తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : TGPSC: గ్రూప్ 1 జనరల్ ర్యాంకింగ్ లిస్టును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదివారం రిలీజ్ చేసింది. మొత్తం 12,622 మంది అభ్యర్థులు క్వాలిఫై అయినట్లు టీజీపీఎస్సీ స్పష్టంచేసింది. అభ్యర్థుల సౌకర్యార్థం టీజీపీఎస్సీ అధికారిక వెబ్ సైట్లో ర్యాంకుల వివరాలను ప్రకటించింది. పరీక్ష రాసిన వారిలో 59.86శాతం మంది క్వాలిఫై అయ్యారు. కాగా టాపర్ గా మహిళా అభ్యర్థి నిలిచారు.
900 మార్కులకు గాను 550 మార్కులతో మల్టీజోన్ 2 కు చెందిన మహిళా అభ్యర్థి ప్రథమస్థానంలో నిలిచారు. కాగా ఈ మార్కుల వివరాలు వ్యక్తిగత లాగిన్ లో ఏప్రిల్ 5 వరకు, జీఆర్ఎల్ లిస్టు ఏప్రిల్ 28వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని టీజీపీఎస్సీ పేర్కొంది.జీఆర్ఎల్ ఆధారంగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేపట్టనున్నారు. అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని అధికారులు సూచించారు.
Also read: TG Revenue Department: గ్రామ పాలనాధికారులుగా వీఆర్వోలు.. వీఆర్ఏలు.. పాతవారికి మల్లీ చాన్స్..
టెక్నికల్ సమస్యలుంటే అభ్యర్థులు 040-23542185 లేదా 040-23542187 నెంబర్లకు కాల్ చేయాలని, లేదంటే helpdesk@tspsc.gov.in కు మెయిల్ చేయాలని సూచించారు. ఇదిలా ఉండగా తెలంగాణలో ఖాళీగా ఉన్న 563 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి గతేడాది అక్టోబర్ లో మెయిన్స్ ఎగ్జామ్స్ జరిగాయి. ఈ పరీక్షలకు 31,403 మందిని టీజీపీఎస్సీ ఎంపికచేసింది. కాగా వారిలో 21,093 మంది పరీక్ష రాశారు. ఈనెల10న గ్రూప్ 1 అభ్యర్థుల ప్రొవిజినల్ మార్కుల లిస్టును కమిషన్ రిలీజ్ చేసింది. దీంట్లో ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఈనెల10 నుంచి 24 వరకూ మార్కుల రీకౌంటింగ్ కు చేసుకునే అవకాశం కల్పించారు.
స్వేచ్ఛ Eపేపర్ కోసం ఈ లింక్ ని క్లిక్ చేయండి https://epaper.swetchadaily.com/
గ్రూప్ 1 టాప్ టెన్ ర్యాంకర్లు వీరే..
ర్యాంక్ హాల్ టికెట్ మార్కులు కమ్యూనిటీ
1 240946218 550.000 ఓసీ
2 240920349 535.500 బీసీ- ఏ
3 240907150 535.500 ఓసీ
4 240911068 532.500 ఓసీ
5 240918455 532.000 బీసీ-బీ
6 240911138 525.500 ఓసీ
7 240915311 524.000 ఓసీ
8 240913631 521.000 ఓసీ
9 240911097 521.000 బీసీ-బీ
10 240906021 519.000 ఓసీ