స్వేచ్ఛ, సినిమా: Puri Charmi New Project: పూరీ జగన్నాథ్, చార్మీ కలిసి పూరీ కనెక్ట్స్ అనే నిర్మాణ సంస్థను ప్రారంభించారు. ఈ నిర్మాణ సంస్థలో పూరీ జగన్నాథ్ డైరెక్ట్ చేసే సినిమాలను మాత్రమే నిర్మిస్తూ వస్తున్నారు. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్లు రావడంతో వీరిద్దరూ విడిపోయారన్న వార్తలు వచ్చాయి. ఇదే సమయంలో తమిళ స్టార్ హీరో అయిన విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ సినిమా చేయనున్నాడని కూడా ప్రచారం జరిగింది.
Also read: Genelia: ఇతరులను నమ్మడానికిలేదు.. జెనీలియా జ్ఞానోపదేశం
ఉగాది సందర్భంగా ఈ రెండు విషయాలపై ఒకేసారి క్లారిటీ ఇచ్చేశారు పూరీ, చార్మీ. వీరిద్దరూ కలిసి పూరీ కనెక్ట్స్ ద్వారా విజయ్ సేతుపతితో సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించారు. ‘ఈ ఉగాది సందర్భంగా ఒక సెన్సేషనల్ కాంబోతో అదిరిపోయే కొత్త చాప్టర్‌లోకి అడుగుపెడుతున్నాం’ అంటూ పూరీ కనెక్ట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఈ కాంబో సినిమాపై ప్రేక్షకులు అప్పుడే అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఈ సినిమా కేవలం తెలుగు, తమిళంలోనే కాకుండా మిగిలిన ఇండియన్ భాషల్లో కూడా విడుదల కానున్నదని ప్రకటించేసింది టీమ్. జూన్ నుండి ఈ మూవీ షూటింగ్ ప్రారంభమవుతుందని కూడా తెలిపింది.