sridhar Babu: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉగాది పండుగ రోజున పేదలకు ఉచిత సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంబించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని ఉన్నత కుటుంబాలు ఎలాగైతే సన్నబియ్యం తింటారో అలాగే పేదవారికి నాణ్యమైన బియ్యాన్ని అందించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. కాగా ఈ పథకాన్ని జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మంత్రి శ్రీధర్ బాబు లాంఛనంగా ప్రారంభించారు.
భూపాలపల్లి పట్టణంలోని 16వ వార్డులో సన్నబియ్యం ఉచిత రేషన్ పంపిణీలో మంత్రి శ్రీధర్, ఎమ్మెల్యే గండ్రం సత్యనారాయణ,ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ప్రకాశ్ రెడ్డి పాల్గోన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నికలున్న చోట మాత్రమే రేషన్ కార్డు ఇచ్చేదని అన్నారు. కాని మన ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిరాగానే రాష్ట్రంలోని ప్రజలందరికి వారు ఉన్న చోటుకే రేషన్ కార్డులు పంపిణి చేయనున్నామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ప్రభుత్వమన్న మంత్రి శ్రీధర్.. పేదలకోసం సన్నబియ్యం పంపిణీ చేస్తుందని అన్నారు.
Also Read: Bhatti Vikramarka: ప్రతి పథకం అందుతుందా? డిప్యూటీ సీఎం భట్టి ప్రశ్నలు..
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నంతకాలం పేదల కోసమే పనిచేస్తుందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం ధరణి పేరుతో దగాచేసి పేదల భూములు లాక్కుందని అన్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఇలాంటి అక్రమాలకు చెక్ పెట్టిందని గుర్తుచేశారు. రాష్ట్రంలో అనధికారంగా కొంతమంది రేషన్ కార్డులు పొందారని వాటిని తొలగించి అర్హులైన వారికి మాత్రమే కార్టులు మంజూరు చేస్తామని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు.
మరోవైపు రేషన్ ద్వారా పంపిణి చేస్తున్న దొడ్డుబియ్యాన్ని చాలా మంది ప్రజలు తినడం లేదని మంత్రి శ్రీధర్ అన్నారు. వాటిని తీసుకొని దళారులకు రూ.10 చొప్పున అమ్ముతున్నారు పేర్కొన్నారు. దళారులు అదే బియ్యాన్ని ప్రభుత్వానికి రూ.30 అమ్ముతున్నారని తెలిపారు. ప్రజలు బియ్యాన్ని అమ్ముకోవడం ద్వారా ఏటా ప్రభుత్వానికి కోట్ల రూపాయాల నష్టం వాటిల్లుతున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఇకపై ఇలాంటి అక్రమాలు జరగకుండా చేయడం కోసం సన్నబియ్యం పంపిణి చేసి దళారులను అడ్డుకుంటామని అన్నారు. ఇలా చేయండం ద్వారా దొడ్డు బియ్యం మాఫియాకు చెక్ పెడుతుందని మంత్రి శ్రీధర్ బాబు అభిప్రాయపడ్డారు.
Also Read: CM Revanth Reddy: యుద్ధప్రాతిపదికన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం.. పనులు పరిశీలించిన సీఎం రేవంత్