Rain Alert: తెలుగు రాష్ట్రాల్లో భానుడు తన ప్రతాపం చూపిస్తున్నాడు. ఉదయం 7 గంటల నుంచే ఎండ తీవ్రత పెరగడంతో జనాలు వారి పనులు చేసుకోలేకపోతున్నారు. మార్చి నెలలోనే ఇలా ఉందంటే.. రాబోయే ఏప్రిల్, మే నెలల్లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించుకోండి. అయితే, మండే ఎండల నుంచి కొంచం రిలీఫ్ పొందే వార్త వాతావరణ శాఖ తెలిపింది.
ఛత్తీస్‌గఢ్ దాని పరిసర ప్రాంతాల్లో సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం బలహీనపడింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్ నుండి మహారాష్ట్ర, కర్ణాటక మీదుగా తమిళనాడు వరకు సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ద్రోణి కొనసాగుతుంది. దీని వలన రాబోయే మూడు రోజుల పాటు ఉష్ణోగ్రతలు పూర్తిగా తగ్గనున్నాయి. ఏప్రిల్ 1, 2, 3 తేదీల్లో ఉరుములు, మెరుపులతో వానలు పడే అవకాశం ఉంది. అలాగే, 30 నుంచి 40 కిలో మీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది. తెలంగాణలోని పలు జిల్లాలలో 38 డిగ్రీల పైనే నమోదు అయ్యే అవకాశం ఉంది.
సోమవారం అత్యధికంగా ఆదిలాబాద్ (Adilabad ) లో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు , నల్లగొండ ( Nallagonda ) లో అత్యల్పంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. ఇక ఆదివారం తెలంగాణ లోని భద్రాచలం, హైదరాబాద్ ( Hyderabad ), ఖమ్మం, నిజామాబాద్, రామగుండం ( Ramagundam) , నల్లగొండ, హనుమకొండ ( Hanamkonda) లలో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి. మెదక్..39.6, నిజామాబాద్..39.5, భద్రాచలం..40.4, ఆదిలాబాద్..40.3, మహబూబ్ నగర్..39.9, నల్లగొండ..38.5, హనుమకొండ..38.4, హైదరాబాద్..38.8, ఖమ్మం..38.6, రామగుండం..38.6, డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Also Read: IPL 2025: ఉప్పల్ స్టేడియంలో టికెట్ల లొల్లి.. వెళ్లిపోతామన్న సన్ రైజర్స్ టీమ్.. హెచ్ సీఏ ఆన్సర్ ఇదే!
అయితే, ఏపీలో పలు ప్రాంతాల్లో వర్ష పాతం నమోదు ఐనప్పటికి, కొన్ని జిల్లాల్లోని మండలాలలో వడగాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు జిల్లా-2, శ్రీకాకుళం జిల్లా-8, విజయనగరం జిల్లా-9, పార్వతీపురంమన్యం జిల్లా-10, తూర్పుగోదావరి-8, ఏలూరు వేలేరుపాడు మండలాల్లో వడగాలులు వీస్తాయి. అయితే, ఈ రోజు కూనవరం మండలం, అల్లూరి సీతరామరాజు చింతూరు వడగాలులు వీచే అవకాశం ఉందని వాతవరణ శాఖ అధికారులు తెలిపింది.